త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vande Bharat Sleeper | బెంగళూరు–ముంబ‌యి మధ్య వందే భారత్‌ స్లీపర్‌

Vande Bharat Sleeper | టెక్ సిటీ బెంగళూరును ఆర్థిక రాజధాని ముంబ‌యితో అనుసంధానిస్తూ వందే భారత్‌ స్లీపర్‌ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలెక్కింది. కన్నడ రాజ్యోత్సవం సందర్భంగా ఆదివారం బెంగళూరులోని సర్ ఎం విశ్వేశ్వరయ్య టెర్మినల్‌ (SMVT)లో కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఈ రైలును ప్రారంభించారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రులు వీ సోమన్న, ప్రహ్లాద్‌ జోషి, హెచ్‌డీ కుమారస్వామి, శోభా కరంద్లాజేతో పాటు పలువురు ఎంపీలు పాల్గొన్నారు.

P

National | Published On Nov 1, 2026, 3.45 pm IST

Vande Bharat Sleeper | బెంగళూరు–ముంబ‌యి మధ్య వందే భారత్‌ స్లీపర్‌
Advertisement
  • బెంగళూరు–ముంబ‌యి మధ్య వందే భారత్‌ స్లీపర్‌
  • క‌న్న‌డ రాజ్యోత్స‌వం రోజున ప్రారంభం
  • జెండా ఊపి ప్రారంభించిన కేంద్ర‌మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్‌

Vande Bharat Sleeper | టెక్ సిటీ బెంగళూరును ఆర్థిక రాజధాని ముంబ‌యితో అనుసంధానిస్తూ వందే భారత్‌ స్లీపర్‌ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలెక్కింది. కన్నడ రాజ్యోత్సవం సందర్భంగా ఆదివారం బెంగళూరులోని సర్ ఎం విశ్వేశ్వరయ్య టెర్మినల్‌ (SMVT)లో కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఈ రైలును ప్రారంభించారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రులు వీ సోమన్న, ప్రహ్లాద్‌ జోషి, హెచ్‌డీ కుమారస్వామి, శోభా కరంద్లాజేతో పాటు పలువురు ఎంపీలు పాల్గొన్నారు. అనంతరం రైలులోని సౌకర్యాలను పరిశీలించి ప్రయాణికులతో మంత్రులు మాట్లాడారు. ఈ సందర్భంగా అశ్వినీ వైష్ణవ్‌ మాట్లాడుతూ కన్నడ రాజ్యోత్సవం రోజున బెంగళూరు–ముంబ‌యి మధ్య వందేభారత్‌ స్లీపర్‌ సేవలు ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఇది దేశంలో మూడో వందేభారత్‌ సేవ అని తెలిపారు. ప్రయాణికుల సౌకర్యం, భద్రతకు ప్రాధాన్యతనిస్తూ రైలు రూపకల్పనలో పలు కొత్త ఫీచర్లు పొందుపరిచినట్లు చెప్పారు. లోకో పైలట్లకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించడంతో పాటు బెర్తులపైకి ఎక్కడం, దిగడం సులభతరం చేసే ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. దివ్యాంగుల కోసం కూడా ప్రత్యేక సదుపాయాలు కల్పించినట్లు వెల్లడించారు.

823 మందికి ప్రయాణ సౌకర్యం

ఈ వందేభారత్‌ స్లీపర్‌ రైలులో మొత్తం 823 మంది ప్రయాణించేందుకు వీలుంది. ఇందులో 611 మంది సామర్థ్యంతో 11 ఏసీ త్రీటైర్‌ కోచ్‌లు, 188 మంది ప్రయాణించేలా నాలుగు ఏసీ టూటైర్‌ కోచ్‌లు, 24 మంది సామర్థ్యంతో ఒక ఫస్ట్‌ ఏసీ కోచ్‌ ఉన్నాయి. రాత్రిపూట ప్రయాణానికి అనువుగా రూపొందించిన ఈ రైలు బెంగళూరు, ముంబ‌యి మధ్య రాకపోకలను మరింత సులభతరం చేయనుంది. ఈ రైలును దక్షిణ పశ్చిమ రైల్వే (ఎస్‌డబ్ల్యూఆర్‌) నిర్వహించనుంది.

వారంలో ఆరురోజులు..

రైలు నంబర్‌ 27652 బెంగళూరులోని ఎస్‌ఎంవీటీ నుంచి రాత్రి 7.45 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11.55 గంటలకు ముంబ‌యిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్‌ టెర్మినస్‌ (సీఎస్‌ఎంటీ) చేరుకుంటుంది. ప్రయాణ సమయం సుమారు 16 గంటలు. తిరుగు ప్రయాణంలో రైలు నంబర్‌ 27651 ముంబై సీఎస్‌ఎంటీ నుంచి రాత్రి 8.10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. వారానికి ఆరు రోజులు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. బెంగళూరు నుంచి ముంబ‌యి వెళ్లే రైలు సోమవారం, ముంబ‌యి నుంచి బెంగళూరు వచ్చే రైలు మంగళవారం అందుబాటులో ఉండ‌దు. ఈ రైలుకు అనంత‌పూర్‌, గుంత‌క‌ల్‌, రాయ్‌చూర్‌, యాద్గిర్‌, కాలాబుర్గి, షోలాపూర్‌, పుణే జంక్ష‌న్‌, క‌ల్యాణ్ జంక్ష‌న్ల‌లో ఆగుతుంది.

కర్ణాటకలో రైల్వే అభివృద్ధికి రూ.52 వేల కోట్లు

కేంద్ర సహాయ మంత్రి వీ సోమన్న మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో కర్ణాటకలో రైల్వే అభివృద్ధికి రూ.52 వేల కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా నిర్మించిన 14 వేల రైల్వే ఓవర్‌బ్రిడ్జిల్లో 900కు పైగా కర్ణాటకలోనే ఉన్నాయని వెల్లడించారు. రైల్వేలు, జాతీయ రహదారుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.

ట్యాగ్స్:

Ashwini VaishnawBengaluru Mumbai RouteIndian RailwaysKannada RajyotsavaMumbai CSMTSMVT BengaluruSouth Western RailwayTelugu NewsVande Bharat Sleeper ExpressVande Bharat Sleeper Train
Advertisement
Advertisement