త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tollywood Singer | మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా మారిన గేమ్ ఛేంజ‌ర్ సింగ‌ర్

ఓజీ, గేమ్ ఛేంజ‌ర్ సింగ‌ర్ రాజ‌కుమారి ఇంప్యూర్ సినిమాతో మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా ఎంట్రీ ఇస్తోంది. మోడ్ర‌న్ రిలేష‌న్స్‌పై తెర‌కెక్కిన ఈ సినిమాలో వారాహి ఓ కీల‌క పాత్రలో న‌టించింది. ఆమె ఈ సినిమాను నిర్మించింది. అక్టోబ‌ర్ 2న ఇంప్యూర్ థియేట‌ర్ల‌లోకి రాబోతుంది.

N

Entertainment | Published On Sep 28, 2026, 8.53 pm IST

Tollywood  Singer | మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా మారిన గేమ్ ఛేంజ‌ర్ సింగ‌ర్
Advertisement

Tollywood Singer |  ప‌వ‌న్ క‌ళ్యాణ్ "ఓజీ"లోని ఫైర్ స్ట్రోమ్‌, రామ్‌చ‌ర‌ణ్ "గేమ్ ఛేంజ‌ర్‌"లోని ధోప్ పాట‌ల‌తో సింగ‌ర్‌గా మ్యూజిక్ ల‌వ‌ర్స్‌ను మెప్పించింది రాజ‌కుమారి. తెలుగు మూల‌లున్న కుటుంబంలో పుట్టిన‌ రాజ‌కుమారి అమెరికాలో ర్యాప‌ర్‌గా, సింగ‌ర్‌గా మంచి పేరు తెచ్చుకుంది. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్‌ఖాన్ హీరోగా న‌టించిన "జ‌వాన్" సినిమా టైటిల్ సాంగ్‌ను కూడా పాడింది.

మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా ఎంట్రీ...

తాజాగా సింగ‌ర్ రాజ‌కుమారి మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతుంది. ఇంప్యూర్ సినిమాకు సంగీతం అందించింది. అమెరికాలో స్థిర‌ప‌డిన తెలుగు అమ్మాయి వారాహి సినిమాల‌పై ఇష్టంతో ఇంప్యూర్ ను నిర్మించారు. కేవ‌లం ప్రొడ్యూస‌ర్‌గానే కాకుండా ఈ సినిమాకు రైట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తూనే ఇందులో కీల‌క పాత్ర‌లో వారాహి క‌నిపించ‌బోతుంది. ఈ ఇంట‌ర్నేష‌న‌ల్ మూవీకి వారాహి తల్లి శ్రీదేవి మ‌రో ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. నిశాంతి ఇవని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో యష్న, సాయి కృష్ణ ప్రధాన పాత్ర‌లో పోషించారు.  ఇటీవల జరిగిన 'ఇంప్యూర్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు డైరెక్టర్ నందినీ రెడ్డి అటెండ్ అయ్యారు. అక్టోబర్ 2న థియేటర్లలో ఇంప్యూర్ విడుద‌ల కాబోతుంది.

ఓఎంజీ...

ఇటీవల విడుదలైన 'ఇంప్యూర్' ట్రైలర్, 'ఓఎంజీ' (ఓ మై గాడ్) పాటకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. 'ఓఎంజీ' సాంగ్‌ను రాజ‌కుమారి పాడింది.పవన్ కళ్యాణ్ 'ఓజీస‌లోని 'ఫైర్ స్ట్రోమ్‌" త‌ర్వాత తెలుగులో రాజ కుమారి పాడిన పాట ఇదే కావ‌డం గ‌మ‌నార్హం. ఓఎంజీ పాట‌కు లిరిక్స్ కడలి సత్యనారాయణ అందించారు. ఇంప్యూర్ సినిమాకు మ్యూజిక్ అందించ‌డ‌మే కాకుండా ఇందులో సినిమాలో ప్రత్యేక అతిథి పాత్రలో రాజ‌కుమారి క‌నిపించ‌బోతుంది.

జెన్‌జీ ఆడియెన్స్‌...

ఇంప్యూర్' సినిమా గురించి నిర్మాత‌లు మాట్లాడుతూ... ''కాలంతో పాటు సమాజంలో వ‌స్తోన్న మార్పుల‌కు అనుగుణంగా మోడ్రన్ రిలేషన్షిప్స్ మీద తీసిన చిత్రమిది. మహిళలను సమాజం చూసే కోణాన్ని సున్నితంగా ప్రశ్నిస్తుంది. మోడ్రన్ జనరేషన్ - అంతకు ముందు తరం మధ్య ఎటువంటి అనుబంధం ఉండాల‌న్న‌ది ద‌ర్శ‌కురాలు ఆలోచ‌నాత్మ‌కంగా ఈ సినిమాలో చూపించారు జెన్‌జీ ఆడియెన్స్‌ను మాత్ర‌మే కాకుండా అన్ని వయసుల వాళ్ల‌ను ఆకట్టుకునే చిత్రమిది'' అని చెప్పారు.  అభిజీత్‌, కిరీటి దామరాజు, ఆర్జే కాజల్, శ్రీవాణి ఇత‌ర పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు.

 

Advertisement
Advertisement