Prabhas Fans | రాజాసాబ్ క్రేజ్ – మొసళ్లతో థియేటర్లలో ఫ్యాన్స్ హంగామా
రాజాసాబ్ హంగామాతో తెలుగు రాష్ట్రాల్లోని థియేటళ్లు కళకళలాడుతోన్నాయి. థియేటర్లలో కొందరు ఫ్యాన్స్ బొమ్మ మొసళ్లతో సందడి చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ హీరోగా నటించిన ఈ మూవీ గురువారం వరల్డ్ వైడ్‌గా రిలీజైంది.
Entertainment | Published On Jan 9, 2026, 2.14 pm IST
Prabhas Fans | ప్రభాస్ రాజాసాబ్ మూవీ శుక్రవారం వరల్డ్ వైడ్‌గా రిలీజైంది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఓ రోజు ముందుగానే ప్రీమియర్ షోస్‌తో రాజాసాబ్ సందడి మొదలైంది. గురువారం ఏపీలో ప్రీమియర్స్ షోస్ ఎలాంటి అడ్డంకులు లేకుండా పడగా తెలంగాణలో మాత్రం ఆలస్యంగా మొదలయ్యాయి.
ఈ అడ్డంకులతో సంబంధం లేకుండా ఫ్యాన్స్ హంగామాతో రాజాసాబ్ థియేటర్లు కళకళలాడాయి. థియేటర్లలోకి ఏకంగా మొసళ్లతో ఎంట్రీ ఇచ్చారు. రియల్‌వి కాదు..బొమ్మ మొసళ్లతో సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొసళ్లతో థియేటర్లకు అభిమానులు రావడం వెనుక ఓ స్టోరీ ఉంది. రాజాసాబ్‌లో ప్రభాస్ మొసళితో ఫైట్ చేసే సీన్ ఉంటుంది. హారర్ కామెడీ మూవీకి హైలైట్‌గా మొసళి ఫైట్ సీన్ నిలిచింది.
రీక్రియేట్...
ఈ ఫైట్ సీన్‌ను థియేటర్లలో ఫ్యాన్స్ రీక్రియేట్ చేశారు. బొమ్మ మొసళ్లతో థియేటర్లలోకి వచ్చారు. మొసళిఫైట్ సీన్ రాగానే స్క్రీన్ దగ్గరకు బొమ్మ మొసళ్లను పట్టుకుంటూ ప్రభాస్ సీన్ కాపీ కొట్టారు ఈ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఎవర్రా మీరంతా అంటూ ఈ వీడియోలను ఉద్దేశించి నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు నెటిజన్లు మాత్రం డైహార్డ్ ఫ్యాన్స్ అంటూ పేర్కొంటున్నారు.
కాగా రాజాసాబ్ ప్రీమియర్స్‌కు నెగెటివ్ టాక్ వచ్చింది. ముఖ్యంగా మారుతిని ప్రభాస్ అభిమానులు తెగ ట్రోల్ చేస్తున్నారు. ప్రభాస్ ఇచ్చిన మంచి అవకాశాన్ని వేస్ట్ చేశాడంటూ కామెంట్స్ పెడుతున్నారు. మారుతి టేకింగ్‌పై దారుణంగా విమర్శలొస్తున్నాయి. కామెడీ, హారర్ ఏలిమెంట్స్ సరిగ్గా వర్కవుట్ కాలేదని చెబుతున్నారు. ప్రభాస్ లుక్ విషయంలో నెగెటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
రాజాసాడ్ ఫస్ట్ డే 65 నుంచి డెబ్భై కోట్ల మధ్య కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉందని అంటున్నారు. సలార్‌తో పోలిస్తే తక్కువ కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
రాజాసాబ్ మూవీలో మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. దాదాపు నాలుగు వందల కోట్ల బడ్జెట్‌తో టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. తమన్ మ్యూజిక్ అందించారు.
Omg 😱 see the Rebels bring crocodile 🐊 to #RajaSaab movie theatres 🥵🔥💥#Prabhas 🔥🔥🥵 pic.twitter.com/4FuA3V1UdP
— ℙℝ𝔼𝔼𝕋𝕐 (@MySelf_Preety) January 8, 2026
సంబంధిత వార్తలు

Tripti Dimri | ప్రభాస్ స్పిరిట్ అప్డేట్ – సెట్స్‌లోకి అడుగుపెట్టబోతున్న హాట్ బ్యూటీ
మే 21, 2026

Rakul Preet Singh | ప్రభాస్ సినిమా నుంచి నన్ను తీసేశారు – రకుల్ కామెంట్స్…
మే 8, 2026

Sai Pallavi | సాయిపల్లవి కారణంగా ప్రభాస్ కల్కి 2 షూటింగ్ క్యాన్సిల్ – అసలేమైందంటే?
మే 5, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



