త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

డీఎస్ ఈరే రివ్యూ – మ‌ల‌యాళం బ్లాక్‌బ‌స్ట‌ర్ హార‌ర్ మూవీ ఎలా ఉందంటే?

N

Entertainment | Published On Dec 6, 2025, 3.53 am IST

డీఎస్ ఈరే  రివ్యూ – మ‌ల‌యాళం బ్లాక్‌బ‌స్ట‌ర్ హార‌ర్ మూవీ ఎలా ఉందంటే?

మూవీ రివ్యూ

Advertisement

మ‌ల‌యాళ స్టార్ హీరో మోహ‌న్‌లాల్ త‌న‌యుడు ప్ర‌ణ‌వ్ మోహ‌న్‌లాల్ హీరోగా న‌టించిన హార‌ర్ మూవీ డీఎస్ ఈరే. రాహుల్ స‌దాశివ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. థియేట‌ర్ల‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచిన ఈ మూవీ ఓటీటీలోకి వ‌చ్చింది. జియో హాట్ స్టార్‌లో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతుంది? ఈ మ‌ల‌యాళం హార‌ర్ మూవీ ఎలా ఉంది? ఆడియెన్స్‌ను భ‌య‌పెట్టిందా? లేదా? అంటే?
రోహ‌న్ (ప్ర‌ణ‌వ్ మోహ‌న్ లాల్‌) ఓ ఆర్కిటెక్ట్‌. తండ్రి పెద్ద బిజినెస్‌మెన్. త‌ల్లిదండ్రులు అమెరికాలో సెటిల‌వ్వ‌డంతో ఇండియాలో పెద్ద ఇంట్లో రోహ‌న్ ఒంట‌రిగా ఉంటాడు. స్నేహితుల‌తో జ‌ల్సాలు చేస్తూ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంటాడు. రోహ‌న్ క్లాస్‌మేట్ క‌ణి (సుస్మిత భ‌ట్‌) ఆత్మ‌హ‌త్య చేసుకుంటుంది. క‌ణి కుటుంబ‌స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించ‌డానికి రోహ‌న్ ఆమె ఇంటికి వ‌స్తాడు. అప్ప‌టి నుంచి రోహ‌న్‌ను ఓ ఆత్మ వెంటాడుతుంది. అత‌డిపై ఎటాక్ చేసి గాయ‌ప‌రుస్తుంది. ఆ ఆత్మ క‌ణిదేన‌ని రోహ‌న్ అనుమానిస్తాడు. కాద‌నే నిజం బ‌య‌ట‌ప‌డుతుంది. అస‌లు ఆ ఆత్మ ఎవ‌రిది? రోహ‌న్‌ను ఎందుకు టార్గెట్ చేసింది? క‌ణికి, రోహ‌న్‌కు ఉన్న సంబంధ‌మేమిటి? రోహ‌న్‌కు సాయం చేసిన మ‌ధు (జిబిన్ గోపీనాథ్‌) ఎవ‌రు? మ‌ను అలియాస్ ఫిలిప్ (షైన్ టామ్ చాకో) గురించి రోహ‌న్‌కు తెలుసుకున్న నిజాలేమిటి? అన్న‌దే డీఎస్ ఈరే మూవీ క‌థ‌.
ఓ ఆత్మ‌...హీరో లేదా హీరోయిన్‌ను వెంటాడ‌టం, ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు వారు చేసే పోరాటం...హార‌ర్ సినిమాల‌న్నీ చాలా వ‌ర‌కు ఇదే ఫార్మెట్‌లో సాగుతాయి. ఈ రెగ్యుల‌ర్ హార‌ర్ టెంప్లేట్ క‌థ‌ల‌కు భిన్నంగా డీఎస్ ఈరే మూవీని తెర‌కెక్కించారు డైరెక్ట‌ర్ రాహుల్ స‌దాశివ‌న్‌.
హార‌ర్ సినిమాల్లో వెరైటీ మేక‌ప్‌ల‌తో, గ్రాఫిక్స్ వీఎఫ్ఎక్స్‌ల‌లో ద‌య్యాల‌ను చూపిస్తూ భ‌య‌పెడుతుంటారు డైరెక్ట‌ర్లు. కానీ డీఎస్ ఈరే మూవీలో ఒక్క‌సారి కూడా ద‌య్యాన్ని చూపించ‌కుండా చివ‌రి వ‌ర‌కు భ‌య‌పెట్టాడు రాహుల్ స‌దాశివ‌న్‌. సినిమాల్లో చాలా త‌క్కువ‌గా డైలాగ్స్ ఉంటాయి. ఆర్టిస్టులు గ‌ట్టిగా ప‌ది మంది లోపే క‌నిపిస్తారు. నాలుగైదు లోకేష‌న్స్‌లోనే సినిమా మొత్తం సాగుతుంది. అయినా హార‌ర్ ఫీల్‌ను చివ‌రి వ‌ర‌కు క్యారీ చేస్తూ ఆడియెన్స్‌ను ఎంగేజ్ చేశారు.
రోహ‌న్ లైఫ్‌స్టైల్‌తో సినిమా సింపుల్‌గా మొద‌ల‌వుతుంది. క‌ణి ఇంటికి రోహ‌న్ వెళ్లిన‌ప్ప‌టి నుంచే అస‌లు క‌థ మొద‌ల‌వుతుంది. కంటికి క‌నిపించ‌ని ఆత్మ రోహ‌న్‌ను వేధించ‌డం, ఆ ఆత్మ ఎవ‌ర‌న్న‌ది తెలుసుకునేందుకు మ‌ధుతో క‌లిసి రోహ‌న్ చేసే ప్ర‌య‌త్నాల‌తో ఎలాంటి ల్యాగ్ లేకుండా థ్రిల్లింగ్‌గా న‌డిపించారు. చివ‌రి ఇర‌వై నిమిషాలు మాత్రం అద‌రిపోతుంది. మ‌ను పాత్ర‌కు సంబంధించిన ట్విస్ట్ ఆక‌ట్టుకుంటుంది. హీరో క‌ష్టాలు తీరిపోయాయి అనుకునే టైమ్‌లో మ‌రో ట్విస్ట్ ఇచ్చి ఎండ్ చేయ‌డం బాగుంది.
రోహ‌న్ పాత్ర‌లో ప్ర‌ణ‌వ్ మోహ‌న్‌లాల్ యాక్టింగ్ బాగుంది. హీరోయిజం లాంటి క‌మ‌ర్షియ‌ల్ హంగులేవి లేని క్యారెక్ట‌ర్‌తో మెప్పించాడు. ప్ర‌ణ‌వ్ వ‌న్ మెన్ షోగా ఈ మూవీ నిలిచింది. సినిమాలో ప్ర‌త్యేకంగా హీరోయిన్ అంటూ ఎవ‌రూ లేరు. జ‌య‌కురుప్ క్లైమాక్స్ ముందు సినిమాలోకి ఎంట్రీ ఇస్తుంది. ఆమె క్యారెక్ట‌ర్ చాలా స‌ర్‌ప్రైజింగ్‌గా ఉంటుంది. క్రిప్టో జేవియ‌ర్ మ్యూజిక్‌, ష‌హ‌నాద్ జ‌లాల్ సినిమాటోగ్ర‌ఫీ డీఎస్ ఈరేకు ప్రాణం పోశాయి.
డీఎస్ ఈరే హ‌ర‌ర్ మూవీ ల‌వ‌ర్స్ మిస్ కాకుండా చూసే సినిమా ఇది. జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగులోనూ అందుబాటులో ఉంది.

Advertisement

తాజావార్తలు

Advertisement