త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Prabhas | జ‌పాన్‌లో భూకంపం – ప్ర‌భాస్ ఫ్యాన్స్‌లో టెన్ష‌న్

Prabhas | జ‌పాన్‌లో భూకంపం రావ‌డంతో ప్ర‌భాస్ అభిమానుల్లో టెన్ష‌న్ మొద‌లైంది. ప్ర‌స్తుతం బాహుబ‌లి ఎపిక్ ప్ర‌మోష‌న్స్ లో భాగంగా ప్ర‌భాస్‌ జ‌పాన్‌లో ఉన్నాడు . ప్ర‌భాస్‌తో మాట్లాడాన‌ని, అత‌డు సేఫ్‌గా ఉన్న‌ట్లు డైరెక్ట‌ర్ మారుతి క్లారిటీ ఇచ్చాడు.

N

Entertainment | Published On Dec 9, 2025, 2.29 pm IST

Prabhas | జ‌పాన్‌లో భూకంపం – ప్ర‌భాస్ ఫ్యాన్స్‌లో టెన్ష‌న్

ప్రభాస్

Advertisement

Prabhas |జ‌పాన్‌లో(Japan) భారీ భూకంపం (Earthquake) రావ‌డంతో ప్ర‌భాస్ (Prabhas) ఫ్యాన్స్ వ‌ర్రీ అవుతున్నారు. భూకంపంతో జ‌పాన్ మొత్తం కంపించిపోయింది. రిక్ట‌ర్ స్కేల్‌పై 7.5 నుంచి 7.6 వ‌ర‌కు న‌మోదు అయ్యింది. సునామీ హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. భూకంపం రావ‌డంతో ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆందోళ‌న ప‌డుతున్నారు. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ జ‌పాన్‌లోనే ఉన్నారు. బాహుబ‌లి ఎపిక్ ప్ర‌మోష‌న్స్ కోసం ఇటీవ‌లే జ‌పాన్ వెళ్లారు.
బాహుబ‌లి రెండు భాగాల‌ను కలిపి బాహుబ‌లి ఎపిక్ పేరుతో ఇటీవ‌లే ఇండియాలో రీ రిలీజ్ చేశారు. రీ రిలీజ్‌లోనూ 53 కోట్ల వ‌సూళ్ల‌ను ప్ర‌భాస్ మూవీ స‌త్తా చాటింది. బాహుబ‌లి ఎపిక్‌ను జ‌పాన్ ప్రేక్ష‌కుల ముందుకు ఈ వార‌మే రాబోతుంది. డిసెంబ‌ర్ 12న థియేట‌ర్ల‌లో రిలీజ్ అవుతోంది.
బాహుబ‌లిఎపిక్ ప్ర‌మోష‌న్స్ కోసం ఇటీవ‌లే ప్ర‌భాస్‌తో పాటు నిర్మాత శోభు యార్ల‌గ‌డ్డ జ‌పాన్ వెళ్లారు. అక్క‌డి ఫ్యాన్స్‌తో ప్ర‌భాస్ ఇంట‌రాక్ట్ అయిన వీడియోలు, ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి.
జ‌పాన్‌లో భూకంపం రావ‌డంతో ప్ర‌భాస్ యోగ‌క్షేమాల‌పై ఆయ‌న అభిమానుల్లో ఆందోళ‌న మొద‌లైంది. ప్ర‌భాస్ సేఫ్‌గా ఉన్నాడా? లేదా? అంటూ ఫ్యాన్స్ సోష‌ల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.
ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు మారుతి గుడ్‌న్యూస్ వినిపించాడు. డార్లింగ్ (ప్ర‌భాస్‌) సేఫ్‌గా ఉన్నాడు. ఆయ‌న‌తో మాట్లాడాను. టోక్యోలో ఉన్నాడు. ఎవ‌రూ ఆందోళ‌న చెంద‌వ‌ద్ద‌ని ట్వీట్ చేశాడు. మారుతి ట్వీట్‌తో ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు. మ‌రో ఒక‌టి రెండు రోజుల్లో ప్ర‌భాస్ ఇండియాకు తిరిగిరానున్న‌ట్లు స‌మాచారం.
ప్ర‌భాస్ హీరోగా మారుతి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన రాజాసాబ్ మూవీ సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 9న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో నిధి అగ‌ర్వాల్‌, మాళ‌వికా మోహ‌న‌న్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.
కాగా జ‌పాన్ నుంచి తిరిగి రాగానే ప్ర‌భాస్ స్పిరిట్ షూటింగ్‌ను మొద‌లుపెట్ట‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఇటీవ‌లే ఈ సినిమా ఫ‌స్ట్ షెడ్యూల్ హైద‌రాబాద్‌లో ముగిసింది. స్పిరిట్ మూవీకి సందీప్ వంగా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా న‌టిస్తోంది. రాజాసాబ్‌, స్పిరిట్‌తో పాటు ప్ర‌స్తుతం ఫౌజీ, క‌ల్కి 2, స‌లార్ 2 సినిమాలు చేస్తున్నాడు ప్ర‌భాస్‌.

Advertisement

తాజావార్తలు

Advertisement