Pooja Hegde | పవన్ కళ్యాణ్ ఓజీ యూనివర్స్‌లో బుట్టబొమ్మ – అప్పుడు ఛాన్స్ మిస్ – ఇప్పుడు జాక్‌పాట్
బుట్టబొమ్మ పూజా హెగ్డే తెలుగులో మరో జాక్‌పాట్ కొట్టేసింది. పవన్ కళ్యాణ్‌తో సినిమా చేసే ఛాన్స్ దక్కించుకున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్, డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్‌లో రాబోతున్న ఓజీ 2లో హీరోయిన్‌గా బుట్టబొమ్మ పేరు ప్రచారం జరుగుతోంది.
Entertainment | Published On Jun 28, 2026, 3.31 pm IST
Pooja Hegde | ఉస్తాగ్ భగత్‌సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ నెక్స్ట్ మూవీ ఏదనే క్లారిటీ వచ్చేసింది. ఓజీ మూవీ ప్రీక్వెల్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు పవర్ స్టార్. ఓజీ 2 పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఓజీ 2 ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతోన్నాయి. అక్టోబర్ లేదా నవంబర్ నుంచి ఈ పాన్ ఇండియన్ మూవీ సెట్స్‌పైకి రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఓజీ 2కు సంబంధించి మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలయ్యాయి.
బుట్టబొమ్మ...
ఓజీ ప్రీక్వెల్‌లో హీరోయిన్ ఎవరన్నది అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది. ఈ పీరియాడికల్ యాక్షన్ మూవీలో హీరోయిన్‌గా బుట్టబొమ్మ పూజా హెగ్డే పేరు పేరు ఎక్కువగా వినిపిస్తోంది.దాదాపు ఈ ముద్దుగుమ్మనే ఫైనల్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.
ఉస్తాద్ భగత్‌సింగ్‌లో...
పవన్ కళ్యాణ్ జోడీగా పూజా హెగ్డే నటిస్తోన్న ఫస్ట్ మూవీ ఇదే. పవర్ స్టార్ హీరోగా నటించిన గత మూవీ ఉస్తాద్ భగత్‌సింగ్‌లో తొలుత హీరోయిన్‌గా పూజాహెగ్డేను తీసుకున్నారు మేకర్స్. కానీ ఈ సినిమా షూటింగ్ డిలే కావడం, డేట్స్ ఇష్యూ వల్ల ఉస్తాద్ నుంచి బుట్టబొమ్మ తప్పుకుంది. ఆమె ప్లేస్‌ను శ్రీలీలతో భర్తీ చేశారు. అప్పుడు పవన్ సినిమాలో ఛాన్స్ మిస్ చేసుకున్న పూజా హెగ్డే ఇప్పుడు ఏకంగా జాక్‌పాట్ కొట్టేసిందని నెటిజన్లు అంటున్నారు.
కాగా పూజా హెగ్డేతో పాటు ఈ సినిమాలో హీరోయిన్‌గా కాజల్ అగర్వాల్ మరో ఆప్షన్‌గా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
పవన్ కళ్యాణ్ ప్రొడ్యూసర్...
ఓజీ 2 స్టోరీపై అనేక కథనాలు, పుకార్లు వినిపిస్తోన్నాయి. ముంబై రావడానికి ముందు గంభీర ఏం చేశాడు? సుభాష్ చంద్రబోస్‌తో అతడికి ఉన్న లింకేంటి? తన సుమురాయ్ దళంతో కలిసి ఓజస్ గంభీర ఎవరిపై పోరాటం చేశాడు అనే అంశాలతో ఈ సినిమా తెరకెక్కుతోన్నట్లు సమాచారం. ఓజీ మూవీని స్వీయ నిర్మాణ సంస్థ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై పవన్ నిర్మిస్తున్నారు.
ఐదేళ్ల తర్వాత...
ప్రస్తుతం తెలుగులో దుల్కర్ సల్మాన్‌తో ఓ రొమాంటిక్ లవ్‌స్టోరీ చేస్తోంది పూజా హెగ్డే. ఈ సినిమాతో దాదాపు ఐదేళ్ల తర్వాత టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వబోతుంది. తమిళంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన జననాయగన్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. పొలిటికల్ యాక్షన్‌గా రూపొందిన ఈ సినిమాలో తమిళనాడు సీఎం దళపతి విజయ్ హీరోగా నటించాడు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Ashika Ranganath | తిరువీర్‌తో కన్నడ బ్యూటీ రొమాన్స్ – నటుడిగా ఎంట్రీ ఇస్తోన్న నిర్మాత ఎస్కేఎన్
జూన్ 28, 2026

Telugu OTT | డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగు మిస్టరీ థ్రిల్లర్ మూవీ – రెమ్యూనరేషన్ లేకుండా సినిమా చేసిన హీరో
జూన్ 28, 2026

Anasuya | ఏడాది గ్యాప్ తర్వాత కొత్త సినిమా సైన్ చేసిన అనసూయ.. సూపర్ హిట్ సీక్వెల్లో…
జూన్ 27, 2026
తాజావార్తలు
- ●MEA Statemen | పాక్ ఆరోపణలను ఖండించిన భారత్.. ఆ వ్యాఖ్యాలు నిరాధారమన్న రణధీర్ జైస్వాల్..
- ●Revanth Reddy | నల్గొండలో మహత్తర ఘట్టం.. హ్యామ్ రోడ్ల పైలాన్‌ను ఆవిష్కరించిన సీఎం
- ●Sheikh Hasina | ఉరిశిక్ష వేసినా భయపడను.. ఈ ఏడాదే బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్తా: షేక్ హసీనా సంచలన ఇంటర్వ్యూ
- ●CPI Narayana | పీవీ, మన్మోహన్ కృష్ణార్జునుల వలె పాలించారు
- ●Jangaon | నష్కల్‌లో మద్యం విక్రయం.. విద్యుత్ కనెక్షన్లు తొలగించిన సర్పంచ్
- ●Telugu OTT | డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగు మిస్టరీ థ్రిల్లర్ మూవీ - రెమ్యూనరేషన్ లేకుండా సినిమా చేసిన హీరో

MEA Statemen | పాక్ ఆరోపణలను ఖండించిన భారత్.. ఆ వ్యాఖ్యాలు నిరాధారమన్న రణధీర్ జైస్వాల్..

Revanth Reddy | నల్గొండలో మహత్తర ఘట్టం.. హ్యామ్ రోడ్ల పైలాన్‌ను ఆవిష్కరించిన సీఎం

Sheikh Hasina | ఉరిశిక్ష వేసినా భయపడను.. ఈ ఏడాదే బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్తా: షేక్ హసీనా సంచలన ఇంటర్వ్యూ

CPI Narayana | పీవీ, మన్మోహన్ కృష్ణార్జునుల వలె పాలించారు



