త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Pooja Hegde | తెలుగులో బుట్ట‌బొమ్మ‌కు మ‌రో ఛాన్స్ – జార్జ్ క్రిష్‌లో హీరోయిన్‌గా?

దుల్క‌ర్ స‌ల్మాన్‌తో చేస్తోన్న రొమాంటిక్ ల‌వ్‌స్టోరీతో దాదాపు మూడేళ్ల లాంగ్‌ గ్యాప్ త‌ర్వాత టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వ‌బోతుంది బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్‌కాక‌ముందే తెలుగులో పూజా హెగ్డే మ‌రో ఛాన్స్ ద‌క్కించుకున్న‌ట్లు స‌మాచారం.

N

Entertainment | Published On Mar 17, 2026, 7.04 pm IST

Pooja Hegde | తెలుగులో బుట్ట‌బొమ్మ‌కు మ‌రో ఛాన్స్ – జార్జ్ క్రిష్‌లో హీరోయిన్‌గా?
Advertisement

Pooja Hegde |  పూజా హెగ్డే తెలుగులో మ‌ళ్లీ బిజీ అవుతోంది. ప్ర‌స్తుతం దుల్క‌ర్ స‌ల్మాన్‌తో రొమాంటిక్ ల‌వ్‌స్టోరీ చేస్తోన్న బుట్ట‌బొమ్మ టాలీవుడ్‌లో మ‌రో క్రేజీ ఆఫ‌ర్ అందుకున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. బ్యాక్ టూ బ్యాక్ డిజాస్ట‌ర్స్‌తో పూజాహెగ్డే తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు దూర‌మై మూడేళ్లు దాటిపోయింది. చివ‌ర‌గా చిరంజీవి, రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా న‌టించిన మ‌ల్టీస్టార‌ర్ మూవీ ఆచార్య‌లో హీరోయిన్‌గా న‌టించింది. ఆచార్య డిజాస్ట‌ర్‌తో పూజా హెగ్డేకు ఒక్క ఆఫ‌ర్ కూడా రాలేదు. దాంతో బాలీవుడ్‌కు షిప్ట‌య్యింది. అక్క‌డ కూడా ల‌క్ క‌లిసిరాలేదు. ఏడాది పాటు సినిమాల‌కు బ్రేక్ ఇచ్చిన పూజా హెగ్డే మ‌ళ్లీ వ‌రుస‌గా అవ‌కాశాల‌ను అందుకుంటోంది.

జ‌న‌నాయ‌గ‌న్ ...కాంచ‌న 4

ప్ర‌స్తుతం త‌మిళంలో ద‌ళ‌ప‌తి విజ‌య్‌ జ‌న‌నాయ‌గ‌న్ తో పాటు కాంచ‌న 4 సినిమాలు చేస్తోంది పూజాహెగ్డే. తెలుగులో ఓ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ మూవీ కోసం దుల్క‌ర్ స‌ల్మాన్‌తో జోడీ క‌ట్టింది. ఈ సినిమాతో దాదాపు మూడేళ్ల త‌ర్వాత టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వ‌బోతుంది. తాజాగా మ‌రో సినిమాకు పూజా హెగ్డే గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం.

శ‌ర్వానంద్ జోడీగా...

శ‌ర్వానంద్ హీరోగా టాలీవుడ్ సీనియ‌ర్ డైరెక్ట‌ర్ శ్రీనువైట్ల ద‌ర్శ‌క‌త్వంలో సైన్స్ ఫిక్ష‌న్ కామెడీ మూవీ రాబోతుంది. జూన్ లేదా జూలై నుంచి ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లుకాబోతుంద‌ట‌. ఇప్ప‌టికే ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతోన్నాయి. ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డే ఫైన‌ల్ అయిన‌ట్లు స‌మాచారం. ప‌లువురు ద‌క్షిణాదితో పాటు బాలీవుడ్ నాయిక‌ల పేర్ల‌ను ప‌రిశీలించిన మేక‌ర్స్ చివ‌ర‌కు పూజా హెగ్డే ఎంపిక‌చేశార‌ని అంటున్నారు.

జార్జ్ క్రిష్‌...

శ‌ర్వానంద్, శ్రీనువైట్ల మూవీకి జార్జ్ క్రిష్ అనే టైటిల్ ఖ‌రారైన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. సైన్స్ ఫిక్ష‌న్ ట‌చ్‌తో సాగే సినిమా కావ‌డంతోనే ఈ వెరైటీ టైటిల్‌ను మేక‌ర్స్ ఫిక్స్ చేశార‌ని టాక్‌. వ‌చ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.
ఇటీవ‌లే నారి నారి న‌డుమమురారి మూవీతో లాంగ్ గ్యాప్ త‌ర్వాత బ్లాక్‌బ‌స్ట‌ర్‌ను అందుకున్నాడు శ‌ర్వానంద్‌. ప్ర‌స్తుతం బైక‌ర్‌తో పాటు భోగి సినిమాలు చేస్తున్నాడు. జార్జ్ క్రిష్‌తో దాదాపు రెండేళ్ల గ్యాప్ త‌ర్వాత మెగాఫోన్ ప‌ట్ట‌బోతున్నాడు శ్రీనువైట్ల‌. చివ‌ర‌గా గోపీచంద్‌తో విశ్వం అనే సినిమా చేశాడు.

Advertisement

తాజావార్తలు

Advertisement