త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sandeep Vanga | న‌గ్నంగా టాలీవుడ్ హీరో – దిల్ దియా ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేసిన సందీప్ వంగా

మ‌ళ్లీ మ‌ళ్లీ ఇది రాని రోజు ఫేమ్ క్రాంతి మాధ‌వ్ డైరెక్ట‌ర్‌గా టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. దిల్ దియా పేరుతో ఓ బోల్డ్ రొమాంటిక్ మూవీని రూపొందిస్తున్నారు. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను శ‌నివారం డైరెక్ట‌ర్ సందీప్ వంగా రిలీజ్ చేశారు.

N

Entertainment | Published On Jan 3, 2026, 2.19 pm IST

Sandeep Vanga |  న‌గ్నంగా టాలీవుడ్ హీరో – దిల్ దియా ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేసిన సందీప్ వంగా
Advertisement

Sandeep Vanga |  ప్ర‌స్తుతం సినిమాల ప‌రంగా ట్రెండ్ మారింది. యూత్‌ను అట్రాక్ట్ చేయాలంటే ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, రొమాన్స్‌, ల‌వ్‌స్టోరీ లాంటి క‌మ‌ర్షియ‌ల్ హంగులు స‌రిపోవ‌డం లేదు. బోల్డ్‌గా చెబితేనే ఆడియెన్స్ క‌నెక్ట్ అవుతున్నారు. బోల్డ్ కాన్సెప్ట్‌ల‌తో కూడిన క‌థ‌ల్లో న‌టించ‌డానికి హీరోలు కూడా రెడీ అంటున్నారు. క‌థ, పాత్ర న‌చ్చితే ఎలాంటి రిస్క్ తీసుకోవ‌డానినైనా రెడీ అంటున్నారు.
ర‌గ్గ్‌డ్ లుక్‌లో...
టాలీవుడ్ హీరో చైత‌న్య రావు మాదాడి త‌న నెక్స్ట్ సినిమాలో న‌గ్నంగా న‌టించారు. ఆయ‌న హీరోగా మ‌ళ్లీ మ‌ళ్లీ ఇది రాని రోజు ఫేమ్ క్రాంతి మాధ‌వ్‌ ద‌ర్శ‌క‌త్వంలో దిల్ దియా పేరుతో ఓ రొమాంటిక్ ల‌వ్‌స్టోరీ తెర‌కెక్కుతోంది. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను శ‌నివారం డైరెక్ట‌ర్ సందీప్ వంగా రిలీజ్ చేశారు.ఈ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌లో చైత‌న్య‌రావు ఒంటిపై బ‌ట్ట‌లు లేకుండా న‌గ్నంగా క‌నిపించారు. సోఫాపై కూర్చొని ర‌గ్గ్‌డ్ లుక్‌లో సీరియ‌స్‌గా డిజైన్ చేసిన ఈ పోస్ట‌ర్ ఆస‌క్తిని పంచుతోంది. ఈ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ నెటిజ‌న్ల‌ను ఆక‌ట్టుకుంటోంది. ల‌వ్‌, బ్రేక‌ప్‌, ఎట్రాక్ష‌న్ లాంటి ఎమోష‌న్స్‌తో డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌ను ఎంచుకొని నేటి ట్రెండ్‌కు త‌గ్గ‌ట్లుగా క్రాంతి మాధ‌వ్ దిల్ దియా సినిమాను రూపొందించ‌బోతున్నారు. సున్నిత‌మైన క‌థాంశాన్ని ఎక్క‌డ హ‌ద్దులు దాట‌కుండా చాలా రియ‌లిస్టిక్‌గా డీల్ చేసిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఐదేళ్ల త‌ర్వాత‌...

దిల్ దియా మూవీలో చైత‌న్య‌రావు మాదాడి, ఇరా, స‌ఖి, జెస్సీ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. టైటిల్ ఏ నేక్‌డ్ ట్రూత్ అనే క్యాప్ష‌న్ జోడించారు. ఈ సినిమాకు ఫ‌ణి క‌ళ్యాణ్ మ్యూజిక్ అందించ‌బోతున్నారు. ఈ ఏడాది వేస‌విలో దిల్ దియా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.
మ‌ళ్లీ మ‌ళ్లీ ఇది రాని రోజు సినిమాతో డైరెక్ట‌ర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు క్రాంతి మాధ‌వ్‌. స్వ‌చ్ఛ‌మైన ప్రేమ‌క‌థ‌గా తెర‌కెక్కిన ఈ మూవీ తెలుగు ఆడియెన్స్‌ను మెప్పించింది. ఆ త‌ర్వాత ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఉంగ‌రాల రాంబాబుతో పాటు వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ డిజాస్ట‌ర్స్‌గా నిలిచాయి. ఈ ప‌రాజ‌యాల‌తో దాదాపు ఐదేళ్ల పాటు బ్రేక్ తీసుకున్న క్రాంతి మాధ‌వ్ దిల్ దియాతో టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వ‌బోతున్నారు.
మ‌రోవైపు క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గానే కాకుండా హీరోగా డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌లతో సినిమాలు చేస్తున్నారు చైత‌న్య‌రావు. గ‌త ఏడాది అనుష్క ఘాటి మూవీలో విల‌న్‌గా న‌టించాడు.

Advertisement

తాజావార్తలు

Advertisement