OTT | మమ్ముట్టి మిస్టరీ థ్రిల్లర్ వచ్చేసింది.. ఇక మీరు చూడడమే తరువాయి
OTT | మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి హీరోగా నటించిన డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్ మూవీ థియేటర్లలో రిలీజైన పదకొండు నెలల తర్వాత ఓటీటీలోకి రాబోతుంది. డిసెంబర్ 19 నుంచి జీ5 ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు గౌతమ్ వాసు దేవమీనన్ దర్శకత్వం వహించాడు.
Entertainment | Published On Dec 12, 2025, 3.14 pm IST
మమ్ముట్టి
OTT | మమ్ముట్టి (Mammootty) హీరోగా నటించిన మలయాళం మూవీ డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్ ఎట్టకేలకు ఓటీటీలోకి రాబోతుంది. మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు తమిళ సీనియర్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వం వహించాడు. రిలీజ్‌కు ముందు డొమినిక్ మూవీపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఫ్లాపుల్లో ఉన్న డైరెక్టర్ వాసుదేవ మీనన్‌కు మెగాస్టార్ మమ్ముట్టి సినిమా చేసే అవకాశం ఇవ్వడం మలయాళం ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది. వెరైటీ టైటిల్‌తో థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది.
థియేటర్లలో రిలీజైన పది నెలల తర్వాత డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్ ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ అయ్యింది. డిసెంబర్ 19 నుంచి జీ5 ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది. రిలీజ్ డేట్‌ను అఫీషియల్‌గా ప్రకటించిన జీ5 ఓటీటీలో ఓ పోస్టర్‌ను అభిమానులతో పంచుకుంది.
డొమినిక్ మూవీలో సుస్మితా భట్, గోకుల్ సురేష్, విజీ వెంకటేష్ కీలక పాత్రలు పోషించారు. ఈ మలయాళం మూవీలో హీరోగా నటిస్తూనే ఈ సినిమాను మమ్ముట్టి స్వయంగా ప్రొడ్యూస్ చేశారు. కానీ డొమినిక్ ఆయనకు నష్టాలనే మిగిల్చింది. దాదాపు 20 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా 18 కోట్లలోపే కలెక్షన్స్‌ను రాబట్టింది.
డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్ సినిమాతోనే గౌతమ్ వాసుదేవమీనన్ డైరెక్టర్‌గా మలయాళంలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాలో ఓ గెస్ట్ రోల్ కూడా చేశాడు. రిజల్ట్‌తో సంబంధం లేకుండా మమ్ముట్టి కెరీర్‌లో డిఫరెంట్ అటెంప్ట్‌గా ఈ సినిమా నిలిచింది. ముఖ్యంగా సుస్మితాభట్ రోల్ సర్‌ప్రైజింగ్‌గా ఉందంటూ ఆడియెన్స్ నుంచి కామెంట్స్ వచ్చాయి.
డొమినిక్ కథ ఏంటంటే?
ఫేక్ సర్టిఫికెట్ తో పోలీస్ జాబ్‌లో చేరుతాడు డొమినిక్ (మమ్ముట్టి). కానీ ఎంక్వైరీలో ఫేక్ సర్టిఫికెట్ గుట్టు బయటపడటంతో ఉద్యోగం పోతుంది. ఓ ప్రైవేటు డిటెక్టివ్ ఏజెన్సీ ఏర్పాటుచేసి చిన్న చిన్న కేసులు డీల్ చేస్తుంటాడు. హాస్పిటల్‌లో డొమినిక్‌కు ఓ లేడీస్ పర్స్ దొరుకుతుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకోవడం మొదలుపెడతాడు డొమినిక్. ఈ క్రమంలో పర్స్ ఓనర్ పూజ కనిపించడం లేదనే నిజం బయటపడుతుంది. ఆ తర్వాత ఏమైంది? పూజా మిస్సింగ్ వెనకున్న మిస్టరీని డొమినిక్ ఎలా సాల్వ్ చేశాడు అన్నదే డొమినిక్ మూవీ కథ.
సంబంధిత వార్తలు

Web Series | సలార్ రాజు మిస్సింగ్ – మెగా బ్రదర్ రీఎంట్రీ .. కామెడీ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ ఎందులో..ఎప్పుడంటే?
మే 14, 2026

Keerthy Suresh | లేడీ డాన్‌గా కీర్తి సురేష్ – ఫుల్ యాక్షన్ మోడ్‌లో మహానటి…
మే 8, 2026

Jananayagan OTT | జననాయగన్ ఓటీటీ డీల్…. అప్పుడు 120 కోట్లు – ఇప్పుడు 50 కోట్లు – లీక్ ఎఫెక్ట్
మే 2, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



