Navaratri Brahmotsavam | సూర్యప్రభ వాహనం విహరించిన మలయప్పస్వామి.. పరవశించిన భక్తజనం
Navaratri Brahmotsavam | తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో ఏడో రోజైన ఆదివారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన వాహనసేవలో సూర్యమండల మధ్యవర్తిగా స్వామివారు కొలువుదీరగా.. భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.
Devotional | Published On Oct 18, 2026, 4.29 pm IST
Navaratri Brahmotsavam | తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో ఏడో రోజైన ఆదివారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన వాహనసేవలో సూర్యమండల మధ్యవర్తిగా స్వామివారు కొలువుదీరగా.. భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.

సకల జీవకోటికి చైతన్యప్రదాత సూర్యభగవానుడు
సూర్యభగవానుడు సకల జీవరాశులకు చైతన్యాన్ని, ప్రకృతికి వెలుగును, జీవకోటికి శక్తిని ప్రసాదించే ఆరోగ్యప్రదాతగా పూజలందుకుంటున్నాడు. సూర్యతేజంతోనే చంద్రుడు సైతం ప్రకాశిస్తున్నాడని పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామివారి దర్శనం విశేష ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. సూర్యప్రభ వాహనంపై స్వామివారిని దర్శించుకోవడం వల్ల ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. సూర్యమండల మధ్యలో కొలువుదీరిన స్వామివారు భక్తులకు అభయప్రదానం చేశారు.

రాత్రి చంద్రప్రభ వాహనంపై విహారం
నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి 7 గంటలకు శ్రీ మలయప్పస్వామివారు చంద్రప్రభ వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరించనున్నారు. ఈ వాహనసేవలోనూ స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సూర్యప్రభ వాహనసేవలో తిరుమల పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు నన్నపనేని సదాశివరావు, జానకీ దేవి, సీవీఎస్వో మురళీకృష్ణతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Lok Bhavan | తెలంగాణ లోక్ భవన్లో ఆయుధ పూజ
- ●Navratri Special | ఆయుధ పూజ నుంచి ఆత్మనిగ్రహం వరకు.. దసరా చెప్పే జీవన పాఠాలు!
- ●Bhatti Vikramarka | రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి రూ. 2,500 కోట్లు : భట్టి విక్రమార్క
- ●Jagadish reddy | కన్నెపల్లి నుంచి నీళ్లు ఎత్తిపోసి ఉంటే.. ఈరోజు తెలంగాణలో కరువు ఉండేది కాదు
- ●Traffic Jam | ఊర్లకు బారులు తీరిన వాహనాలు.. టోల్ ప్లాజాల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్
- ●MVSR Student death Case | ఎంవీఎస్ఆర్ స్టూడెంట్కు కోటి పరిహారం ఇవ్వండి.. బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోండి

Lok Bhavan | తెలంగాణ లోక్ భవన్లో ఆయుధ పూజ

Navratri Special | ఆయుధ పూజ నుంచి ఆత్మనిగ్రహం వరకు.. దసరా చెప్పే జీవన పాఠాలు!

Bhatti Vikramarka | రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి రూ. 2,500 కోట్లు : భట్టి విక్రమార్క

Jagadish reddy | కన్నెపల్లి నుంచి నీళ్లు ఎత్తిపోసి ఉంటే.. ఈరోజు తెలంగాణలో కరువు ఉండేది కాదు





