Dhanush Kara Review | కర రివ్యూ – ధనుష్, మమితా బైజు యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?
ధనుష్, మమితా బైజు హీరోహీరోయిన్లుగా నటించిన కర మూవీ గురువారం థియేటర్లలో రిలీజైంది. విఘ్నేష్ రాజా దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? అంటే?
Entertainment | Published On Apr 30, 2026, 6.49 pm IST
Dhanush Kara Review | కోలీవుడ్‌లో ధనుష్ సినిమా అంటేనే మినిమం గ్యారెంటీగా చెబుతుంటారు. హ్యుమన్ రిలేషన్స్, ఎమోషన్స్‌కు పెద్దపీట వేస్తూ సినిమాలు చేస్తుంటారు. ధనుష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ కర గురువారం తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. మమితా బైజు హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు విఘ్నేష్ రాజా దర్శకత్వం వహించాడు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ ఎలా ఉందంటే?
కర బ్యాంకు దొంగతనాలు...
కర (ధనుష్) ఓ దొంగ. తండ్రి కోదండం (కేఎస్ రవికుమార్) డబ్బునే దొంగిలించి ఇంట్లో నుండి పారిపోతాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న మల్లి (మమితా బైజు) కారణంగా దొంగతనాలకు స్వస్థి చెప్పి కష్టపడి బతకాలని నిర్ణయించుకుంటాడు. సొంతంగా ఓ హోటల్ పెట్టాలని అనుకుంటాడు. లోన్ కోసం బ్యాంకుకు వెళతాడు. కానీ ష్యూరిటీ కావాలని అధికారులు అంటారు. తండ్రి పొలాన్ని తాకట్టు లోన్ తీసుకోవాలని అనుకున్న కర పదహారేళ్ల తర్వాత సొంత ఊరికి వెళతాడు. అప్పటికే పొలం కాగితాలు బ్యాంకులో తాకట్టు పెట్టిన కర తండ్రి కోదండం ఆ అప్పు తీర్చలేకపోతాడు. కొడుకుకు సాయం చేయలేకపోయాననే మనోవేదనతో కోదండం చనిపోతాడు. తండ్రిని సొంత పొలంలో ఖననం చేయాలని అనుకున్న కరను బ్యాంకు అధికారులు అడ్డుకుంటారు. ఆ తర్వాత ఏమైంది? మళ్లీ కర ఎందుకు దొంగగా మారాడు? ముత్తు సెల్వన్ (జయరాం) మేనేజర్‌గా పనిచేస్తున్న బ్యాంకులను దోచుకోవాలని ఎందుకు టార్గెట్ పెట్టుకున్నాడు? డీఎస్పీ భరత్‌న్‌తో( సూరజ్ వెంజరమూడు) కరకు ఉన్న శత్రుత్వం ఏమిటి? కర పేరుతో బ్యాంకులను దోచుకుంటున్న అసలైన దొంగ ఎవరు? అతడిని కర ఎలా పట్టుకున్నాడు అన్నదే ఈ మూవీ కథ.
బ్యాంకు రుణాల మెసేజ్...
ఎమోషన్స్, యాక్షన్ అంశాలకు ధనుష్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుంటాయి. ప్రతి సినిమాలో ఏదో ఒక సామాజిక సమస్యను చర్చిస్తుంటారు. కరలో ఈ ఫార్ములాను ఫాలో అయ్యారు ధనుష్.
తండ్రీ కొడుకుల ఎమోషన్స్‌కు లవ్‌స్టోరీని జోడించి హీస్ట్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు విఘ్నేష్ రాజా. వందల కోట్లు ఎగవేస్తున్న వ్యాపారస్తులను వదిలిపెట్టి.... వ్యవసాయం కోసం తీసుకున్న చిన్న చిన్న రుణాల విషయంలో రైతులను బ్యాంకులు ఎలా పీడిస్తుంటాయనే మెసేజ్‌ను ఆలోచనాత్మకంగా ఈ సినిమాలో చూపించిన తీరు ఆకట్టుకుంటుంది. బ్యాంకింగ్ వ్యవస్థలోని లోపాలను ఇందులో టచ్ చేశారు.
గల్ఫ్ సంక్షోభం...
హీరో దొంగతనం చేసే సీన్‌తోనే కర మూవీ ఇంట్రెస్టింగ్‌గా మొదలవుతుంది. ఫస్ట్ హాఫ్‌లో డీఎస్‌పీతో కరకు విరోధం, మల్లితో అతడి లవ్‌స్టోరీతో హీరో పాత్రను ఎస్లాబ్లిష్ చేస్తూ వెళ్లారు. 1991 నాటి గల్ఫ్ యుద్ధ పరిస్థితుల వల్ల ఏర్పడిన సంక్షోభాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపించారు. కేఎస్ రవికుమార్, ధనుష్ మధ్య వచ్చే తండ్రీకొడుకుల ఎమోషనల్ సీన్లను సహజంగా రాసుకున్నారు.
థ్రిల్లర్ మోడ్...
సెకండాఫ్ కంప్లీట్ థ్రిల్లర్ మోడ్‌లో కథ సాగుతుంది. కర మళ్లీ దొంగగా మారాలని నిర్ణయించుకోవడం...బ్యాంకు అధికారులతో పాటు పోలీసుల కళ్లుగప్పి అతడు దొంగతనాలు చేసే సీన్లు థ్రిల్లింగ్‌గా అనిపిస్తాయి. భరతన్ వేసే ఎత్తులు, తన తెలివితేటలతో కర వాటిని చిత్తు చేసే సీన్లను ఎంగేజింగ్‌గా స్క్రీన్‌పై ప్రజెంట్ చేశారు. ముత్తు సెల్వన్ నిజస్వరూపాన్ని కర బయటపెట్టే ట్విస్ట్ అదిరిపోయింది. ఎమోషనల్ క్లైమాక్స్‌తో సినిమాను ఎండ్ చేసిన తీరు బాగుంది.
మంచి కోసం దొంగతనం...
కర కాన్సెప్ట్ బాగున్నా స్క్రీన్‌ప్లే ప్రెడిక్టబుల్‌గా అనిపిస్తుంది. మంచి కోసం హీరో దొంగగా మారడం అనే కాన్సెప్ట్‌తో గతంలో చాలానే సినిమాలు వచ్చాయి. వాటి ఛాయలతోనే కర సాగుతుంది.
డీ గ్లామర్ పాత్రలో...
పాత్ర ఏదైనా అందులో అలవోకగా ఒదిగిపోతుంటారు ధనుష్. కరలో తన నటనతో ఆకట్టుకున్నారు. ఎమోషన్స్, యాక్షన్ సీన్లలో అదరగొట్టారు. హీరోయిజాన్ని సెటిల్డ్‌గా చూపించిన తీరు బాగుంది. డీ గ్లామర్ పాత్రలో మమితా బైజు నటన కొత్తగా ఉంది. కేఎస్ రవికుమార్, జయరామ్, సూరజ్ వెంజరమూడు పోటాపోటీ నటనను కనబరిచారు.
జీవీ ప్రకాష్ కుమార్ బీజీఎమ్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్‌గా నిలిచింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
కర మంచి మెసేజ్‌తో కూడిన థ్రిల్లర్ మూవీ. ధనుష్, మమితా బైజు యాక్టింగ్ కోసం ఈ సినిమాను చూడొచ్చు.
రేటింగ్ : 3/5
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



