త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ntr | డ్రాగ‌న్ ఈజ్ బ్యాక్ – రొమాంటిక్ సాంగ్‌తో కెమెరా ముందుకు ఎన్టీఆర్‌

భుజం గాయం నుంచి కోలుకున్న ఎన్టీఆర్ మూడు నెల‌ల బ్రేక్ త‌ర్వాత డ్రాగ‌న్ సెట్స్ లో అడుగుపెట్ట‌బోతున్నారు. ఓ రొమాంటిక్ సాంగ్‌తో తిరిగి ఈ సినిమా షూటింగ్‌ను మొద‌లుపెట్ట‌బోతున్న‌ట్లు స‌మాచారం. రుక్మిణి వ‌సంత్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ సినిమాకు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

N

Entertainment | Published On Sep 19, 2026, 1.56 pm IST

Ntr | డ్రాగ‌న్ ఈజ్ బ్యాక్ – రొమాంటిక్ సాంగ్‌తో కెమెరా ముందుకు ఎన్టీఆర్‌
Advertisement

Ntr | భుజం గాయం నుంచి కోలుకున్న యంగ్ టైగ‌ర్‌ ఎన్టీఆర్ తిరిగి డ్రాగ‌న్ షూటింగ్‌ను మొద‌లుపెట్ట‌బోతున్నారు. మ‌రో రెండు వారాల్లో సెట్స్‌లో అడుగుపెట్ట‌నున్నారు. డ్రాగ‌న్ షూటింగ్‌లో జ‌రిగిన ప్ర‌మాదం కార‌ణంగా గాయ‌ప‌డ‌టంతో గ‌త మూడు నెల‌లుగా సినిమాల‌కు బ్రేక్ తీసుకున్నారు ఎన్టీఆర్‌. గాయం తీవ్ర‌త ఎక్కువ‌గా ఉండ‌టంతో ఎన్టీఆర్ భుజానికి వైద్యులు స‌ర్జ‌రీ చేశారు. దాంతో నెల రోజుల్లోపే అనుకున్న విరామం మూడు నెల‌లు దాటిపోయింది.ఎన్టీఆర్ తిరిగి డ్రాగ‌న్ షూటింగ్‌ను ఎప్పుడు మొద‌లుపెడ‌తాడా అన్న‌ది అభిమానుల్లో ఆస‌క్తిక‌రంగా మారింది.

క్లారిటీ వ‌చ్చేసింది

ఎట్ట‌కేల‌కు ఎన్టీఆర్ తిరిగి కెమెరా ముందుకు వ‌చ్చేది ఎప్పుడ‌నే క్లారిటీ వ‌చ్చేసింది. అక్టోబ‌ర్ ఫ‌స్ట్ వీక్ నుంచి డ్రాగ‌న్ చిత్రీక‌ర‌ణ‌లో యంగ్ టైగ‌ర్ భాగం కాబోతున్నారు. హైద‌రాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో ఎన్టీఆర్‌, రుక్మిణి వ‌సంత్‌ల‌పై ఓ రొమాంటిక్ సాంగ్‌తో పాటు కొన్ని ల‌వ్ సీన్స్‌ను షూట్ చేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ల‌వ్ ట్రాక్ సినిమాకు హైలైట్‌గా ఉండ‌నుంద‌ని అంటున్నారు. నెక్స్ట్ షెడ్యూల్ నుంచి బ్రేక్ లేకుండా నాన్‌స్టాప్‌గా డ్రాగ‌న్ షూటింగ్‌లో పాల్గొనాల‌ని ఎన్టీఆర్ నిర్ణ‌యించుకున్న‌ట్లు చెబుతున్నారు.

జూన్‌లో రిలీజ్‌...

డ్రాగ‌న్ మూవీని 2027...జూన్ 11న రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్ర‌క‌టించిన డేట్‌కే ఈ సినిమాను ఎలాగైనా  ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్న‌ట్లు తెలిసింది. ఫిబ్ర‌వ‌రిలోగా షూటింగ్ మొత్తాన్ని పూర్తిచేసి మార్చి నుంచి ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు మొద‌లుపెట్ట‌బోతున్న‌ట్లు స‌మాచారం.

కేజీఎఫ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత‌...

ఇప్ప‌టివ‌ర‌కు డ్రాగ‌న్ షూటింగ్ డెబ్బై శాతం వ‌ర‌కు పూర్త‌యిన‌ట్లు తెలిసింది. పీరియాడిక‌ల్ గ్యాంగ్‌స్ట‌ర్ యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో అనిల్ క‌పూర్‌, బిజు మీన‌న్ గురు సోమ‌సుంద‌రం, అషుతోష్ రాణా కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. కేజీఎఫ్ 2 బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోంది. దాదాపు నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో ఈ మూవీ రూపొందుతోన్న‌ట్లు స‌మాచారం.

 

Advertisement
Advertisement