Allu Arjun | పోలీస్ ఆఫీసర్‌గా బన్నీ – లోకేష్ కనగరాజ్ సినిమాపై కొత్త రూమర్?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో రాబోతున్న పాన్ ఇండియన్ మూవీపై ఓ ఇంట్రెస్టింగ్ రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో బన్నీ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Entertainment | Published On Sep 28, 2026, 6.02 pm IST
Allu Arjun | పోలీస్ పాత్రలు స్టార్ హీరోలకు బాగా కలిసివచ్చాయి. హీరోయిజం, ఎలివేషన్లులతో పాటు మాస్ హంగులతో కథానాయకులను పవర్‌ఫుల్‌గా చూపించేందుకు ఈ ఖాకీ కథల్లో స్కోప్ ఉంటుంది. అందుకే ఛాన్స్ దొరికితే పోలీస్ క్యారెక్టర్లలో నటించడానికి అగ్ర హీరోలు రెడీ అంటుంటారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తదుపరి సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం.
అట్లీ రాకా...
ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో రాకా సినిమా చేస్తున్నాడు అల్లు అర్జున్. దాదాపు 1300 కోట్ల బడ్జెట్‌తో సైంటిఫిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా వచ్చే ఏడాది థియేటర్లలోకి రాబోతుంది. రాకా షూటింగ్ పూర్తికాకముందే లోకేష్ కనగరాజ్‌తో ఓ సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు బన్నీ. ప్రస్తుతం ఈ పాన్ ఇండియన్ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
23వ సినిమా...
అల్లు అర్జున్ హీరోగా నటిస్తోన్న 23వ సినిమా ఇది. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. లోకేష్ కనగరాజ్ సినిమాలో బన్నీ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నట్లు సమాచారం.
పోలీస్ కథతో...
రజనీకాంత్ కూలీ తర్వాత తాను చేయబోయే నెక్స్ట్ సినిమాను ఉద్దేశించి గతంలో ఓ ఇంటర్వ్యూలో లోకేష్ కనగరాజ్ చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతోన్నాయి. "పోలీస్ కథతో ప్రాపర్ కమర్షియల్ సినిమా చేయాలని చాలా రోజులుగా ఎదురుచూస్తున్నా. ఓ రియల్ పోలీస్ ఆఫీసర్ జీవితం గురించి ఇటీవలే తెలుసుకున్నా. అతడి లైఫ్‌లోని డ్రామా, ఎమోషన్స్ నన్ను ఆకట్టుకున్నాయి. పదేళ్ల పాటు ఖాకీ డ్రెస్ వేసుకొని సొసైటీకి సేవ చేసిన అతడు ప్రజలకు దేవుడిగా ఎలా మారాడు అన్నది ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ప్రస్తుతం ఈ పోలీస్ జీవితం ఆధాధరంగా ఓ కథను సిద్ధం చేసే పనిలో ఉన్నానంటూ" ఈ వీడియోలో లోకేష్ కనగరాజ్ పేర్కొన్నది. తన గత సినిమాల శైలికి పూర్తి భిన్నంగా ఈ మూవీ ఉండబోతున్నట్లు చెప్పాడు. బన్నీ సినిమాను ఉద్దేశించే లోకేష్ కనగరాజ్ ఈ కామెంట్లు చేశాడని నెటిజన్లు అంటున్నారు.
రేసుగుర్రం, డీజే దువ్వాడ జగన్నాథం...
లోకేష్ కనగరాజ్ సినిమాలో బన్నీ పోలీస్‌గా కనిపించబోతున్నట్లు చెబుతోన్నారు. హీరో పాత్రను రాసుకున్న తీరు, క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉండటంతోనే అల్లు అర్జున్ ఈ సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు చెబుతోన్నారు.రేసుగుర్రం సినిమాలో కొన్ని సీన్లలోఅల్లు అర్జున్ ఖాకీ డ్రెస్‌లో కనిపించాడు. డీజే దువ్వాడ జగన్నాథంలో అండర్ కవర్ కాప్‌గా నటించాడు. ఔట్ అండ్ ఔట్ పోలీస్ ఆఫీసర్ రోల్ చేయడం ఇదే మొదటిసారి అని నెటిజన్లు అంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది ప్రథమార్థంలో సెట్స్‌పైకి రాబోతుంది. అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Romantic OTT | ఓటీటీలోకి అర్జున్ రెడ్డి డైరెక్టర్ తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ
సెప్టెంబర్ 28, 2026

Venkatesh | ఆదర్శ కుటుంబం సాంగ్ లాంఛ్ ఈవెంట్ ఫొటోలు – స్పెషల్ అట్రాక్షన్‌గా హీరోయిన్లు….
సెప్టెంబర్ 27, 2026

Shweta Basu Prasad | టాలీవుడ్లోకి శ్వేతాబసు ప్రసాద్ రీఎంట్రీ – కొత్త బంగారం లోకం హీరోతో మిస్టరీ థ్రిల్లర్ వెబ్‌సిరీస్
సెప్టెంబర్ 27, 2026
తాజావార్తలు
- ●Ex MLA Jeevan Reddy | అర గుండు, హాఫ్ నాలేడ్జ్ గాడివి నువ్.. డబ్బు కోసం ఏమైనా తినే కక్కుర్తిగాడివి
- ●Jogulamba Gadwal | అమ్మకు అక్షరమాల..!
- ●National Conference | జాతీయ రబీ సదస్సులో తెలంగాణ ప్రగతి
- ●Dushyant Dave | సుప్రీంకోర్టులో లెక్కలేనంతమంది అవినీతి జడ్జీలు.. న్యాయ వ్యవస్థలో ధనవంతులకే అధిక ప్రాధాన్యత : దుష్యంత్ దవే
- ●NSE | ఎన్ఎస్ఈ షేర్లకు తొలి ఎదురుదెబ్బ.. ఐపీఓ ధర కంటే దిగువకు..
- ●Vithya Ramraj | ఆసియా గేమ్స్‌లో విత్య రామ్రాజ్ మెరుపులు.. పీటీ ఉష రికార్డు బద్దలు..!

Ex MLA Jeevan Reddy | అర గుండు, హాఫ్ నాలేడ్జ్ గాడివి నువ్.. డబ్బు కోసం ఏమైనా తినే కక్కుర్తిగాడివి

Jogulamba Gadwal | అమ్మకు అక్షరమాల..!

National Conference | జాతీయ రబీ సదస్సులో తెలంగాణ ప్రగతి

Dushyant Dave | సుప్రీంకోర్టులో లెక్కలేనంతమంది అవినీతి జడ్జీలు.. న్యాయ వ్యవస్థలో ధనవంతులకే అధిక ప్రాధాన్యత : దుష్యంత్ దవే



