Chiranjeevi | మెగా 158లో మోహన్‌లాల్.. కుమార్తెగా మలయాళ బ్యూటీ!
Mega 158 Movie | మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) కథానాయకుడిగా సరికొత్త ప్రారంభమైంది. బాబీ దర్శకత్వంలో మెగా 158 (వర్కింగ్ టైటిల్-Mega 158 Movie) రూపొందుతున్న ఈ మూవీ పూజాకార్యక్రమాలను హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఘనంగా నిర్విహించారు.
Chiranjeevi | త్రినేత్ర.న్యూస్: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా సరికొత్త ప్రారంభమైంది. బాబీ దర్శకత్వంలో మెగా 158 (వర్కింగ్ టైటిల్-Mega 158 Movie) రూపొందుతున్న ఈ మూవీ పూజాకార్యక్రమాలను హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఘనంగా నిర్విహించారు. ముఖ్య అతిథులుగా స్టార్ హీరో పవన్ కల్యాణ్, రామ్ చరణ్, నాగబాబు హాజరయ్యారు. పవన్ కల్యాణ్ (Pawan Kalyan) క్లాప్ కొట్టి చిత్రాన్ని ప్రారంభించగా, చిరు కుమార్తె, నిర్మాత సుస్మిత కెమెరా స్విచ్ ఆన్ చేశారు. `వాల్తేరు వీరయ్య` తర్వాత బాబీ - చిరు కాంబినేషన్లో రూపొందనున్న రెండో చిత్రం కావడం విశేషం. ఈ పాన్ ఇండియన్ మూవీని కన్నడ అగ్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్నది.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఓ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. సినిమాలోని కొత్త లుక్ కోసం జిమ్‌లో కఠినమైన వర్కవుట్స్ చేస్తూ చిరంజీవి కనిపించారు. మాస్ అంశాలతో నిండిన శక్తిమంతమైన యాక్షన్ కథతో ఈ సినిమా ముస్తాబు కాబోతున్నది. చిరు ఇందులో రెండు కోణాల్లో సాగే పాత్రలో అలరించనున్నట్లు తెలుస్తున్నది. ఈ నెల 25 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టనున్నట్లు సమాచారం. ఫస్ట్ షెడ్యూల్ నుంచే చిరంజీవి చిత్రీకరణలో భాగం కానున్నట్లు టాక్.

మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్ ఓ కీలక పాత్రలో నటించనున్నాడట. చిరంజీవికి జోడీగా ప్రియమణి హీరోయిన్గా నటించనుందని అంటున్నారు. మరో కీలక పాత్రలో మలయాళ యంగ్ హీరోయిన్ అనస్వర రాజన్ కనిపించబోతున్నట్లు సమాచారం. ఆమె చిరుకు కుమార్తెగా కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి తెరపైకి వచ్చే అవకాశముంది. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన `మన శంకర వరప్రసాద్‌గారు`తో మెగాస్టార్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. అనిల్ రావిపూడి డైరెక్షన్లో రూపొందిన ఈ మూవీ రూ.400 కోట్ల వరకు వసూళ్లను దక్కించుకుంది. ఇదే జోష్‌లో మరోసారి సంక్రాంతి పోటీకి చిరు సిద్ధమవుతున్నారు.
THE MOST POWERFUL MEGA CLAP 😍❤️🔥🎬
Powerstar @PawanKalyan garu sounded the FIRST CLAP on Megastar @Kchirutweets garu for #KVNTeluguDebut - #Mega158 💥💥💥
A @bobbykolli film 🪓
Produced by #VenkatKNarayana#ChiruBobby2 #AnaswaraRajan @MusicThaman @vijaykartikdop @AntonyLRuben… pic.twitter.com/08sHDdsanU— KVN Productions (@KvnProductions) May 21, 2026
సంబంధిత వార్తలు

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026

Mega 158 | పవన్ కళ్యాణ్ క్లాప్‌తో మొదలైన చిరంజీవి మెగా 158 మూవీ – స్పెషల్ అట్రాక్షన్‌గా మలయాళ బ్యూటీ
మే 21, 2026

TG EAPCET 2026 Topper | 38 ఏళ్ల తర్వాత అమ్మాయికి ఫస్ట్ ర్యాంక్.. TG EAPCET టాపర్ ‘రుషి’ని సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి
మే 20, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



