Malayalam OTT | తెలుగులో ఓటీటీలో రిలీజైన మలయాళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ – టూ మచ్ వయలెన్స్
మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఆజాదీ తెలుగులోకి వచ్చింది. గురువారం ఆహా ఓటీటీలో ఈ మూవీ రిలీజైంది. ఆజాదీ మూవీలో శ్రీనాథ్ భాసీ, రవీనా రవి నాయకానాయికలుగా కనిపించారు.
Entertainment | Published On Jan 1, 2026, 8.00 pm IST
Malayalam OTT | శ్రీనాథ్ భాసీ, రవీనా రవి హీరోహీరోయిన్లుగా నటించిన మలయాళం మూవీ ఆజాదీ గత ఏడాది థియేటర్లలో రిలీజైంది. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ వాణి విశ్వనాథ్ ప్రధాన పాత్రలో నటించింది. మోస్ట్ వయలెంట్ మూవీగా మలయాళ ప్రేక్షకులను భయపెట్టిన ఆజాదీ తాజాగా తెలుగులోకి వచ్చింది. గురువారం డైరెక్ట్‌గా ఆహా ఓటీటీలో ఈ మూవీ రిలీజైంది. ఆజాదీ మూవీకి జో జార్జ్ దర్శకత్వం వహించారు.
హింస, రక్తపాతం...
రివేంజ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఆజాదీ మలయాళంలో నెగెటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. మితిమీరిన హింస, రక్తపాత సన్నివేశాలతో దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించడంపై విమర్శలు వచ్చాయి. అయితే ఈ నెగెటివ్ టాక్‌తో సంబంధం లేకుండా థియేటర్లలో ఆజాదీ మంచి వసూళ్లను రాబట్టింది. ఇందులో పోలీస్ ఆఫీసర్ పాత్రలో సీనియర్ హీరోయిన్ వాణి విశ్వనాథ్ కనిపించింది. సైజు కురుప్, లాల్ కీలక పాత్రలు పోషించారు. ఆజాదీతోనే జో జార్జ్ డైరెక్టర్‌గా మలయాళంలోకి ఎంట్రీ ఇచ్చాడు.
ఆజాదీ కథ ఇదే...
మోహన్ కేరళలోనే ఫేమస్ పొలిటీషియన్. అతడి కొడుకును గంగ అనే మహిళ హత్య చేస్తుంది. కొడుకు మరణాన్ని తట్టుకోలేని మోహన్ తన పలుకుబడితో గంగకు ఉరిశిక్ష పడేలా చేస్తాడు. గంగ ప్రెగ్నెంట్ కావడంతో ఉరిశిక్షను జైలు అధికారులు వాయిదావేస్తారు. డెలివరీ కోసం గంగను హాస్పిటల్‌లో జాయిన్ చేస్తారు అధికారులు. ఆ హాస్పిటల్ నుంచి గంగను తప్పించేందుకు ఆమె భర్త రఘు ప్లాన్ చేస్తాడు. మరోవైపు గంగను హాస్పిటల్‌లోనే చంపేందుకు మోహన్ మనుషులు ప్రయత్నిస్తారు. గంగ హాస్పిటల్ నుంచి తప్పించుకుందా? మోహన్ మనుషుల బారి నుంచి భార్యను రఘు కాపాడుకున్నాడా? అన్నదే ఈ మూవీ కథ.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






