త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Prabhas Spirit | స్పిరిట్ రిలీజ్ డేట్ వ‌చ్చేసింది – ప్ర‌భాస్ ఫ్యాన్స్‌ను భ‌య‌పెడుతున్న మార్చి సెంటిమెంట్‌

ప్ర‌భాస్ స్పిరిట్ రిలీజ్ డేట్ ఫిక్స‌య్యింది. 2027 మార్చి 5న ఈ సినిమాను రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. మార్చి నెల ప్ర‌భాస్‌కు అంత‌గా అచ్చిరాక‌పోవ‌డంతో ఫ్యాన్స్ లో టెన్ష‌న్ మొద‌లైంది.

N

Entertainment | Published On Jan 16, 2026, 6.58 pm IST

Prabhas Spirit |  స్పిరిట్ రిలీజ్ డేట్  వ‌చ్చేసింది – ప్ర‌భాస్ ఫ్యాన్స్‌ను భ‌య‌పెడుతున్న మార్చి సెంటిమెంట్‌
Advertisement

Prabhas Spirit |  రెబెల్ స్టార్ ప్ర‌భాస్ స్పిరిట్ మూవీ నుంచి స‌ర్‌ప్రైజింగ్ అప్‌డేట్ వ‌చ్చేసింది. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను (Relase Date) అనౌన్స్‌చేసేశారు. సందీప్ వంగా ద‌ర్శ‌క‌త్వంలో యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ థ్రిల్ల‌ర్‌గా ఈ మూవీ రూపొందుతోంది. ఇటీవ‌ల విడుద‌ల‌ చేసిన స్పిరిట్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా నిలిచింది. ఈ సినిమాతో స్పిరిట్‌పై ఉన్న అంచ‌నాలు అమాంతం రెట్టింపు అయ్యాయి.

2027లో రిలీజ్‌...

తాజాగా స్పిరిట్ మూవీ రిలీజ్ డేట్‌ను మేక‌ర్స్ శుక్ర‌వారం అనౌన్స్‌చేశారు. 2027 మార్చి 5న ఈ పాన్ ఇండియ‌న్ మూవీని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. రిలీజ్ డేట్ పోస్ట‌ర్ వైర‌ల్ అవుతోంది. మ‌హా శివ‌రాత్రి పండుగ సంద‌ర్భంగా స్పిరిట్‌ను మేక‌ర్స్ ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ పండుగ అడ్వాంటేజ్ సినిమాకు క‌లిసి వ‌స్తుంద‌ని టాలీవుడ్ వ‌ర్గాలు చెబుతోన్నాయి.

పోలీస్ ఆఫీస‌ర్‌గా...

స్పిరిట్ మూవీలో త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా న‌టిస్తోంది. వివేక్ ఒబెరాయ్‌, ప్ర‌కాష్ రాజ్ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. స్పిరిట్ మూవీలో ప్ర‌భాస్ పోలీస్ ఆఫీస‌ర్ రోల్‌లో క‌నిపించ‌బోతున్నారు. గ‌త సినిమాల‌కు భిన్నంగా చాలా అగ్రెసివ్ అండ్ ర‌గ్గ్‌డ్ క్యారెక్ట‌ర్‌లో ప్ర‌భాస్ క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఇందులో మూడు డిఫ‌రెంట్ లుక్‌ల‌లో ప్ర‌భాస్‌ క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. డిసెంబ‌ర్‌లో స్పిరిట్ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లైంది. ప్ర‌భాస్‌పై ఓ యాక్ష‌న్ ఎపిసోడ్‌తో పాటు కొంత టాకీ పార్ట్‌ను సందీప్ వంగా షూట్ చేశారు.త్రిప్తి డిమ్రి కంటే ముందు దీపికా ప‌దుకొనేను హీరోయిన్‌గా అనుకున్నారు. సందీప్ వంగాతో ఏర్ప‌డిన క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ కార‌ణంగా ఈ మూవీ నుంచి దీపికా ప‌దుకొనే త‌ప్పుకుంది.

మార్చి సెంటిమెంట్‌...

ప్ర‌భాస్‌కు మార్చి నెల అంత‌గా అచ్చిరాక‌పోవ‌డంతో ఫ్యాన్స్ టెన్ష‌న్ ప‌డుతోన్నారు. స్పిరిట్ కంటే ముందు మార్చిలో ప్ర‌భాస్ సినిమాలు రాఘ‌వేంద్ర, చ‌క్రం, రాధేశ్యామ్ సినిమాలు రిలీజ‌య్యాయి. ఈ మూడు సినిమాలు డిజాస్ట‌ర్స్‌గా నిలిచాయి. మార్చి సెంటిమెంట్‌ను గుర్తుచేస్తూ సోష‌ల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. అయితే రిలీజ్‌కు మ‌రో ఏడాదిపైనే స‌మ‌యం ఉండ‌టంతో అప్ప‌టివ‌ర‌కు ఏమైనా జ‌ర‌గొచ్చు అని అంటున్నారు. స్పిరిట్ మూవీకి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్ మ్యూజిక్ అందిస్తున్నారు. టీ సిరీస్ తో క‌లిసి సందీప్ వంగా ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement