త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Etala Rajendar | చ‌రిత్ర చెప్పుకుంటేనే తెలుస్త‌ది

Etala Rajendar | చ‌రిత్ర చెప్పుకుంటేనే తెలుస్తుంద‌ని.. దాస్తే దాగ‌ని అనేక స‌త్యాన‌లు ప్ర‌ధాని మోదీ బ‌య‌టికి తీశార‌ని మ‌ల్కాజిగిరి ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ (Etala Rajendar) అన్నారు.

S

Telangana | Published On Oct 31, 2026, 5.21 pm IST

Etala Rajendar | చ‌రిత్ర చెప్పుకుంటేనే తెలుస్త‌ది
Advertisement
  • దాస్తే దాగ‌ని అనేక స‌త్యాల‌ను మోదీ బ‌య‌టికి తీశారు
  • ప్ర‌జాస్వామిక దేశంగా వ‌ర్ధిల్లుతుందంటే అది సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి ఫ‌లిత‌మే
  • భ‌గ‌త్‌సింగ్ త్యాగాల స్ఫూర్తితో న‌డుచుకోవాలి
  • కూకట్‌ప‌ల్లి ‘ఏక్తాయాత్ర’లో ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ పిలుపు

Etala Rajendar | త్రినేత్ర న్యూస్‌: చ‌రిత్ర చెప్పుకుంటేనే తెలుస్తుంద‌ని.. దాస్తే దాగ‌ని అనేక స‌త్యాన‌లు ప్ర‌ధాని మోదీ బ‌య‌టికి తీశార‌ని మ‌ల్కాజిగిరి ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ (Etala Rajendar) అన్నారు. పాఠ్య‌పుస్త‌కాల్లో అక్బ‌ర్‌, బాబ‌ర్ జీవిత విశేషాల‌ను చ‌దువుకున్నామ‌ని.. స్వాతంత్య్ర స‌మ‌ర‌యేధులైన ఖుదిరం బోస్‌, ఝాన్సీ లక్ష్మీబాయి, భగత్ సింగ్, సుఖదేవ్ లాంటి వారిపై పుస్త‌కాల్లో పెట్ట‌లేద‌న్నారు. మోదీ ప్రధాని అయ్యాక పటేల్ జయంతిని “ఐక్యతా దినోత్సవంగా” ప్రకటించారని తెలిపారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ (Sardar Vallabhbhai Patel) జయంతిని పురస్కరించుకుని శ‌నివారం కూక‌ట్‌ప‌ల్లిలో నిర్వ‌హించిన ఏక్తాయాత్ర (Ekta Yatra Rally) సందర్భంగా ఆయ‌న ముఖ్య అతిథిగా ప్ర‌సంగించారు.

స్వచ్ఛ భారత్ అభియాన్ ఫౌండర్ అండ్‌ చైర్మన్, బీజేపీ కూకట్‌ప‌ల్లి అసెంబ్లీ ఇంచార్జి మాధవరం కాంతారావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అత్యంత ఉత్సాహంగా రూపుదిద్దుకుంది. గత 11 ఏళ్లుగా నిర్విఘ్నంగా కాంతారావు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వారికి నా అభినందనలు. ఖుదిరం బోస్, ఝాన్సీ లక్ష్మీబాయి, భగత్ సింగ్, సుఖదేవ్ గురించి పుస్తకాల్లో పెట్టలేదు. మన కోసం ప్రాణాలు అర్పించిన వారి గురించి ఎందుకు రాయలేదనే అనేక చర్చలు జరిగాయి. అనేకమంది గొప్పవారి చరిత్రలు మోదీ భారత సమాజానికి అందిస్తున్నారు. ఈ ర్యాలీలు పటేల్‌ను గుర్తుచేసుకోవాలి.

మోదీకి మద్దతు ఇవ్వాలి

అఖండ భారత రూపశిల్పి మన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్. 500 పైగా సంస్థానాలను భారతదేశంలో విలీనం చేశారు. 80 ఏళ్ళ స్వతంత్ర భారతదేశం గొప్ప ప్రజాస్వామిక దేశంగా వర్ధిల్లుతుందంటే అది వారు చేసిన కృషి ఫలితమే. భారత్ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచింది. భగత్ సింగ్ లాంటి వారి త్యాగాలను స్మరించుకుంటూ ముందుకు సాగాలి. దేశభక్తిని గుండెల్లో నింపుకొని భారత దేశాన్ని ప్రపంచ చిత్రపటం మీద మొదటి స్థానంలో నిలబెట్టాలి. అందుకోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి సంపూర్ణ మద్దతు ఇవ్వాలి అని ఈట‌ల కోరారు.

అంత‌కుముందు సర్దార్ పటేల్ ఆశయాలైన ఐక్యతను చాటిచెప్పేలా ఈ ఏక్తాయాత్రలో సుమారు 750 మీటర్ల పొడవైన భారీ జాతీయ జెండాతో విద్యార్థులు, యువత నిర్వహించిన ర్యాలీ, భరతమాత, పలువురు స్వాతంత్య్ర‌ సమరయోధుల వేషధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కేవలం దేశభక్తికే పరిమితం కాకుండా, ప్రస్తుత యువతను పట్టిపీడిస్తున్న సామాజిక రుగ్మతలపై ఈ యాత్ర ద్వారా బలమైన సందేశాన్నిచ్చారు. "యువత డ్రగ్స్ బారిన పడకుండా, ‘నషా ముక్తి భారత్’ దిశగా అడుగులు వేస్తూ ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలిలి.. "సమాజంలో ప్రతి ఆడబిడ్డను గౌరవించాలి" అనే నినాదాలతో కూడిన ప్లకార్డులను చేత‌బూని ప్రదర్శించిన తీరు స్థానికులను ఆకట్టుకుంది.

ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, భారీ సంఖ్యలో యువతీ యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ట్యాగ్స్:

Bhagath SinghEkta Yatra RallyEtala RajendarKukatpallyModiTelanganaVallabhai Patel Birth Anniversary
Advertisement
Advertisement