త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bandi Sanjay | 221 మందికి నియామక ఉత్తర్వులివ్వడం గర్వంగా ఉంది: బండి సంజయ్

Bandi Sanjay | రోజ్‌గార్ మేళా కార్యక్రమంలో తెలంగాణలోని 221 మందికి త‌న చేతుల మీదుగా నియామక ఉత్తర్వులు ఇవ్వడం గర్వంగా అనిపిస్తోందని క‌రీంన‌గ‌ర్ ఎంపీ, కేంద్ర హోంశాఖ స‌హాయ మంత్రి బండి సంజ‌య్ తెలిపారు.

S

Telangana | Published On Sep 19, 2026, 1.43 pm IST

Bandi Sanjay | 221 మందికి నియామక ఉత్తర్వులివ్వడం గర్వంగా ఉంది: బండి సంజయ్
Advertisement

Bandi Sanjay | త్రినేత్ర‌.న్యూస్‌: రోజ్‌గార్ మేళా కార్యక్రమంలో తెలంగాణలోని 221 మందికి త‌న చేతుల మీదుగా నియామక ఉత్తర్వులు ఇవ్వడం గర్వంగా అనిపిస్తోందని క‌రీంన‌గ‌ర్ ఎంపీ, కేంద్ర హోంశాఖ స‌హాయ మంత్రి బండి సంజ‌య్ తెలిపారు. ఎలాంటి పైరవీలు లేకుండా, పేపర్‌ లీక్‌లు జరగకుండా, అక్రమాలకు తావులేకుండా, ఆరోపణలు రాకుండా ప్ర‌ధాని మోదీ 12 లక్షల మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించారన్నారు. మోదీ అంకితభావం ఏంటో మనకు అర్థమవుతుందన్నారు. ఈమేర‌కు శ‌నివారం గుంత‌క‌ల్‌లో యువ‌త‌కు నియామ‌క ప‌త్రాలు అందజేసిన సంద‌ర్భంగా మాట్లాడారు.

గత బీఆర్‌ఎస్‌ హయాంలో కానీ, ప్రస్తుత కాంగ్రెస్‌ హయాంలో కానీ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన సందర్భాలు లేవు. ఉద్యోగాల భర్తీలో పేపర్‌ లీకేజీ, అవినీతి, పైరవీలు జరిగాయని ఆరోపిస్తూ పలువురు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. అలాంటి ఆరోపణలకు తావులేకుండా కేంద్ర ప్రభుత్వం మోదీ సర్కార్ 12 లక్షల 75 వేల మందికి ఉద్యోగాలు కల్పించడం గొప్ప విష‌యం.

ఇందిరమ్మ ఇళ్లను అమ్ముకుంటున్నారు..

కాంగ్రెస్ ప్రభుత్వం కమీషన్ల కోసం ఇందిరమ్మ ఇళ్లను అమ్ముకుంటున్నారు. తెలంగాణకు కేంద్రం చేయాల్సిన సహాయం చేయలేకపోతోంది. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో 20 లక్షల ఇళ్లను మంజూరు చేసి ఇచ్చాం. కానీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల ఇళ్లను కూడా ఇవ్వలేకపోతోంది అని బండి సంజ‌య్ ఆరోపించారు.

ఉద్యోగాలు సాధించిన యువత దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలి. అవినీతికి దూరంగా ఉంటూ బాధ్యతాయుతంగా పనిచేసి 'వికసిత్ భారత్ @2047' స్వప్నాన్ని సాకారం చేయాలి అని ఆయన పిలుపునిచ్చారు.

Advertisement
Advertisement