త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Prabhas Fauji | డార్లింగ్ ఫ్యాన్స్‌కు బిగ్ అప్‌డేట్….ప్ర‌భాస్ ఫౌజీ రిలీజ్‌ అప్పుడేనా?

ప్ర‌భాస్ ఫౌజీ రిలీజ్ డేట్‌కు సంబంధించి సోష‌ల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈ పాన్ ఇండియ‌న్ మూవీ డిసెంబ‌ర్ 4న థియేట‌ర్ల‌లోకి రానున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. హిస్టారిక‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

N

Entertainment | Published On Apr 2, 2026, 3.13 pm IST

Prabhas Fauji | డార్లింగ్ ఫ్యాన్స్‌కు బిగ్ అప్‌డేట్….ప్ర‌భాస్ ఫౌజీ రిలీజ్‌ అప్పుడేనా?
Advertisement

Prabhas Fauji | 2026లో తెలుగు ఆడియెన్స్‌కు ప్ర‌భాస్ డ‌బుల్ ట్రీట్ ఇవ్వ‌బోతున్న‌ట్లు స‌మాచారం. రాజాసాబ్ త‌ర్వాత రెబెల్ స్టార్ న‌టించిన‌ మ‌రో సినిమా థియేట‌ర్ల‌లోకి రానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ ఏడాది చివ‌ర‌లో ఫౌజీ రిలీజ్ కానున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి. హిస్టారిక‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు సీతారామం ఫేమ్ హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమాలో ప్ర‌భాస్‌కు జోడీగా సోష‌ల్ మీడియా సెన్సేష‌న్ ఇమాన్వీ ఇస్మాయిల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు ఇండియ‌న్ స్క్రీన్‌పై రాన‌టువంటి డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో ద‌ర్శ‌కుడు హ‌ను రాఘ‌వ‌పూడి ఈ సినిమాను తెర‌కెక్కిస్తోన్నారు.

బ్రిటీష్ ఆర్మీ సైనికుడిగా...

ఫౌజీ మూవీలో బ్రిటీష్ ఆర్మీలో ప‌నిచేసే భార‌తీయ సైనికుడిగా ప్ర‌భాస్‌ క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. పద్మవ్యూహాన్ని జయించిన అర్జునుడు... పాండవుల పక్షాన నిలబడిన కర్ణుడు... గురువు లేని ఏకలవ్యుడు.. వీరింద‌రిని ప్ర‌తీక‌గా ప్ర‌భాస్ పాత్ర ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉంటుందంటూ ఇటీవ‌ల రిలీజ్ చేసిన ఫ‌స్ట్ లుక్‌తో డైరెక్ట‌ర్ హ‌ను రాఘ‌వ‌పూడి హింట్ ఇచ్చారు.
బ్రిటీష్ కాలం నాటి ప‌రిస్థితులు, ఓ విప్ల‌వ‌కారుడు సాగించిన ర‌హ‌స్య పోరాటంతో పాటు స్వాతంత్య్రానికి పూర్వం జ‌రిగిన‌....చ‌రిత్ర‌లో మ‌రుగున ప‌డిన కొన్ని సంఘ‌ట‌న‌ల‌ను హ‌ను రాఘ‌వ‌పూడి ఫౌజీ మూవీలో చూపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. కాగా ఫౌజీ షూటింగ్ ఇప్ప‌టివ‌ర‌కు 70 శాతం వ‌ర‌కు పూర్త‌యిన‌ట్లు స‌మాచారం. ఈ ఏడాదే ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు.

డిసెంబ‌ర్ టార్గెట్‌...

తొలుత ద‌స‌రాకు ఫౌజీ థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. కానీ షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ద‌స‌రా లోగా పూర్తికావ‌డం క‌ష్ట‌మేన‌ని అంటున్నారు. దాంతో మేక‌ర్స్ డిసెంబ‌ర్‌ను టార్గెట్‌గా ఫిక్స్ చేసిన‌ట్లు చెబుతోన్నారు. డిసెంబ‌ర్ 4న ఫౌజీ వ‌ర‌ల్డ్ వైడ్‌గా రిలీజ్ కానున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. అనుకున్న డేట్‌కు ఎలాగైనా సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని డిసైడ్ అయ్యార‌ట‌.

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌...

ఫౌజీ మూవీలో సీనియ‌ర్ హీరోయిన్ జ‌య‌ప్ర‌ద‌తో పాటు బాలీవుడ్ న‌టుడు మిథున్ చ‌క్ర‌వ‌ర్తి కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. దాదాపు నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది.
ఈ సినిమాకు విశాల్ చంద్ర‌శేఖ‌ర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ప్ర‌స్తుతం ఫౌజీతో పాటు స్పిరిట్‌, క‌ల్కి 2 షూటింగ్‌ల‌తో ప్ర‌భాస్ బిజీగా ఉన్నాడు.

Advertisement
Advertisement