త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Pooja Hegde | ఎన్టీఆర్ గాడ్‌ ఆఫ్ వార్‌కు హీరోయిన్ దొరికిందా? – దేవ‌సేన‌గా బుట్ట‌బొమ్మ

అర‌వింద స‌మేత వీర రాఘ‌వ త‌ర్వాత ఎన్టీఆర్‌, డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ కాంబోలో ఓ మైథాల‌జీ మూవీ రాబోతుంది. సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి క‌థ‌తో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు గాడ్ ఆఫ్ వార్ అనే టైటిల్ ఖ‌రారు చేసిన‌ట్లు స‌మాచారం. ఈ మైథాల‌జీ మూవీలో హీరోయిన్‌గా బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే ఛాన్స్ ద‌క్కించుకున్న‌ట్లు ప్రచారం జరుగుతోంది.

N

Entertainment | Published On Sep 27, 2026, 5.11 pm IST

Pooja Hegde | ఎన్టీఆర్ గాడ్‌ ఆఫ్ వార్‌కు హీరోయిన్ దొరికిందా? – దేవ‌సేన‌గా బుట్ట‌బొమ్మ
Advertisement

Pooja Hegde |అర‌వింద స‌మేత వీర రాఘవ త‌ర్వాత ఎన్టీఆర్, పూజా హెగ్డే క‌లిసి మ‌రో సినిమా చేయ‌బోతున్నారా? వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో ఓ మైథాల‌జీ మూవీ రానుందా? అంటే ఔన‌నే అంటున్నాయి టాలీవుడ్ వ‌ర్గాలు. ప్ర‌స్తుతం డ్రాగ‌న్ సినిమాతో బిజీగా ఉన్నారు ఎన్టీఆర్‌. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ పాన్ ఇండియ‌న్ మూవీ వ‌చ్చే ఏడాది జూన్‌లో థియేట‌ర్ల‌లోకి రాబోతుంది.

మైథాల‌జీ మూవీ...

డ్రాగ‌న్ త‌ర్వాత డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్‌తో ఎన్టీఆర్ ఓ మైథాల‌జీ మూవీ చేయ‌బోతున్నారు. యుద్ద దేవుడిగా పురాణాలు పేర్కొన్న సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి క‌థ‌తో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ఈ పాన్ ఇండియ‌న్ మూవీకి గాడ్ ఆఫ్ వార్ అనే టైటిల్‌ను ఖ‌రారు చేసిన‌ట్లు వార్త‌లొస్తున్నాయి. ఈ ఏడాది జూన్‌లో ఎన్టీఆర్‌, త్రివిక్ర‌మ్ మూవీకి సంబంధించిన అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ వ‌చ్చింది.

గాడ్ ఆఫ్ వార్‌...

ఓ వైపు ఆద‌ర్శ కుటుంబం సినిమా షూటింగ్‌లో బిజీగా ఉంటూనే మ‌రోవైపు ఎన్టీఆర్ గాడ్ ఆఫ్ వార్‌కు సంబంధించిన స్క్రిప్ట్ ప‌నుల‌పై ఫోక‌స్ పెట్టారు త్రివిక్ర‌మ్‌. ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు దాదాపు తుది ద‌శ‌కు చేరుకున్న‌ట్లు స‌మాచారం. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రిలో ఈ సినిమాను లాంఛ్ చేయ‌బోతున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి.

హీరోయిన్ ఎవ‌రు...

గాడ్ ఆఫ్ వార్‌లో హీరోయిన్ ఎవ‌ర‌న్న‌ది తెలుగు ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తిక‌రంగా మారింది. కియారా అద్వానీతో పాటు ప‌లువురు స్టార్ హీరోయిన్ల పేర్లు ప్ర‌చారం జ‌రుగుతోన్నాయి. తాజాగా మ‌రో కొత్త బ్యూటీ తెర‌పైకి వ‌చ్చింది. గాడ్ ఆఫ్ వార్‌లో పూజా హెగ్డే ఫైన‌ల్ అయిన‌ట్లు వార్త‌లొస్తున్నాయి. మైథాల‌జీ మూవీకి త‌గ్గ గ్రేస్‌, ఛార్మ్ బుట్ట‌బొమ్మ‌లో ఉండ‌టంతో ఆమెను హీరోయిన్‌గా తీసుకోవాల‌ని డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ ఫిక్స్ అయిన‌ట్లు చెబుతోన్నారు. ఇంద్రుడి కుమార్తె దేవ‌సేన పాత్ర‌లో పూజా హెగ్డే క‌నిపించ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

నాలుగేళ్ల త‌ర్వాత‌...

ఎన్టీఆర్, త్రివిక్ర‌మ్ క‌ల‌యిక‌లో వ‌చ్చిన అర‌వింద స‌మేత వీర రాఘ‌వ‌లో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించింది. మ‌రోసారి ఈ కాంబో రిపీట్ కానుండ‌టం టాలీవుడ్ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌రంగా మారింది. ప‌రాజ‌యాల కార‌ణంగా టాలీవుడ్‌కు దూర‌మైన పూజా హెగ్డే నాలుగేళ్ల లాంగ్ గ్యాప్ త‌ర్వాత శ్రీశ్రీ మూవీతో రీఎంట్రీ ఇస్తోంది. దుల్క‌ర్ స‌ల్మాన్ హీరోగా న‌టిస్తోన్న ఈ మూవీ డిసెంబ‌ర్‌లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.

 

Advertisement
Advertisement