త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kayadu Lohar | నాని ‘ది ప్యారడైజ్‌’ మూవీ కోసం కాయదు అంత పని చేస్తోందా..?

Kayadu Lohar | హీరోయిన్ కాయదు లోహర్‌ ప్రస్తుతం దక్షిణాది సినీ వరుస అవకాశాలతో దూసుకెళ్తోంది. తెలుగుతో పాటు మలయాళం, తమిళంలో వరుస అవకాశాలు అందుకుంటూ ముందుకు సాగుతోంది. ఇటీవల తెలుగులో ‘ఫంకీ’ చిత్రంలో కనిపించిన అసోం బ్యూటీ.. ప్రస్తుతం నాని సరసన ‘ది ప్యారడైజ్‌’లో కీలకపాత్ర పోషిస్తోంది.

P

Entertainment | Published On Apr 20, 2026, 3.54 pm IST

Kayadu Lohar | నాని ‘ది ప్యారడైజ్‌’ మూవీ కోసం కాయదు అంత పని చేస్తోందా..?
Advertisement

Kayadu Lohar | హీరోయిన్ కాయదు లోహర్‌ ప్రస్తుతం దక్షిణాది సినీ వరుస అవకాశాలతో దూసుకెళ్తోంది. తెలుగుతో పాటు మలయాళం, తమిళంలో వరుస అవకాశాలు అందుకుంటూ ముందుకు సాగుతోంది. ఇటీవల తెలుగులో ‘ఫంకీ’ చిత్రంలో కనిపించిన అసోం బ్యూటీ.. ప్రస్తుతం నాని సరసన ‘ది ప్యారడైజ్‌’లో కీలకపాత్ర పోషిస్తోంది. ఈ చిత్రం కోసం కాయదు ఇతర తెలుగు ప్రాజెక్ట్‌లను తాత్కాలికంగా పక్కన పెట్టినట్లు సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇందుకు కారణంగా చిత్రబృందంతో ఆమె కుదుర్చుకున్న ప్రత్యేక ఒప్పందమేనని సమాచారం. ఈ అగ్రిమెంట్ ప్రకారం సినిమా షూటింగ్ పూర్తయ్యేంతవరకు మరే పెద్ద తెలుగు సినిమాను అంగీకరించకూడదనే నిబంధన ఉన్నట్లు తెలుస్తోంది.

షూటింగ్‌కు ఎక్కువ కాలం డేట్స్ అవసరమవుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. తొలుత ఈ సినిమాను 2026 మార్చిలో విడుదల చేయాలని ప్లాన్ చేసినప్పటికీ, చిత్రీకరణ ఆలస్యం కావడంతో రిలీజ్‌ను ఆగస్ట్‌కు మార్చినట్లు తెలుస్తోంది. అవసరమైతే డిసెంబర్‌కు కూడా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో కాయదు దీర్ఘకాలం ఈ ఒక్క ప్రాజెక్ట్‌కే కట్టుబడి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంత కాలం ప్రత్యేకంగా పని చేస్తున్న నేపథ్యంలో ఆమె పారితోషికంపై మార్పులు ఉంటాయా లేదా అన్నది ఇంకా స్పష్టతకు రాలేదు. ముందుగా ఒప్పుకున్న మొత్తానికే పరిమితం చేస్తారా లేక అదనంగా చెల్లిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.

కాయదు లోహర్ కెరీర్ విషయానికి వస్తే, మోడలింగ్‌తో ప్రారంభమైన ఆమె ప్రయాణం తర్వాత సినిమాల వైపు మళ్లింది. 2021లో కన్నడ మూవీ ముగిల్‌పేట్‌లో హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత 2022లో మలయాళంలో కనిపించింది. అదే ఏడాది తెలుగులో ‘అల్లూరి’ మూవీతో తెలుగు తెరపై మెరిసింది. అనంతరం పలు సినిమాల్లో నటించినా సక్సెస్‌ కాకపోవడంతో పెద్ద అవకాశాలు రాలేదు. గతేడాది ప్రదీప్‌ రంగనాథన్‌ డ్రాగన్‌ మూవీలో నటించింది. ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

దాంతో ఈ బ్యూటీ ఓవర్‌నైట్‌ స్టార్‌గా మారింది. వరుస అవకాశాలను దక్కించుకుంది. తెలుగులో మళ్లీ ‘ఫంకీ’లో విశ్వక్‌సేన్‌తో నటించింది. ప్రస్తుతం తెలుగులో ప్యారడైజ్‌లో నటిస్తుంది. ప్రస్తుతం మరో మూడు తమిళ సినిమాలతో పాటు మలయాళంలో మరో రెండు సినిమాల్లో కనిపించనుంది. తమిళం, తెలుగుతో పాటు మలయాళ భాషల్లో అవకాశాలు అందుకుంటూ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటోంది. అదే సమయంలో ఓ పాన్ ఇండియా స్టోరీలో కాయదు పేరు పరిశీలనలో ఉన్నట్లు టాక్‌ నడుస్తోంది. ఈ సినిమాలు కన్ఫర్మ్ అయితే కాయదు లోహర్ కెరీర్ మరింత వేగంగా ముందుకు సాగే అవకాశం కనిపిస్తోంది.

Advertisement
Advertisement