త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Water Supply | 3, 4 తేదీల్లో హైద‌రాబాద్ న‌గ‌రంలో తాగు నీటి స‌ర‌ఫ‌రా బంద్..!

Water Supply | హైద‌రాబాద్ న‌గ‌ర వాసుల‌కు ముఖ్య గ‌మ‌నిక‌. ఈ నెల 3, 4 తేదీల్లో తాగునీటి స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం క‌ల‌గ‌నున్న‌ట్లు జ‌ల‌మండ‌లి అధికారులు ప్ర‌క‌టించారు.

S

Hyderabad | Published On Jan 1, 2026, 7.54 pm IST

Water Supply | 3, 4 తేదీల్లో హైద‌రాబాద్ న‌గ‌రంలో తాగు నీటి స‌ర‌ఫ‌రా బంద్..!
Advertisement

Water Supply | త్రినేత్ర‌.న్యూస్ : హైద‌రాబాద్ న‌గ‌ర వాసుల‌కు ముఖ్య గ‌మ‌నిక‌. ఈ నెల 3, 4 తేదీల్లో తాగునీటి స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం క‌ల‌గ‌నున్న‌ట్లు జ‌ల‌మండ‌లి అధికారులు ప్ర‌క‌టించారు. కృష్ణా ఫేజ్-3 పైపులైన్‌లో లీకేజీల‌తో పాటు టీఎస్ ట్రాన్స్‌కో ఎంఆర్‌టీ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ నేప‌థ్యంలో జ‌న‌వ‌రి 3న ఉద‌యం 10 గంట‌ల నుంచి 4న తెల్ల‌వారుజామున 4 గంట‌ల వ‌ర‌కు నీటి స‌ర‌ఫ‌రాకు అంతరాయం క‌ల‌గ‌నుంద‌ని తెలిపారు. ఈ క్ర‌మంలో న‌గ‌ర ప్ర‌జ‌లు తాగు నీటిని జాగ్ర‌త్త‌గా వాడుకోవాల‌ని అధికారులు సూచించారు.

నీటి స‌ర‌ఫ‌రా బంద్ అయ్యే ప్రాంతాలివే..

మాదాపూర్, కొండాపూర్, డోయెన్స్ సెక్ష‌న్, ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ బిజినెస్, భ‌ర‌త్ న‌గ‌ర్, మూసాపేట్, గాయ‌త్రి న‌గ‌ర్, బాలాన‌గ‌ర్, కేపీహెచ్‌బీ, బాలాజీ న‌గ‌ర్, ఫ‌తే న‌గ‌ర్, గోపాల్ న‌గ‌ర్, హ‌ఫీజ్‌పేట్‌, మ‌యూరి న‌గ‌ర్, మియాపూర్, ప్ర‌గ‌తి న‌గ‌ర్, మైథాస్, బీహెచ్ఈఎల్, రైల్ విహార్, హెచ్‌సీయూ, చందాన‌గ‌ర్ ఏరియాల్లో నీటి స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం క‌ల‌గ‌నుంది.

Advertisement

తాజావార్తలు

Advertisement