త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rajinikanth | రాజకీయ ల‌బ్ది కోస‌మే అస‌త్య ఆరోప‌ణ‌లు – ద‌ళ‌ప‌తి విజ‌య్ టీవీకే పార్టీపై ర‌జ‌నీకాంత్ ఫైర్‌

ద‌ళ‌ప‌తి విజ‌య్ టీవీకే పార్టీపై ర‌జ‌నీకాంత్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాజ‌కీయ ల‌బ్ది కోసం త‌న‌పై టీవీకే జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ నిరాధార‌మైన ఆరోప‌ణ‌లు చేశార‌ని ర‌జ‌నీకాంత్ అన్నాడు. మంగ‌ళ‌వారం ఓ లేఖ‌ను రిలీజ్ చేశారు.

N

Entertainment | Published On Mar 17, 2026, 3.42 pm IST

Rajinikanth | రాజకీయ ల‌బ్ది కోస‌మే అస‌త్య ఆరోప‌ణ‌లు – ద‌ళ‌ప‌తి విజ‌య్ టీవీకే పార్టీపై ర‌జ‌నీకాంత్ ఫైర్‌
Advertisement

Rajinikanth | ద‌ళ‌ప‌తి విజ‌య్ టీవీకే పార్టీపై కోలీవుడ్ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. టీవీకే పార్టీ అధినేత‌లు త‌న‌పై నిరాధార‌మైన ఆరోప‌ణ‌లు చేస్తున్నారంటూ ఓ లేఖ‌ను రిలీజ్ చేశారు. ద‌ళ‌ప‌తి విజ‌య్ టీవీకే పార్టీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ అధ‌వ్ అర్జున‌ ర‌జ‌నీకాంత్‌ను విమ‌ర్శిస్తూ ఇటీవ‌ల సంచ‌ల‌న కామెంట్స్ చేయ‌డం త‌మిళ సినీ, రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌రంగా మారింది. ర‌జ‌నీకాంత్ రాజ‌కీయాల్లోకి రావాల‌ని అనుకున్నార‌ని కానీ డీఎమ్‌కే పార్టీ లీడ‌ర్స్ ఆయ‌న్ని భ‌య‌పెట్టారంటూ అధ‌వ్ అర్జున అన్నారు. ర‌జ‌నీకాంత్ రాజ‌కీయాల్లోకి వ‌చ్చి ఉంటే ఎమ్‌జీఆర్ అంత‌టి గొప్ప నాయ‌కుడు అయ్యుండేవార‌ని, కానీ డీఎమ్‌కే ఒత్తిళ్ల‌కు త‌లొగ్గి త‌న రాజ‌కీయ ఆలోచ‌న‌ల‌ను విర‌మించుకున్నారంటూ అధ‌వ్ అర్జున పేర్కొన్నారు. అధ‌వ్ అర్జున కామెంట్ల‌పై ర‌జ‌నీకాంత్ రియాక్ట్ అయ్యారు. సోష‌ల్ మీడియాలో ఓ లేఖ‌ను రిలీజ్ చేశారు.

అవ‌న్నీ అవాస్త‌వాలే...

టీవీకే జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ కామెంట్లు అన్నీ అవాస్త‌వాలేన‌ని ఇందులో పేర్కొన్నారు.. దురుద్దేశ‌పూర్వ‌కంగానే త‌న‌పై అధ‌వ్ అర్జున నిరాధార‌మైన ఆరోప‌ణ‌లు చేశార‌ని అన్నారు. త‌న‌కు డీఎమ్‌కే పార్టీ నాయ‌కులంతా స‌పోర్ట్ చేశార‌ని, ఎవ‌రూ బెదిరింపుల‌కు పాల్ప‌డ‌లేద‌ని ర‌జ‌నీకాంత్ చెప్పారు. "కాలం మాట్లాడ‌లేక‌పోవ‌చ్చు. కానీ ప్ర‌శ్న‌ల‌న్నింటికి ఏదో ఒక రోజు త‌ప్ప‌కుండా బ‌దులిస్తుంది" అని ఈ లేఖ‌లో ర‌జ‌నీకాంత్ పేర్కొన్నారు. డీఎమ్‌కేతో పాటు త‌న‌కు స‌పోర్ట్ చేసిన వివిధ పార్టీ నాయ‌కుల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ర‌జ‌నీకాంత్ ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

రాజకీయ లబ్ది కోసమే...

మ‌రోవైపు టీవీకేఆరోప‌ణ‌ల‌ను డీఎమ్‌కే పార్టీ ఖండించింది. రాజకీయ లబ్ధి కోసమే టీవీకే ఇలాంటి తప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తోందని విమర్శించారు. రజనీకాంత్‌కు డీఎంకేతో ఎప్పుడూ చ‌క్క‌టి సంబంధాలే ఉన్నాయ‌ని అన్నారు.

 

Advertisement

తాజావార్తలు

Advertisement