త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jailer 2 | చిక్కుల్లో జైల‌ర్‌2..! షూటింగ్ స్పాట్‌లో క‌రెంట్ షాక్‌తో ఒక‌రు మృతి..!

Jailer 2 | సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న ‘జైలర్ 2’ సినిమా షూటింగ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. షూటింగ్‌ కోసం ఏర్పాటు చేసిన సెట్‌లో పని చేస్తున్న ఓ వ్య‌క్తి విద్యుత్ షాక్‌తో చ‌నిపోయాడు. ఈ ఘ‌ట‌న‌తో చిత్ర యూనిట్‌లో విషాదం అలుముకుంది.

P

Entertainment | Published On May 15, 2026, 4.38 pm IST

Jailer 2 | చిక్కుల్లో జైల‌ర్‌2..! షూటింగ్ స్పాట్‌లో క‌రెంట్ షాక్‌తో ఒక‌రు మృతి..!
Advertisement

Jailer 2 | సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న ‘జైలర్ 2’ సినిమా షూటింగ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. షూటింగ్‌ కోసం ఏర్పాటు చేసిన సెట్‌లో పని చేస్తున్న ఓ వ్య‌క్తి విద్యుత్ షాక్‌తో చ‌నిపోయాడు. ఈ ఘ‌ట‌న‌తో చిత్ర యూనిట్‌లో విషాదం అలుముకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. చెన్నై ఈస్ట్ కోస్ట్ రోడ్డులోని ఆదిత్యరామ్ ఫిల్మ్ సిటీలో ‘జైలర్ 2’ చిత్రీకరణ జరుగుతోంది. సినిమా కోసం ఇంటి ఆకారంలో ప్రత్యేక సెట్ నిర్మాణ పనులు కొన‌సాగుతున్నాయి.

ఈ స‌మ‌యంలోనే ప్ర‌మాదం జ‌రిగింది. సేలంకు చెందిన కార్తికేయన్ అనే ఎలక్ట్రిషియన్ చిత్ర యూనిట్‌లో పనిచేస్తున్నాడు. సెట్లో ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌కు, విద్యుత్ ప‌నుల్లో తోడుగా ఉంటున్నారు. ఈ క్ర‌మంలోనే ఒక్క‌సారిగా షాక్ త‌గ‌ల‌డంతో అక్క‌డిక‌క్క‌డే చ‌నిపోయాడు. అక్క‌డే ఉన్న‌వారంతా వెంట‌నే ఆసుప‌త్రికి త‌ర‌లించ‌గా.. అప్ప‌టికే మృతి చెందిన‌ట్లుగా ప్ర‌క‌టించారు. ఈ ఘ‌ట‌న‌తో షూటింగ్ స్పాట్‌లో క‌ల‌క‌లం రేగింది. సమాచారం అందుకున్న కనత్తూర్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. సెట్లో భద్రతా ప్రమాణాలు పాటించారా? విద్యుత్ వ్యవస్థలో ఏమైనా లోపాలున్నాయా? అనే కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను వెలికితీసే పనిలో పోలీసులు ఉన్నారు.

ఈ ఘటనపై తొలుత ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదని, ప్రస్తుతం విచారణ కొనసాగుతోందని పోలీసు వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా, ఈ ఘటనపై ‘జైలర్ 2’ మూవీ టీమ్ ఇప్పటివరకు స్పందించ‌లేదు. దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. రమ్యకృష్ణ మరోసారి కీలక పాత్రలో కనిపించనుండగా, శివరాజ్‌కుమార్, మోహన్‌లాల్ అతిథి పాత్రల్లో క‌నిపించ‌నున్నారు. విజయ్ సేతుపతి, మిథున్ చక్రవర్తి, సురాజ్ వెంకటరాముడు, మేఘనా రాజ్ సర్జా, అన్నా రాజన్ తదితరులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

Advertisement
Advertisement