త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Anil Ravipudi | అవి లేకుండా ర‌జ‌నీకాంత్ సినిమా చూడ‌లేం – అనిల్ రావిపూడి కామెంట్స్ – ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్‌

ర‌జ‌నీకాంత్‌ను పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ సినిమాల్లో ఆడియెన్స్ చూడ‌లేరంటూ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి చేసిన కామెంట్స్ వైర‌ల్ అవుతోన్నాయి. అనిల్ రావిపూడిని...ర‌జ‌నీకాంత్ ఫ్యాన్స్ తెగ ట్రోల్ చేస్తున్నారు. ర‌జ‌నీకాంత్ ఇమేజ్‌ను డీగ్రేడ్ చేసేలా ఇలాంటి అనుచిత కామెంట్లు చేయ‌డం త‌గ‌ద‌ని అంటున్నారు.

N

Entertainment | Published On Jan 24, 2026, 4.31 pm IST

Anil Ravipudi | అవి లేకుండా ర‌జ‌నీకాంత్ సినిమా చూడ‌లేం – అనిల్ రావిపూడి కామెంట్స్ – ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్‌
Advertisement

Anil Ravipudi |  డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడిని సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. ర‌జ‌నీకాంత్ ఇమేజ్‌, స్టార్‌డ‌మ్ గురించి తెలియ‌కుండా కామెంట్స్ చేయ‌డం త‌గ‌ద‌ని ఫైర్ అవుతున్నారు. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌గారు మూవీ ఇటీవ‌ల సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. చిరంజీవి హీరోగా న‌టించిన ఈ మూవీ 300 కోట్ల క‌లెక్ష‌న్స్‌కు చేరువైంది. సంక్రాంతి విన్న‌ర్‌గా నిలిచింది. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో ర‌జ‌నీకాంత్‌పై అనిల్ రావిపూడి ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు. ర‌జ‌నీకాంత్ పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తే ఆడియెన్స్ చూడ‌ర‌ని అన్నారు.

హీరో ఇమేజ్‌కు త‌గ్గ‌ట్లే...

"ప్ర‌తి హీరోకు వారి ఇమేజ్‌కు త‌గ్గ‌ట్లుగా కొన్ని బ‌లాలు ఉంటాయి. వాటికి హైలైట్ చేస్తూనే సినిమాలు చేయ‌డం చాలా ముఖ్యం. ర‌జ‌నీకాంత్ సినిమాల్లో ఆయ‌న మార్కు స్టైల్, వాటికి త‌గ్గ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ , స్లో మోషన్ వాకింగ్ షాట్స్ ఉండాల్సిందే. అవి లేకుండా ర‌జ‌నీకాంత్ సినిమాను చూడటం కష్టం. ఆ ఎలిమెంట్స్ ఆయన సినిమాలు హిట్ట‌వ్వ‌డానికి, ఆడియెన్స్‌ను మెప్పించ‌డానికి కార‌ణం అవుతున్నాయి. అలా కాకుండా సెటిల్డ్ స్టోరీని ఎంచుకొని ర‌జ‌నీకాంత్‌తో పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ సినిమాలు మాత్రమే చేస్తే ఆడియెన్స్ యాక్సెప్ట్ చేయ‌రు చిరంజీవి సినిమాల్లో డ్యాన్స్ ఫైట్స్ ఎంత ముఖ్య‌మో... రజినీకాంత్ సినిమాల‌కు స్టైల్ , ఎలివేషన్స్ అంతే అవ‌స‌రం" అని అనిల్ రావిపూడి అన్నారు. హీరోల ఇమేజ్‌ను ధాటి ఎప్పుడూ ప్ర‌యోగాలు చేయ‌కూడ‌ద‌ని చెప్పారు. అనిల్ రావిపూడి కామెంట్స్ వైర‌ల్ అవుతోన్నాయి.

ట్రోల్స్‌...

అనిల్ రావిపూడిని ర‌జ‌నీకాంత్ అభిమానులు తెగ ట్రోల్ చేస్తున్నారు. న‌ట‌న ప్ర‌ధాన సినిమాలు ర‌జ‌నీకాంత్ ఎన్నో చేశార‌ని, వాటిని చూసిన త‌ర్వాత మాట్లాడితే బాగుంటుంద‌ని అంటున్నారు. ర‌జ‌నీకాంత్ ఇమేజ్‌ను డీగ్రేడ్ చేసేలా అనుచిత కామెంట్లు చేయ‌డం త‌గ‌ద‌ని అంటున్నారు. అనిల్ రావిపూడి క్ష‌మాప‌ణ‌ల చెప్పాల‌ని అంటున్నారు. మ‌రికొంద‌రు నెటిజ‌న్లు మాత్రం అనిల్ రావిపూడి చేసిన కామెంట్ల‌లో త‌ప్పేం లేద‌ని చెబుతున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement