త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Prabhas Fauji | డార్లింగ్ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్ – ప్ర‌భాస్ ఫౌజీ రిలీజ్ వ‌చ్చే ఏడాదేనా?

ప్ర‌భాస్ ఫౌజీ మూవీ రిలీజ్ వాయిదాప‌డిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో హిస్టారిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా ద‌స‌రాకు రిలీజ్ కానున్న‌ట్లు వార్త‌లొచ్చాయి. షూటింగ్ డిలే వ‌ల్ల ఫౌజీ రిలీజ్ వ‌చ్చే ఏడాదికి షిప్ట‌యిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

N

Entertainment | Published On Feb 8, 2026, 12.20 pm IST

Prabhas Fauji | డార్లింగ్ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్ – ప్ర‌భాస్ ఫౌజీ రిలీజ్ వ‌చ్చే ఏడాదేనా?
Advertisement

Prabhas Fauji | సంక్రాంతి రిలీజైన రాజాసాబ్ మూవీతో అభిమానుల‌ను డిస‌పాయింట్ చేశారు డార్లింగ్ ప్ర‌భాస్‌. భారీ అంచ‌నాల న‌డుమ థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన ఈ మూవీ డిజాస్ట‌ర్‌గా నిలిచింది. మారుతి ద‌ర్శ‌క‌త్వంలో హార‌ర్ కామెడీగా తెర‌కెక్కిన రాజాసాబ్ ప్ర‌భాస్ కెరీర్‌లో అతి త‌క్కువ క‌లెక్ష‌న్స్‌ను రాబ‌ట్టిన సినిమాగా నిలిచింది. నిర్మాత‌ల‌కు రెండు వంద‌ల కోట్ల వ‌ర‌కు న‌ష్టాల‌ను మిగిల్చింది. ఇటీవ‌లే ఓటీటీలో రాజాసాబ్ రిలీజైంది. ఈ సినిమా స్టోరీ, మారుతి టేకింగ్‌, లాజిక్స్ తో పాటు ప్ర‌భాస్ లుక్‌ విష‌యంలో దారుణంగా ట్రోల్స్ వ‌స్తున్నాయి.

ద‌స‌రాకు అనుకున్నారు...

ఈ ఏడాది రాజాసాబ్‌తో పాటు ప్ర‌భాస్ ఫౌజీ కూడా థియేట‌ర్ల‌లోకి రానున్న‌ట్లు మొన్న‌టివ‌ర‌కు ప్ర‌చారం జ‌రిగింది. ద‌స‌రాకు ఫౌజీ థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నున్న‌ట్లు వార్త‌లొచ్చాయి. కానీ రాజాసాబ్ డిజాస్ట‌ర్‌తో ఫౌజీ మేక‌ర్స్ సినిమా రిలీజ్‌ను వ‌చ్చే ఏడాదికి వాయిదావేసిన‌ట్లు స‌మాచారం.
రాజాసాబ్ యాక్ష‌న్ స‌న్నివేశాల‌పై చాలా విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఫైట్ సీన్స్ మొత్తాన్ని ప్ర‌భాస్ బాడీ డ‌బుల్ ఉప‌యోగించి చిత్రీక‌రించిన‌ట్లు ఈజీగా తెలిసిపోయింది. ఈ విమ‌ర్శ‌ల నేప‌థ్యంలో ఫౌజీ మేక‌ర్స్ బాడీ డ‌బుల్ ఉప‌యోగించ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్నార‌ట‌. అందుకే షూటింగ్ ఆల‌స్యం కావ‌చ్చున‌ని అంటున్నారు.

యాక్ష‌న్ సీన్స్ బ్యాలెన్స్....

ఫౌజీకి సంబంధించి టాకీ పార్ట్ దాదాపు పూర్త‌య్యింద‌ట‌. కానీ యాక్ష‌న్ స‌న్నివేశాల షూటింగ్ చాలానే బ్యాలెన్స్‌గా ఉన్న‌ట్లు చెబుతోన్నారు. హిస్టారిక‌ల్ కాన్సెప్ట్‌తో కూడిన సినిమా కావ‌డంతో ఫౌజీలో చాలానే వార్ బ్యాక్‌డ్రాప్ యాక్ష‌న్ సీక్వెన్స్ ఉన్నాయ‌ట‌. ఇవ‌న్నీ క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌కు భిన్నంగా ఉంటాయ‌ట‌. ఈ యాక్ష‌న్ ఎపిసోడ్స్‌ను పూర్తిచేయ‌డానికి 100 నుంచి 120 రోజుల‌కుపైనే షూటింగ్ డేట్స్ అవ‌స‌ర‌మ‌వుతాయ‌ని స‌మాచారం. అలాగే వీఎఫ్ఎక్స్‌కు ప్రాధాన్య‌మున్న క‌థ కావ‌డంతో పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌కు ఆరు నుంచి ఎనిమిది నెల‌ల వ‌ర‌కు టైమ్ ప‌డుతుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. దాంతో ద‌స‌రాకు ఈ ఫౌజీ రిలీజ్ కావ‌డం అనుమాన‌మేన‌ని అంటున్నారు.

హైదరాబాద్ లో షూటింగ్...

ప్ర‌స్తుతం ఫౌజీ షూటింగ్ హైద‌రాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జ‌రుగుతోంది. ప్ర‌భాస్‌తో పాటు ప్ర‌ధాన తారాగ‌ణంపై ఓ భారీ ఫైట్ సీక్వెన్స్‌ను షూట్ చేస్తున్నారు డైరెక్ట‌ర్ హ‌ను రాఘ‌వ‌పూడి. ప‌ది రోజ‌ల వ‌ర‌కు ఈ షెడ్యూల్ సాగ‌నుంద‌ని స‌మాచారం. లేటెస్ట్ షెడ్యూల్ త‌ర్వాత క‌ల్కి 2 క ప్ర‌భాస్ డేట్స్ కేటాయించిన‌ట్లు చెబుతోన్నారు.
ఫౌజీ మూవీలో ఇమాన్వీ హీరోయిన్‌గా న‌టిస్తోంది. దాదాపు నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది.

Advertisement

తాజావార్తలు

Advertisement