GTA 6 | గేమర్లకు గుడ్ న్యూస్.. జీటీఏ 6 ప్రీ-ఆర్డర్లు ప్రారంభం, ధరలు ఇవే!
GTA 6 | ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న గ్రాండ్ థెఫ్ట్ ఆటో VI (GTA 6) కోసం ప్రీ-ఆర్డర్లు అధికారికంగా ప్రారంభమయ్యాయి. టేక్-టూ ఇంటరాక్టివ్ సాఫ్ట్‌వేర్ సంస్థకు చెందిన రాక్‌స్టార్ గేమ్స్ భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి నుంచి అన్ని దేశాల్లో ప్రీ-ఆర్డర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
Technology | Published On Jun 25, 2026, 10.30 am IST
GTA 6 | ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న గ్రాండ్ థెఫ్ట్ ఆటో VI (GTA 6) కోసం ప్రీ-ఆర్డర్లు అధికారికంగా ప్రారంభమయ్యాయి. టేక్-టూ ఇంటరాక్టివ్ సాఫ్ట్‌వేర్ సంస్థకు చెందిన రాక్‌స్టార్ గేమ్స్ భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి నుంచి అన్ని దేశాల్లో ప్రీ-ఆర్డర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎన్నోసార్లు వాయిదా పడిన ఈ గేమ్ చివరకు ఈ ఏడాది నవంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రారంభ దశలో ఇది ప్లేస్టేషన్ 5, ఎక్స్‌బాక్స్ సిరీస్ ఎక్స్, ఎస్ ప్లాట్‌ఫామ్‌లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈసారి గేమ్‌లో జాసన్, లూసియా ప్రధాన పాత్రలుగా కనిపించనున్నారు. ఇప్పటివరకు సిరీస్‌లో వచ్చిన అన్ని భాగాల కంటే ఇది అతిపెద్ద, అత్యంత విస్తృతమైన, మరింత వాస్తవిక ప్రపంచాన్ని అందించే వెర్షన్‌గా రాక్‌స్టార్ గేమ్స్ పేర్కొంది.
ఉచితంగా వైస్ సిటీ ప్యాక్..
రాక్‌స్టార్ గేమ్స్ ఈ గేమ్‌ను రెండు ఎడిషన్లలో విడుదల చేయనుంది. స్టాండర్డ్ ఎడిషన్లో పూర్తి సింగిల్ ప్లేయర్ స్టోరీ అనుభవం లభిస్తుంది. అల్టిమేట్ ఎడిషన్లో బేస్ గేమ్‌తోపాటు ప్రత్యేక ప్రీమియం వాహనాలు, ఆయుధాలు, దుస్తులు, ప్రధాన కథలో ఉపయోగించుకునే అదనపు కంటెంట్ ను అందిస్తారు. నవంబర్ 20కి ముందు ఏ ఎడిషన్‌ను అయినా ప్రీ-ఆర్డర్ చేసినా లేదా కొనుగోలు చేసినా గేమర్లకు వింటేజ్ వైస్ సిటీ ప్యాక్ ఉచితంగా లభిస్తుంది. ఇందులో రెట్రో థీమ్‌తో రూపొందించిన ప్రత్యేక ఇన్-గేమ్ ఐటమ్స్ ఉంటాయి. డిజిటల్ ప్రీ-ఆర్డర్ చేసిన వారికి అదనంగా ఒక నెల పాటు ఉచిత జీటీఏ ప్లస్ సభ్యత్వం ఇస్తారు. దీని ద్వారా జీటీఏ ఆన్‌లైన్ లో ప్రత్యేక ప్రయోజనాలతోపాటు రాక్‌స్టార్ క్లాసిక్ గేమ్స్ లైబ్రరీకి కూడా యాక్సెస్ లభిస్తుంది. గేమ్ విడుదల రోజునే వెంటనే ఆడేందుకు వీలుగా నవంబర్ 12 నుంచి ప్రీ-లోడింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. డిజిటల్ స్టోర్ల ద్వారా ప్రీ-ఆర్డర్ చేసిన వారు అదే రోజు నుంచి గేమ్ ఫైళ్లను ముందుగానే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫిజికల్ బాక్స్ ఎడిషన్లను కూడా నవంబర్ 12 నుంచే విక్రయించనున్నారు. అయితే వాటిలో డిస్క్‌కు బదులుగా డిజిటల్ డౌన్‌లోడ్ కోడ్ ను ఇస్తారు. దీంతో గేమ్ విడుదలకు ముందే ప్రీ-లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది.
ధర ఎంతంటే..
గ్రాండ్ థెఫ్ట్ ఆటో 6 ని ప్లేస్టేషన్ స్టోర్, మైక్రోసాఫ్ట్ స్టోర్, రాక్‌స్టార్ గేమ్స్ స్టోర్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన రిటైల్ స్టోర్ల ద్వారా విక్రయించనున్నారు. ప్రస్తుతం ఈ గేమ్‌కు అధికారిక కంటెంట్ రేటింగ్ ను ఇంకా ప్రకటించలేదు. భారత్‌లో స్టాండర్డ్ ఎడిషన్ ధర రూ. 5,999 ఉండగా, అల్టిమేట్ ఎడిషన్ ధరను రూ. 7,499గా నిర్ణయించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఇవి వరుసగా 79.99, 99.99 డాలర్లుగా ఉన్నాయి.
తాజావార్తలు
- ●Emergency | ఎన్సీఈఆర్టీ చరిత్రాత్మక నిర్ణయం.. 9వ తరగతి బుక్‌లో ఎమర్జెన్సీపై పాఠం
- ●Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.27వేలు తగ్గిన బంగారం ధర.. ఈక్విటీల వైపు ప్రజల మొగ్గు..
- ●Vegetable Prices | వంటింట్లో ధరల మంట.. సామాన్యులకు చుక్కలుచూపిస్తున్న కూరగాయలు, కోడి గుడ్లు
- ●India Bound Ships | ఎల్పీజీ, ఎల్ఎన్జీ, ఎరువులతో.. హర్మూజ్‌ను దాటి భారత్‌వైపు వస్తున్న 30 భారీ నౌకలు
- ●Priyadarshi | ప్రియదర్శి ఇడుపుకాయితం గ్రాండ్‌గా లాంఛ్ - టైటిల్ రివీల్ చేసిన లోకేష్ కనగరాజ్
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోష్ కంటిన్యూ.. లాభాల్లో సూచీలు..

Emergency | ఎన్సీఈఆర్టీ చరిత్రాత్మక నిర్ణయం.. 9వ తరగతి బుక్‌లో ఎమర్జెన్సీపై పాఠం

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.27వేలు తగ్గిన బంగారం ధర.. ఈక్విటీల వైపు ప్రజల మొగ్గు..

Vegetable Prices | వంటింట్లో ధరల మంట.. సామాన్యులకు చుక్కలుచూపిస్తున్న కూరగాయలు, కోడి గుడ్లు

India Bound Ships | ఎల్పీజీ, ఎల్ఎన్జీ, ఎరువులతో.. హర్మూజ్‌ను దాటి భారత్‌వైపు వస్తున్న 30 భారీ నౌకలు




