Future City | జర్నలిస్టులకు ఫ్యూచర్ సిటీలో ఇళ్ల స్థలాలు!
Future City | జర్నలిస్టులకు ఫ్యూచర్ సిటీలో ప్రత్యేకంగా ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంగీకరించారు. ప్రజాప్రతినిధులు,ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల విజ్ఞప్తులు, ఇతరుల ప్రభావాలకు తావులేకుండా కేవలం జర్నలిస్టుల అవసరాలను పరిగణనలోకి తీసుకుని ఈ స్థలాల కేటాయింపు చేపడతామని స్పష్టం చేశారు.
డిసెంబర్ 9 నాటికి ప్రక్రియ పూర్తి!
సీఎం రేవంత్ రెడ్డి హామీ!
Future City | త్రినేత్ర న్యూస్ : జర్నలిస్టులకు ఫ్యూచర్ సిటీలో ప్రత్యేకంగా ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంగీకరించారు. ప్రజాప్రతినిధులు,ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల విజ్ఞప్తులు, ఇతరుల ప్రభావాలకు తావులేకుండా కేవలం జర్నలిస్టుల అవసరాలను పరిగణనలోకి తీసుకుని ఈ స్థలాల కేటాయింపు చేపడతామని స్పష్టం చేశారు.
ఈ వ్యవహారాన్ని డిసెంబర్ 9వ తేదీ నాటికి కొలిక్కి తీసుకువస్తామని సీఎం హామీ ఇచ్చారు. జర్నలిస్టులకు అవసరమైన భూమిని అంచనా వేసి, 15 రోజుల్లోగా ఫ్యూచర్ సిటీ లేఅవుట్ సిద్ధం చేయాలని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ముఖ్యమంత్రి స్వయంగా ఫోన్ చేసి సూచించారు. ఈ సందర్భంగా విలేకరుల సమక్షంలోనే ఆయన మంత్రితో మాట్లాడటం ప్రాధాన్యత సంతరించుకుంది.
ప్లాట్ల కేటాయింపులో ఎలాంటి రాజకీయ, ఇతర ప్రభావాలకు అవకాశం లేకుండా పారదర్శక విధానాన్ని అనుసరించాలని సీఎం ప్రతిపాదించారు. చిన్న పిల్లల చేతుల మీదుగా లక్కీ డ్రా (లాటరీ) నిర్వహించి అర్హులైన జర్నలిస్టులకు ప్లాట్లు కేటాయించే విధానాన్ని సూచించారు. ఈ ప్రక్రియకు తుది రూపు ఇచ్చేందుకు జర్నలిస్టులు వెంటనే రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిసి అవసరమైన వివరాలు అందించాలని సీఎం సూచించారు. ఇతర వర్గాల నుంచి వచ్చే భూ కేటాయింపుల విజ్ఞప్తులను ప్రత్యేకంగా పరిశీలిస్తామని పేర్కొన్నారు. జర్నలిస్టులకు ప్రత్యేకంగా ఫ్యూచర్ సిటీలో ఇళ్ల స్థలాల కేటాయింపుపై సీఎం సానుకూలంగా స్పందించడంతో జర్నలిస్టు వర్గాల్లో ఆశలు చిగురించాయి. రాబోయే 15 రోజుల్లో లేఅవుట్ రూపకల్పన, డిసెంబర్ 9 నాటికి ప్రక్రియను కొలిక్కి తీసుకురావాలన్న ప్రభుత్వ లక్ష్యం ఇప్పుడు కీలకంగా మారింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Harish Rao Letter to Uttam Kumar Reddy | మల్లన్న సాగర్ వద్ద అక్రమ బ్లాస్టింగ్ పనులు ఆపండి.. ఉత్తమ్‌కు హరీశ్‌రావు బహిరంగ లేఖ
అక్టోబర్ 30, 2026

DA, DR hike | విద్యుత్ ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. డీఏ, డీఆర్ పెంపు
అక్టోబర్ 30, 2026

Ponguleti Srinivas Reddy | మియాపూర్ భూములు అమ్మి.. పేదింటి ఆడబిడ్డలకు ఇళ్లు కట్టిస్తాం
అక్టోబర్ 30, 2026
తాజావార్తలు
- ●Harish Rao Letter to Uttam Kumar Reddy | మల్లన్న సాగర్ వద్ద అక్రమ బ్లాస్టింగ్ పనులు ఆపండి.. ఉత్తమ్‌కు హరీశ్‌రావు బహిరంగ లేఖ
- ●Nokia 2360 Flip | ఒకప్పటి క్రేజీ నోకియా ఫ్లిప్ ఫోన్.. మళ్లీ లాంచ్ అయింది..
- ●Ott Releases | ఈ వారం ఓటీటీలో రిలీజైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే - తెలుగు సినిమాలు హైలైట్...
- ●DA, DR hike | విద్యుత్ ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. డీఏ, డీఆర్ పెంపు
- ●IDBI Deal | కాంగ్రెస్ పార్టీ బ్యాంకులను తమ వ్యక్తిగత ఆస్తిలా వాడుకుంది
- ●Binance | క్రిప్టో కరెన్సీ చోరీ జరిగితే నష్టం ఎవరు చెల్లిస్తారు.. బైనాన్స్ చెబుతున్నది జరిగేనా..?

Harish Rao Letter to Uttam Kumar Reddy | మల్లన్న సాగర్ వద్ద అక్రమ బ్లాస్టింగ్ పనులు ఆపండి.. ఉత్తమ్‌కు హరీశ్‌రావు బహిరంగ లేఖ

Nokia 2360 Flip | ఒకప్పటి క్రేజీ నోకియా ఫ్లిప్ ఫోన్.. మళ్లీ లాంచ్ అయింది..

Ott Releases | ఈ వారం ఓటీటీలో రిలీజైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే - తెలుగు సినిమాలు హైలైట్...

DA, DR hike | విద్యుత్ ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. డీఏ, డీఆర్ పెంపు



