త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Janhvi Kapoor | జాన్వీ కపూర్‌ సరికొత్త ప్రయాణం..! ఈ రంగంలోనైనా సక్సెస్‌ అవుతుందా?

Janhvi Kapoor | హీరోయిన్‌గా రాణిస్తూనే వ్యాపార రంగంలోనూ సత్తా చాటుతున్నారు పలువురు బాలీవుడ్‌ తారలు. దీపికా పదుకొణె, కత్రినా కైఫ్‌ ఇప్పటికే బ్యూటీ, స్కిన్‌కేర్‌ వ్యాపారాల్లో తమదైన ముద్ర వేయగా.. తాజాగా జాన్వీ కపూర్‌ కూడా అదే బాటలో పయనించనున్నారనే ప్రచారం మొదలైంది. ఇటీవల ఆమె సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన మేకప్‌ పోస్ట్‌ ఈ ఊహాగానాలకు కారణమైంది.

P

Entertainment | Published On Oct 14, 2026, 6.55 pm IST

Janhvi Kapoor | జాన్వీ కపూర్‌ సరికొత్త ప్రయాణం..! ఈ రంగంలోనైనా సక్సెస్‌ అవుతుందా?
Advertisement

Janhvi Kapoor | హీరోయిన్‌గా రాణిస్తూనే వ్యాపార రంగంలోనూ సత్తా చాటుతున్నారు పలువురు బాలీవుడ్‌ తారలు. దీపికా పదుకొణె, కత్రినా కైఫ్‌ ఇప్పటికే బ్యూటీ, స్కిన్‌కేర్‌ వ్యాపారాల్లో తమదైన ముద్ర వేయగా.. తాజాగా జాన్వీ కపూర్‌ కూడా అదే బాటలో పయనించనున్నారనే ప్రచారం మొదలైంది. ఇటీవల ఆమె సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన మేకప్‌ పోస్ట్‌ ఈ ఊహాగానాలకు కారణమైంది. అయితే, సొంత బ్యూటీ బ్రాండ్‌ ప్రారంభంపై జాన్వీ స్పందించలేదు. ఇటీవల మేకప్‌ చేసుకుంటూ, బ్యూటీ ఉత్పత్తులతో కనిపించిన ఫొటోలను జాన్వీ సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. దీంతో ఆమె సొంత బ్యూటీ బ్రాండ్‌ను ప్రారంభించనున్నదనే చర్చ మొదలైంది. ఇప్పటికే పలువురు సినీ తారలు తమకున్న క్రేజ్‌ను వ్యాపార అవకాశాలుగా మలుచుకుంటున్నారు. తమ పేరుతో బ్యూటీ, ఫ్యాషన్‌, స్కిన్‌కేర్‌ ఉత్పత్తులను మార్కెట్‌లోకి తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో జాన్వీ కూడా బ్యూటీ రంగంలోకి అడుగుపెడతారా? అన్న ఆసక్తి నెలకొంది. అయితే, ప్రస్తుతానికి ఈ వార్త ప్రచారానికే పరిమితమైంది.

‘ధడక్‌’తో సినీ ఎంట్రీ

దివంగత నటి శ్రీదేవి, నిర్మాత బోనీ కపూర్‌ కుమార్తె అయిన జాన్వీ.. 2018లో ‘ధడక్‌’ సినిమాతో హీరోయిన్‌గా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత గుంజన్‌ సక్సేనా: ది కార్గిల్‌ గర్ల్‌, గుడ్‌ లక్‌ జెర్రీ, మిలి, బవాల్‌, మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి వంటి చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించారు. గ్లామర్‌ పాత్రలతో పాటు నటనకు ప్రాధాన్యమున్న కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాన్నది. ‘దేవర: పార్ట్‌ 1’తో తెలుగు తెరకు పరిచయమైన జాన్వీ.. దక్షిణాది ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆ తర్వాత రామ్‌ చరణ్‌ సరసన తెలుగులోనే పెద్ది మూవీలో నటించింది. అయితే, ఈ రెండు సినిమాలు జాన్వీకి పెద్దగా కలిసిరాలేదు. ఎంతో ఆశలతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీకి నిరాశ తప్పలేదు. రెండు సినిమాల్లో కేవలం అందాల ప్రదర్శనకే పాత్రలు పరిమితమయ్యాయి. పెద్దిలో జాన్వీ కొన్ని సీన్లపై అభ్యంతరాలు సైతం వచ్చిన విషయం తెలిసిందే.

అల్లు అర్జున్‌ రాకాలో..

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం అల్లు అర్జున్‌ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాకా’లో ఆమె నటించనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ మూవీలో దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటిస్తోంది. మేకర్స్‌ సైతం అఫీషియల్‌గా కన్ఫర్మ్‌ చేశారు. జాన్వీతో పాటు మృణాల్‌ ఠాకూర్‌, రష్మిక మందన్నా, మలయాళీ నటి ఐశ్వర్య లక్ష్మి సైతం నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మూవీలో ట్రైబల్‌ క్వీన్‌, యోధురాలి పాత్రలో జాన్వీ కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ సినిమాలో జాన్వీ భాగస్వామ్యంపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది. మొత్తానికి, సినిమాలతో పాటు వ్యాపార రంగంలోనూ జాన్వీ అడుగుపెడతారా? అన్నది ఆసక్తికరంగా మారింది. బ్యూటీ బ్రాండ్‌ ప్రారంభంపై ఆమె నుంచి ప్రకటన వస్తేనే ఈ ఊహాగానాలకు తెరపడనుంది.

Advertisement
Advertisement