త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bhogi | ఆగ‌స్టు 28న శ‌ర్వా యాక్ష‌న్ డ్రామా..! పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానున్న భోగీ..!

Bhogi | చార్మింగ్ స్టార్ శర్వాంద్ తొలిసారిగా యాక్ష‌న్ డ్రామా భోగీ.. మూవీలో న‌టిస్తున్నాడు. సంపత్ నంది ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకె రాధామోహన్ ఎపిక్ స్కేల్‌లో నిర్మిస్తుండ‌గా.. లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తున్నారు.

P

Movies | Published On Feb 25, 2026, 8.03 pm IST

Bhogi | ఆగ‌స్టు 28న శ‌ర్వా యాక్ష‌న్ డ్రామా..! పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానున్న భోగీ..!
Advertisement

Bhogi | చార్మింగ్ స్టార్ శర్వాంద్ తొలిసారిగా యాక్ష‌న్ డ్రామా భోగీ.. మూవీలో న‌టిస్తున్నాడు. సంపత్ నంది ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకె రాధామోహన్ ఎపిక్ స్కేల్‌లో నిర్మిస్తుండ‌గా.. లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తున్నారు. శర్వా కెరీర్‌లో ఇది అతిపెద్ద, ప్రతిష్టాత్మక వెంచర్‌గా ఉంటుందని దర్శక, నిర్మాతలు పేర్కొన్నారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను బుధ‌వారం మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఫస్ట్ లుక్‌లో శర్వా ఇప్పటివరకు ఎవ‌రూ చూడని రగ్గడ్, ఫెరోషస్ అవతార్‌లో క‌నిపించాడు. గడ్డం, మీసాలు, కర్లింగ్ జుట్టుతో ర‌ఫ్ లుక్‌లో ద‌ర్శ‌న మిచ్చాడు.

డైరెక్టర్ సంపత్ నంది ఈ చిత్రాన్ని 1960ల ఉత్తర తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో భారీ సెట్‌పై కీలక యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నారు. ప్ర‌ముఖ స్టంట్ మాస్టర్ దిలీప్ సుబ్బరాయన్ ఈ యాక్షన్ సీక్వెన్స్‌ని డిజైన్ చేస్తున్నారు. చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్‌గా కిరణ్ కుమార్ మన్నె, సినిమాటోగ్రఫీ కిషోర్ కుమార్ అరోకియా వ్య‌వ‌హ‌రిస్తుండ‌గా.. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీని మేక‌ర్స్ ఆగ‌స్టు 28న ర‌క్షాబంధ‌న్ సంద‌ర్భంగా తెలుగుతో పాటు త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో ఒకేసారి పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement