CM Revanth Reddy | రాజకీయాల్లోకి అలా వచ్చా.. కాంగ్రెస్‌లోకి ఇలా చేరా.. రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..!
CM Revanth Reddy | తెలంగాణ రాజకీయాలు, తన రాజకీయ ప్రస్థానం, కాంగ్రెస్‌లో చేరడానికి దారితీసిన పరిస్థితులు, విద్యా విధానం, సంక్షేమం, యువతకు నైపుణ్యాల కల్పనపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో నిర్వహించిన అసోం దినపత్రిక ‘ప్రతిదిన్’ కాంక్లేవ్‌లో ‘ఇండియాస్ నెక్ట్స్ చాప్టర్’ అంశంపై ఆయన మాట్లాడారు.
CM Revanth Reddy | తెలంగాణ రాజకీయాలు, తన రాజకీయ ప్రస్థానం, కాంగ్రెస్‌లో చేరడానికి దారితీసిన పరిస్థితులు, విద్యా విధానం, సంక్షేమం, యువతకు నైపుణ్యాల కల్పనపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో నిర్వహించిన అసోం దినపత్రిక ‘ప్రతిదిన్’ కాంక్లేవ్‌లో ‘ఇండియాస్ నెక్ట్స్ చాప్టర్’ అంశంపై ఆయన మాట్లాడారు. తెలంగాణలో విద్యార్థి రాజకీయాల ప్రభావం తక్కువేనని రేవంత్ అన్నారు. లెఫ్ట్, రైట్ విద్యార్థి సంఘాలు ఉన్నప్పటికీ ఎన్ఎస్‌యూఐ ప్రభావం పెద్దగా లేదన్నారు. ఉత్తర, దక్షిణ భారతదేశాల్లో రాజకీయాల శైలి భిన్నంగా ఉంటుందని చెప్పారు. యూనివర్సిటీ, లా, ఆర్ట్స్ కాలేజీల్లో ఏబీవీపీలో గెలిచిన నేతలు తర్వాత కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన సందర్భాలున్నాయని తెలిపారు. విద్యార్థి రాజకీయాల్లో ఏబీవీపీ ప్రభావం ఉంటే.. రాజకీయాల్లో కాంగ్రెస్ ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు.
స్వతంత్రుడిగా గెలిచి.. టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి..
2006లో జడ్పీటీసీ సభ్యుడిగా, 2007లో ఎమ్మెల్సీగా స్వతంత్ర అభ్యర్థిగా గెలిచానని రేవంత్ తెలిపారు. ఆ రెండు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించానన్నారు. అప్పట్లో జిల్లాలో కాంగ్రెస్, టీడీపీ మాత్రమే ప్రధాన పార్టీలుగా ఉండేవని చెప్పారు. ప్రభుత్వంపై పోరాడాలంటే ప్రతిపక్షంలో ఉండటమే మేలని భావించి టీడీపీలో చేరానన్నారు. ఆ పార్టీ నుంచి 2009, 2014లో ఎమ్మెల్యేగా గెలిచినట్లు తెలిపారు. 2017లో కాంగ్రెస్‌లో చేరి.. 2019లో ఎంపీగా విజయం సాధించానని వివరించారు. రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ నాయకత్వం ఆంధ్రప్రదేశ్‌లో ఉండటంతో తెలంగాణలో ఆ పార్టీ ప్రాధాన్యం తగ్గిందన్నారు. తెలంగాణలో టీడీపీతో కలిసి పనిచేయడం ఇబ్బందికరంగా ఉంటుందని ప్రజలు చెప్పడంతో కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. రాహుల్ గాంధీని కలిసిన తర్వాత 15 నిమిషాలు మాట్లాడానని.. అప్పుడే ఆయన తన నాయకుడని నిర్ణయించుకున్నానని చెప్పారు.
తెలంగాణ ఇచ్చింది రాజకీయ ప్రయోజనం కోసం కాదు..
తెలంగాణను కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ ఇచ్చారని రేవంత్ గుర్తుచేశారు. 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలున్న ఆంధ్రప్రదేశ్‌ను విభజించడం ద్వారా రాజకీయంగా నష్టం జరుగుతుందని తెలిసినా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని పేర్కొన్నారు. 1200 మంది యువకుల త్యాగాలను, ప్రజల ఆకాంక్షలను గౌరవించి రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని అన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత కాంగ్రెస్‌కు రాజకీయ ప్రయోజనం కలగలేదని, రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, ప్రజల ఆత్మగౌరవం కోసమే నిర్ణయం తీసుకున్నారని రేవంత్ చెప్పారు. తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి కాంగ్రెస్ నిర్దేశించిన లక్ష్యాలను గత ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు. అందుకే కాంగ్రెస్‌లో చేరానని తెలిపారు. బయటి నుంచి వచ్చిన వ్యక్తినైనా ఐదేళ్లలోనే కాంగ్రెస్ తనకు కార్యనిర్వాహక అధ్యక్ష పదవి, ఎంపీ, పీసీసీ అధ్యక్ష పదవులతో పాటు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని కల్పించిందన్నారు.
చదువుతోనే ఎదుగుదల
దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు అక్షరాస్యత 12.5 శాతం కూడా లేదని రేవంత్ అన్నారు. పేదరికం, కరువు పరిస్థితుల్లో పండిట్ నెహ్రూ విద్య, సాగునీటి రంగాలకు ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు. ఐఐటీలు, ఐఐఎంలు, యూనివర్సిటీలు, సాగునీటి ప్రాజెక్టులు, గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలల ఏర్పాటుకు పునాది వేశారని చెప్పారు. విద్య, వైద్యం, సాగునీటి రంగాల్లో దేశం క్రమంగా అభివృద్ధి చెందిందన్నారు. స్వాతంత్య్ర సమయంలో 33 ఏళ్లుగా ఉన్న సగటు ఆయుర్దాయం ఇప్పుడు 73 ఏళ్లకు చేరిందని తెలిపారు. అయితే చదువు పెరిగినా నాణ్యత లోపిస్తోందని, ఆహార ధాన్యాలు అందుబాటులో ఉన్నా పౌష్టికాహారం అందడం లేదని పేర్కొన్నారు. తెలంగాణలో విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చేందుకు విద్యా కమిషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల నిష్పత్తి దేశ సగటు కంటే మెరుగ్గా ఉన్నా.. ప్రతి ఏడాది 50-60 వేల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలను వీడుతున్నారని చెప్పారు. ఇంగ్లిష్ మీడియం, నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ వంటి అంశాల్లో ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటుతో పోటీ పడాల్సిన అవసరం ఉందన్నారు.
సర్టిఫికెట్ల కోసం కాదు.. నైపుణ్యాల కోసం చదవాలి..
యువతకు నాణ్యమైన విద్యతో పాటు నైపుణ్యాలు అందించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని రేవంత్ తెలిపారు. ఏటా రాష్ట్రం నుంచి సుమారు 1.80 లక్షల మంది ఇంజినీరింగ్ విద్యార్థులు బయటకు వస్తున్నారని.. వారిలో కేవలం 20 వేల మందికే ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పారు. మిగిలిన వారు తమ విద్యార్హతకు తగని ఉద్యోగాలు చేస్తున్నారని తెలిపారు. ఈ పరిస్థితిని మార్చేందుకు ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సర్టిఫికెట్ల కోసం కాకుండా ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాల కోసం యువత చదవాలని సూచించారు. యూనివర్సిటీకి ఆనంద్ మహీంద్రా ఛైర్‌పర్సన్‌గా, శ్రీని రాజు వైస్ ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారని తెలిపారు. కార్పొరేట్ సంస్థల అధిపతులను డైరెక్టర్లుగా నియమించి.. పరిశ్రమలకు అవసరమైన కోర్సులను రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.
ఐటీఐల్లో పాత కోర్సులకు స్వస్తి
1956లో ప్రారంభమైన ఐటీఐల్లో ఇప్పటికీ పాతకాలపు కోర్సులు కొనసాగుతున్నాయని రేవంత్ అన్నారు. డీజిల్ మెకానిక్ వంటి కోర్సులు ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా లేవని పేర్కొన్నారు. టాటా సంస్థతో ఒప్పందం చేసుకుని కొత్త నైపుణ్య శిక్షణను అందిస్తున్నట్లు తెలిపారు. శిక్షణా వ్యయంలో టాటా సంస్థ 86 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 14 శాతం భరిస్తున్నాయని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. పరిశ్రమలే సిలబస్ రూపొందించి, శిక్షణ ఇచ్చి, ఉద్యోగాలు కల్పించేలా వ్యవస్థను రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావంతో వైట్ కాలర్ ఉద్యోగాల్లో మార్పులు వస్తున్నాయని, భవిష్యత్‌లో బ్లూ కాలర్ నైపుణ్యాలకు డిమాండ్ పెరుగుతుందని రేవంత్ అన్నారు. జర్మనీ, జపాన్, కొరియా వంటి దేశాల్లో ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకునేలా ఆయా భాషల్లోనూ శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు.
సంక్షేమంపై పోటీ ఉంటే.. పోటీ పడాల్సిందే..
రాజకీయ పార్టీల మధ్య సంక్షేమ పథకాల విషయంలో పోటీ ఉన్నప్పుడు తాము కూడా పోటీ పడక తప్పదని రేవంత్ వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని తెలిపారు. అయితే సంక్షేమం, ఉచిత పథకాలతో పాటు అభివృద్ధికి నిధులు కేటాయించాల్సి ఉందన్నారు. వేతనాలు, పింఛన్లు, ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణ, సంక్షేమ పథకాలకు ఖర్చు తప్పనిసరిగా ఉంటుందని.. దీంతో అభివృద్ధికి అందుబాటులో ఉండే నిధులు పరిమితమవుతున్నాయని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఇకపై అంతకుమించి సంక్షేమ పథకాలు ఇవ్వలేమని పలుమార్లు స్పష్టం చేసినట్లు రేవంత్ తెలిపారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Tollywood | కులం అనే ఇరుకు గదిలో.. ఊపిరాడక మగ్గుతున్న తెలుగు సినిమా
- ●Telangana Section 22A Land Issues | 22-ఏ పొరపాటు కాదు.. ఉద్దేశపూర్వకమే!
- ●OTT | డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజైన మౌనీరాయ్ బాలీవుడ్ బోల్డ్ మూవీ - రెడ్‌లైట్ ఏరియా కథలతో...
- ●Padi Kaushik Reddy Expulsion | కౌశిక్‌పై వేటు.. అంత సులువేం కాదు
- ●Samantha | జిమ్‌కు "నో" బ్రేక్ - బేబీ బంప్‌తో సమంత వర్కవుట్స్
- ●Countries Where Divorce Is Illegal | ఈ రెండు దేశాల్లో విడాకులు తీసుకోవడం నేరం

Tollywood | కులం అనే ఇరుకు గదిలో.. ఊపిరాడక మగ్గుతున్న తెలుగు సినిమా

Telangana Section 22A Land Issues | 22-ఏ పొరపాటు కాదు.. ఉద్దేశపూర్వకమే!

OTT | డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజైన మౌనీరాయ్ బాలీవుడ్ బోల్డ్ మూవీ - రెడ్‌లైట్ ఏరియా కథలతో...

Padi Kaushik Reddy Expulsion | కౌశిక్‌పై వేటు.. అంత సులువేం కాదు






