త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Priyadarshi | ప్రియ‌ద‌ర్శి ఇడుపుకాయితం గ్రాండ్‌గా లాంఛ్ – టైటిల్ రివీల్ చేసిన లోకేష్ క‌న‌గ‌రాజ్‌

ప్రియ‌ద‌ర్శి ఇడుపు కాయితం మూవీ గురువారం లాంఛ్ అయ్యింది. ఈ సినిమా ఓపెనింగ్ ఈవెంట్‌కు సుకుమార్‌తో పాటు కోలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ లోకేష్ క‌న‌గ‌రాజ్ చీఫ్ గెస్ట్‌లుగా హాజ‌ర‌య్యారు. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోన్న ఈ సినిమాకు వంశీ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

N

Entertainment | Published On Jun 25, 2026, 10.23 am IST

Priyadarshi | ప్రియ‌ద‌ర్శి ఇడుపుకాయితం గ్రాండ్‌గా లాంఛ్ – టైటిల్ రివీల్ చేసిన లోకేష్ క‌న‌గ‌రాజ్‌
Advertisement

Priyadarshi | ప్రియ‌ద‌ర్శి హీరోగా న‌టిస్తోన్న ఇడుపు కాయితం మూవీ గురువారం గ్రాండ్‌గా లాంఛ్ అయ్యింది. ఈ సినిమా ఓపెనింగ్ ఈవెంట్‌కు కోలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ లోకేష్ క‌న‌గ‌రాజ్ చీఫ్ గెస్ట్‌గా హాజ‌ర‌య్యారు. ఫోక్ సింగ‌ర్ నాగ‌దుర్గ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ సినిమాకు వంశీరెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్‌తో క‌లిసి నిర్మాత బ‌న్నీవాస్ ఇడుపు కాయితం మూవీని నిర్మిస్తున్నారు.

లోకేష్ క‌న‌గ‌రాజ్‌...

గురువారం హైద‌రాబాద్‌లో ఇడుపు కాయితం ప్రారంభోత్స‌వ వేడుక జ‌రిగింది. ఈ ఈవెంట్‌లో సుకుమార్‌, లోకేష్ క‌న‌గ‌రాజ్‌, అల్లు అర‌వింద్‌తో పాటు ప‌లువురు సినీ ప్ర‌ముఖులు పాల్గొన్నారు. ఇడుపుకాయితం టైటిల్‌ను డైరెక్ట‌ర్ లోకేష్ క‌న‌గ‌రాజ్ రివీల్ చేయ‌గా... ముహూర్త‌పు స‌న్నివేశానికి సుకుమార్ గౌర‌వం ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఓపెనింగ్ ఈవెంట్ రోజే ఈ సినిమా ప్రీ లుక్ పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ అభిమానుల‌తో పంచుకున్నారు.

ట్రెడిష‌న‌ల్ లుక్‌లో...

బైక్‌పై ప్రియ‌ద‌ర్శి, నాగ‌దుర్గ జ‌ర్నీ చేస్తున్న‌ట్లుగా డిఫ‌రెంట్‌గా ఈ పోస్ట‌ర్‌ను డిజైన్ చేశారు. ఇందులో వారిద్ద‌రి ముఖాలు చూపించ‌లేదు. హైద‌రాబాద్ వెళుతున్న‌ట్లుగా బోర్డ్ క‌నిపిస్తోంది. బైక్‌కు స్టీల్ డ‌బ్బాల‌తో పాటు స‌కినాలు త‌గిలించి ఉన్నాయి. చీర‌... జ‌డ‌లో పూలు ధ‌రించి ట్రెడిష‌న‌ల్ లుక్‌లో నాగ‌దుర్గ క‌నిపిస్తోంది. ఈ పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఇడుపు కాయితం సినిమాకు సురేష్ బొబ్బిలి మ్యూజిక్ అందిస్తున్నారు. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో ఫ్యామిలీ ఎమోష‌న్స్‌తో ఈ సినిమా తెర‌కెక్కుతోంది.

త‌రుణ్ భాస్క‌ర్ హీరోగా...

ఇడుపు కాయితం సినిమాను తొలుత త‌రుణ్ భాస్క‌ర్ హీరోగా రెండేళ్ల క్రితం అనౌన్స్ చేశారు. కావ్య క‌ళ్యాణ్‌రామ్‌ను హీరోయిన్‌గా అనుకున్నారు. డైరెక్ట‌ర్ వేణు ఊడుగుల నిర్మాత‌గా వంశీ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా రావాల్సింది. అనౌన్స్‌మెంట్ త‌ర్వాత ఈ సినిమా ఆగిపోయింది. ఇప్పుడు సేమ్ డైరెక్ట‌ర్‌తో ప్రియ‌ద‌ర్శి హీరోగా లాంఛ్ అయ్యింది.

Advertisement
Advertisement