త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Pooja Hegde | త‌లైవ‌ర్ 173లో పూజా హెగ్డే – డీ గ్లామ‌ర్ రోల్‌లో బుట్ట‌బొమ్మ‌…

కూలీ త‌ర్వాత ర‌జ‌నీకాంత్‌తో మ‌రో సినిమా చేసే ఛాన్స్ ద‌క్కించుకుంది పూజా హెగ్డే. త‌లైవ‌ర్ 173లో బుట్ట‌బొమ్మ కీల‌క పాత్ర‌లో న‌టించ‌నున్న‌ట్లు స‌మాచారం. సిబీ చ‌క్ర‌వ‌ర్తి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీ త్వ‌ర‌లో సెట్స్‌పైకి రాబోతుంది.

N

Entertainment | Published On Jan 23, 2026, 2.34 pm IST

Pooja Hegde | త‌లైవ‌ర్ 173లో పూజా హెగ్డే – డీ గ్లామ‌ర్ రోల్‌లో బుట్ట‌బొమ్మ‌…
Advertisement

Pooja Hegde |ర‌జ‌నీకాంత్ హీరోగా లోకేష్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన కూలీ మూవీలో స్పెష‌ల్ సాంగ్‌లో క‌నిపించింది పూజా హెగ్డే. మోనిక సాంగ్‌లో గ్లామ‌ర్ త‌ళుకుల‌తో మెప్పించింది. కూలీ త‌ర్వాత మ‌రోసారి ర‌జ‌నీకాంత్‌తో సినిమా చేసే ఛాన్స్ ద‌క్కించుకుంది బుట్ట‌బొమ్మ‌. ర‌జ‌నీకాంత్ హీరోగా డాన్ ఫేమ్ సిబీ చ‌క్ర‌వ‌ర్తి ద‌ర్శ‌క‌త్వంలో ఓ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ మూవీ తెర‌కెక్కుతోంది. త‌లైవ‌ర్ 173 అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో రూపొందుతోన్న ఈ సినిమాను విల‌క్షణ న‌టుడు క‌మ‌ల్‌హాస్ నిర్మించ‌బోతున్నారు. తొలుత ఈ సినిమా సుంద‌ర్ సి ద‌ర్శ‌క‌త్వంలో అనౌన్స్‌చేశారు. కానీ క్రియేటివ్ డిఫ‌రెన్సెస్‌తో సుంద‌ర్ సి త‌ప్పుకోవ‌డంతో అత‌డి స్థానంలో సిబీ చ‌క్ర‌వ‌ర్తి త‌లైవ‌ర్ 173కి ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌లు చేప‌ట్టారు.

డీ గ్లామ‌ర్ పాత్ర‌లో...

త్వ‌ర‌లోనే ఈ భారీ బ‌డ్జెట్ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లుకాబోతుంది. కాగా త‌లైవ‌ర్ 173లో పూజా హెగ్డేతో పాటు మ‌ళావికా మోహ‌న‌న్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. వీరిద్ద‌రి పాత్ర‌ల ప్ర‌ధానంగానే ఈ సినిమా క‌థ సాగ‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇందులో డీ గ్లామ‌ర్ రోల్‌లో పూజా హెగ్డే క‌నిపించ‌బోతున్న‌ట్లు చెబుతోన్నారు. పూజా హెగ్డే కెరీర్‌లోనే మోస్ట్ ఛాలెంజింగ్ రోల్‌గా నిలువ‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.
2027 సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తోన్నారు.

45 ఏళ్ల త‌ర్వాత‌...

ర‌జ‌నీకాంత్‌, క‌మ‌ల్ హాస‌న్ కాంబోలో దాదాపు 45 ఏళ్ల లాంగ్ గ్యాప్ త‌ర్వాత ఈ మూవీ రాబోతుంది. ఈ సినిమాలో క‌మ‌ల్‌హాస‌న్ గెస్ట్ రోల్‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. చివ‌ర‌గా వీరిద్ద‌రు క‌లిసి 1979లో అల్లావుద్దీన్ అద్భుత విల‌క్కుమ్ అనే సినిమాలో క‌నిపించారు.
కాగా పూజా హెగ్డే హిట్టు అందుకొని చాలా కాల‌మే అయ్యింది. ఈ డిజాస్ట‌ర్స్‌తో సంబంధం లేకుండా ఫుల్ బిజీగా ఉంది. ద‌ళ‌ప‌తి విజ‌య్ జ‌న‌నాయ‌గ‌న్‌లో హీరోయిన్‌గా న‌టించింది పూజా హెగ్డే. సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కావాల్సింది. కానీ సెన్సార్ స‌మ‌స్య‌ల వ‌ల్ల వాయిదాప‌డింది. కాంచ‌న 4లో న‌టిస్తోంది.
దుల్క‌ర్ స‌ల్మాన్ మూవీతో టాలీవుడ్‌లో రీఎంట్రీ ఇవ్వ‌బోతుంది. ర‌వి నేల‌కుడిటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా సాగుతోంది.
.

Advertisement

తాజావార్తలు

Advertisement