త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jananayagan OTT | జ‌న‌నాయ‌గ‌న్ ఓటీటీ డీల్…. అప్పుడు 120 కోట్లు – ఇప్పుడు 50 కోట్లు – లీక్ ఎఫెక్ట్‌

ద‌ళ‌ప‌తి విజ‌య్ జ‌న‌నాయ‌గ‌న్ మూవీ ఓటీటీ డీల్ ఎట్ట‌కేల‌కు క్లోజ్ అయిన‌ట్లు స‌మాచారం. రిలీజ్ డిలే కావ‌డం, లీక్ కార‌ణంగా 50 కోట్ల‌కే ఓటీటీ హ‌క్కుల‌ను నిర్మాత‌లు అమ్మేసిన‌ట్లు ప్రచారం జరుగుతోంది.

N

Entertainment | Published On May 2, 2026, 6.22 pm IST

Jananayagan OTT | జ‌న‌నాయ‌గ‌న్ ఓటీటీ డీల్…. అప్పుడు 120 కోట్లు – ఇప్పుడు 50 కోట్లు – లీక్ ఎఫెక్ట్‌
Advertisement

Jananayagan OTT |  ద‌ళ‌ప‌తి విజ‌య్ జ‌న‌నాయ‌గ‌న్ రిలీజ్ ఎప్పుడ‌నే స‌స్పెన్స్ మూడు నెల‌లు అయినా వీడ‌టం లేదు. సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ మూవీ సెన్సార్ స‌మ‌స్య‌ల కార‌ణంగా వాయిదాప‌డింది. అప్ప‌టి నుంచి రిలీజ్ డ్రామా కొన‌సాగుతూనే ఉంది. జ‌న‌నాయ‌గ‌న్‌ రిలీజ్ డేట్ గురించి సోష‌ల్ మీడియాలో ర‌క‌ర‌కాల వార్త‌లు వినిపించాయి. . కానీ అవ‌న్నీ పుకార్లుగానే తేలిపోయాయి. త‌మిళ‌నాడు ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత జ‌న‌నాయ‌గ‌న్ రిలీజ్ డేట్‌పై అధికారికంగా ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

ఓటీటీ డీల్‌...

కాగా జ‌న‌నాయ‌గ‌న్ ఓటీటీ డీల్‌పై కోలీవుడ్ వ‌ర్గాల్లో ఓ ఆస‌క్తిక‌ర వార్త చ‌క్క‌ర్లు కొడుతోంది. ద‌ళ‌ప‌తి విజ‌య్‌కి ద‌క్షిణాదిలో ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని సంక్రాంతికి ముందు జ‌న‌నాయ‌గ‌న్ ఓటీటీ హ‌క్కుల కోసం టాప్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అన్ని పోటీప‌డ్డాయి. చివ‌ర‌కు 120 కోట్ల రికార్డు ధ‌ర‌కు అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా డిజిట‌ల్ రైట్స్‌ను ద‌క్కించుకుంది. సెన్సార్ స‌మ‌స్య‌ల కార‌ణంగా రిలీజ్ డిలే కావ‌డంతో నిర్మాత‌ల‌తో చేసుకున్న అగ్రిమెంట్‌ను అమెజాన్‌ ప్రైమ్ క్యాన్సిల్ చేసుకొని పెద్ద షాకిచ్చింది.

యాభై కోట్ల‌కు...

ప్ర‌స్తుతం ద‌ళ‌ప‌తి విజ‌య్ మూవీని ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్ కొన‌డానికి ముందుకు రావ‌డం లేద‌ట‌. సంక్రాంతి టైమ్‌లో జ‌న‌నాయ‌గ‌న్‌పై ఉన్న బ‌జ్ ఇప్పుడు లేదు. దానికి తోడు రిలీజ్‌కు ముందే ఈ సినిమా లీక‌వ్వ‌డం కూడా మైన‌స్‌గా మారింది. ఇటీవ‌లే సినిమాలోని చాలా స‌న్నివేశాలు ఆన్‌లైన్‌లో ద‌ర్శ‌న‌మిచ్చాయి. లీకుల ఎఫెక్ట్ ఓటీటీ డీల్‌పై గ‌ట్టిగానే ప‌డింద‌ని అంటున్నారు. వంద కోట్ల‌కు ఓటీటీ డీల్‌ను క్లోజ్ చేయాల‌ని మేక‌ర్స్ అనుకున్నార‌ట‌. కానీ ఆ రేటు పెట్ట‌డానికి ఏ ప్లాట్‌ఫామ్ ముందుకు రాలేద‌ట‌. చివ‌ర‌కు యాభై కోట్లు జీ5 ఓటీటీ జ‌న‌నాయ‌గ‌న్‌ స్ట్రీమింగ్ హ‌క్కుల‌ను ద‌క్కించుకున్న‌ట్లు స‌మాచారం. నిర్మాత‌లు ఎక్స్‌పెక్ట్ చేసిన దాంట్లో స‌గమే రావ‌డం షాకింగ్‌గా మారింద‌ని చెబుతున్నారు. ఇంకొన్నాళ్లు వెయిట్ చేస్తే ఉన్న హైప్ కూడా పోతుంద‌నే భ‌యంతో జీ5 ఓటీటీకి స్ట్రీమింగ్ హ‌క్కుల‌ను ఇచ్చేసిన‌ట్లు చెబుతున్నారు.

పూజా హెగ్డే...

జ‌న‌నాయ‌గ‌న్ మూవీ మే నెలాఖ‌రున థియేట‌ర్ల‌లోకి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. పొలిటిక‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ మూవీకి హెచ్ వినోథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించిన ఈ మూవీలో మ‌మితా బైజు కీల‌క పాత్ర‌లో న‌టించింది. బాల‌కృష్ణ హీరోగా న‌టించిన టాలీవుడ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ భ‌గ‌వంత్ కేస‌రి రీమేక్‌గా జ‌న‌నాయ‌గ‌న్ రూపొందింది.

 

Advertisement
Advertisement