త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | జ‌గ్గారెడ్డి పిచ్చోడిలా తిరుగుతుండు : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy | జ‌గ్గారెడ్డి సంగారెడ్డి ప్ర‌జ‌ల అదృష్టం.. ఆయ‌న ఓడినా కూడా పిచ్చోడిలా మీ వెంబ‌డే తిరుగుతుండు అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. నేను వంద‌సార్లు చెప్పినా.. హే.. సిగ్గులేనోడా రా.. ప‌ట్నంలో జ‌ర‌సేపు నా వెంబ‌డైనా ఉండు అంటే వ‌చ్చినా కూడా తెల్లార‌గ‌ట్ల సంగారెడ్డిలో ఉంట‌డు అని రేవంత్ పేర్కొన్నారు.

S

Telangana | Published On Aug 15, 2026, 6.16 pm IST

CM Revanth Reddy | జ‌గ్గారెడ్డి పిచ్చోడిలా తిరుగుతుండు : సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : జ‌గ్గారెడ్డి సంగారెడ్డి ప్ర‌జ‌ల అదృష్టం.. ఆయ‌న ఓడినా కూడా పిచ్చోడిలా మీ వెంబ‌డే తిరుగుతుండు అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. నేను వంద‌సార్లు చెప్పినా.. హే.. సిగ్గులేనోడా రా.. ప‌ట్నంలో జ‌ర‌సేపు నా వెంబ‌డైనా ఉండు అంటే వ‌చ్చినా కూడా తెల్లార‌గ‌ట్ల సంగారెడ్డిలో ఉంట‌డు అని రేవంత్ పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లాలో స్మార్ట్ రేష‌న్ కార్డుల పంపిణీ సంద‌ర్భంగా జ‌గ్గారెడ్డిని ఉద్దేశించి సీఎం ఈ వ్యాఖ్య‌లు చేశారు.

జ‌గ్గారెడ్డి.. నాకైతే ఫ్రెండ్.. మీకైతే నాయ‌కుడు.. 30 ఏండ్ల నుంచి దోస్త్ ఈయ‌న‌.. అప్పుడ‌ప్పుడు నేను నిల‌బ‌డ‌ను. నేను అది కాదు.. నేను ఇది కాదు.. అని అప్పుడ‌ప్పుడు ఏదేదో మాట్లాడుతున్న‌డు. ఈయ‌న నిల‌బ‌డేది.. నిల‌బ‌డ‌నిది నేను గానీ, మా మ‌హేశ్ గౌడ్ కానీ, మా ఉత్త‌మ‌న్న కానీ నిర్ణ‌యించం. జ‌గ్గారెడ్డి కూడా నిర్ణ‌యించ‌లేడు. జ‌గ్గారెడ్డి నిల‌బ‌డ‌ల్నా వ‌ద్దా.. నిల‌బ‌డితే యాడ నిల‌బ‌డాల్నో రాహుల్ గాంధీ డిసైడ్ చేస్త‌డు. నేను కార్య‌క‌ర్త‌ల‌కు చెప్ప‌ద‌ల‌చుకున్నా.. ఇంకోసారి జ‌గ్గారెడ్డి నేను నిల‌బ‌డుత‌లేను.. అది లేను.. ఇది లేను అంటే రెండు రోజులు రూమ్‌లేసి అన్నం పెట్ట‌కుర్రి. నిల‌బ‌డేది, నిల‌బ‌డ‌నిది, నిల‌బ‌డితే యేడ నిల‌బ‌డేది ఆయ‌న చేతుల్లో లేదు.. అది రాహుల్ గాంధీ నిర్ణ‌యిస్తారు. ఆయ‌న రాముడైతే.. ఈయ‌న హ‌నుమంతుడు మీకు తెలుసు క‌దా.. రాముడి ఆజ్ఞ‌ను హ‌నుమంతుడు గీత కూడ దాట‌డు అని సీఎం అన్నారు.

వ‌జ్రాలు ఇచ్చినా ఇంత మంచోడు మీకు దొర‌క‌డు

సంగారెడ్డి ప్ర‌జ‌లు అదృష్ట‌వంతులు. ఒక‌ర‌కంగా దుర‌దృష్ట‌వంతులు. జ‌గ్గ‌న్న గెలిచి ఉంటే ఇవాళ ప్ర‌భుత్వంలో ముఖ్య‌మైన పాత్ర‌లో ఉండేటోడు. మీ దుర‌దృష్టం అది. కానీ మీ అదృష్టం ఏందంటే.. ఓడిపోయినా కూడా పిచ్చోడిలాగా మీ వెంబ‌డే తిరుగుతుండు. నేను వంద‌సార్లు చెప్పినా.. హే.. సిగ్గులేనోడా రా.. ప‌ట్నంలో జ‌ర‌సేపు నా వెంబ‌డైనా ఉండు.. ఏం దాచిపెట్టిన‌వ్ సంగారెడ్డిలో ల‌డ్డూ అంటే తెల్లార‌గ‌ట్ల మీ ద‌గ్గ‌రికే వ‌స్త‌డు. వంద‌, వెయ్యి కోట్లు ఇచ్చినా, వ‌జ్రాలు ఇచ్చినా ఇంత మంచోడు మీకు దొర‌క‌డు. ఆయ‌న ప్రేమ ఎన‌లేనిది.. ఇలాంటి నాయ‌కులు ప్ర‌జా జీవితంలో ఉండాలి అని రేవంత్ పేర్కొన్నారు.

నా కంటే కూడా జ‌గ్గారెడ్డి నంబ‌ర్ వ‌న్

జ‌గ్గ‌న్న‌ను మెప్పించ‌డానికి నేను ఈ మాట‌లు చెప్ప‌డం లేదు.. మ‌న‌సు నిండా చెబుతున్న‌. కుటుంబాన్ని వ‌దిలేసి ప్ర‌జ‌ల కోసం తిరిగే నాయ‌కుడు ఎవ‌రైనా ఉన్నారా అని మార్కులు వేస్తే నంబ‌ర్ వ‌న్ జ‌గ్గారెడ్డి వ‌స్త‌డు.. నాకంటే కూడా. మా కుటుంబాన్ని, అన్న‌ద‌మ్ముళ్ల‌ను చూసుకుంటేనే రాజ‌కీయం చేస్తా. ఈయ‌న అన్ని వ‌దిలేసి మీకోసం చేస్తున్న‌డు. మిమ్మ‌ల్ని జ‌గ్గ‌న్న కాపాడుడు కాదు.. జ‌గ్గ‌న్న‌న‌ను కాపాడుకునే బాధ్య‌త మీది. ఆ బ‌రువు మీ మీద పెట్టి వెళ్తున్నానని సీఎం తెలిపారు.

పొత్తుల పంచాయితీ ఏం లేదు

అక్క‌కు ఇచ్చేది అక్క‌కు ఇస్తాం.. అన్న‌కు ఇచ్చేది అన్న‌కు ఇస్తాం. పొత్తుల పంచాయితీ ఏం లేదు. అక్క‌కు చైర్ ప‌ర్స‌న్ ఇచ్చినం.. రేపు భ‌విష్య‌త్‌లో అక్క‌కు సంగారెడ్డి ఇస్తే.. జ‌గ్గారెడ్డికి ఇంకోటి ఇయొచ్చు రాహుల్ గాంధీ. ఏమిస్త‌డో నాకు తెల్వ‌దు. క‌ర్ణాట‌క‌లో బోస‌రాజుకు ఏం లేకుండానే మంత్రిని చేసి,త‌ర్వాత ఎమ్మెల్సీని చేసిండు. ఇక్క‌డ కూడా ఏం జ‌రుగుత‌దో నాకు తెల్వ‌దు కానీ జ‌గ్గారెడ్డి ప్ర‌జా జీవితంలో ఉండాలి అని పేర్కొంటూ సీఎం త‌న ప్ర‌సంగాన్ని ముగించారు.

Advertisement
Advertisement