త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nivetha Thomas | రెండేళ్ల గ్యాప్ త‌ర్వాత రీఎంట్రీ – లేడీ ఓరియెంటెడ్ మూవీలో నివేదా థామ‌స్ – టైటిల్ ఇదే!

రెండేళ్ల గ్యాప్ త‌ర్వాత నివేదా థామ‌స్ టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వ‌బోతుంది. శ్రీమ‌తి పేరుతో ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తోంది. థియేట‌ర్ల‌లో కాకుండా నేరుగా శ్రీమతి మూవీ ఓటీటీలో రిలీజ్ కానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

N

Entertainment | Published On Jul 19, 2026, 3.25 pm IST

Nivetha Thomas | రెండేళ్ల గ్యాప్ త‌ర్వాత రీఎంట్రీ – లేడీ ఓరియెంటెడ్ మూవీలో నివేదా థామ‌స్ – టైటిల్ ఇదే!
Advertisement

Nivetha Thomas |  నివేదా థామ‌స్ హీరోయిన్‌గా న‌టించిన తెలుగు మూవీ 35 చిన్న క‌థ కాదు నేష‌న‌ల్ అవార్డుల్లో స‌త్తా చాటింది. రెండు జాతీయ పుర‌స్కారాల‌ను ద‌క్కించుకుంది. 2024లో రిలీజైన ఈ మూవీలో ఇద్ద‌రు చిన్నారుల‌కు త‌ల్లిగా అద్భుత న‌ట‌నను క‌న‌బ‌రిచింది నివేదా థామ‌స్‌. ఈ సినిమాకుగాను ఉత్త‌మ హీరోయిన్‌గా గ‌ద్ద‌ర్ అవార్డు అందుకుంది.

బొద్దుగుమ్మ‌గా...

35 చిన్న క‌థ కాదు త‌ర్వాత రెండేళ్లు సినిమాలకు గ్యాప్ తీసుకుంది నివేదా థామస్. తెలుగులోనే కాకుండా ఇత‌ర భాష‌ల్లో కూడా కొత్త ప్రాజెక్ట్‌లేవి అంగీక‌రించ‌లేదు. బ‌రువు పెరిగి బొద్దుగుమ్మ‌గా మారిపోవ‌డంతోనే ఆమెకు అవ‌కాశాలు త‌గ్గిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

లేడీ ఓరియెంటెడ్ మూవీ...

దాదాపు రెండేళ్ల విరామం త‌ర్వాత నివేదా థామ‌స్ టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వ‌బోతుంది. శ్రీమ‌తి పేరుతో ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తోంది. కుటుంబ బాధ్య‌త‌ల కార‌ణంగా త‌న క‌ల‌ల‌కు ఓ గృహిణి ఎలా దూర‌మైంది? డ్యాన్స‌ర్ కావాల‌నే త‌న ల‌క్ష్యాన్ని ఏ విధంగా నెర‌వేర్చుకుంద‌నే అంశాల‌తో ఈ మూవీ రూపొందుతోన్న‌ట్లు స‌మాచారం. ఇందులో మిడిల్ క్లాస్ గృహిణిగా నివేదా థామ‌స్ క‌నిపించ‌బోతుంది.

నేరుగా ఓటీటీలో...

శ్రీమ‌తి మూవీ థియేట‌ర్ల‌లో కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ కానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. త‌మ అప్‌క‌మింగ్ మూవీస్, వెబ్‌సిరీస్ వివ‌రాల‌ను జీ5 ఓటీటీ రివీల్ చేసింది. ఈ లిస్ట్‌లో శ్రీమ‌తి మూవీ కూడా ఒక‌టి అని ప్ర‌క‌టించింది. ఈ సినిమా తాలూకు చిన్న వీడియో గ్లింప్స్‌ను అభిమానుల‌తో పంచుకుంది. శ్రీమ‌తి మూవీతో కొత్త డైరెక్ట‌ర్ టాలీవుడ్‌కు ప‌రిచ‌యం కానున్న‌ట్లు చెబుతున్నారు.

నాని నిన్నుకోరితో...

చైల్డ్ యాక్ట‌ర్‌గా నివేదా థామ‌స్ కెరీర్ ప్రారంభ‌మైంది. ఆ త‌ర్వాత హీరోయిన్‌గా మ‌ల‌యాళంతో పాటు తెలుగు, త‌మిళ భాష‌ల్లో సినిమాలు చేసింది. తెలుగులోనే ఎక్కువ‌గా స‌క్సెస్‌ల‌ను అందుకుంది. నాని హీరోగా న‌టించిన నిన్నుకోరి మూవీతో టాలీవుడ్‌లోకి తొలి అడుగు వేసింది. ఆ త‌ర్వాత ఎన్టీఆర్ జై ల‌వ‌కుశ‌, క‌ళ్యాణ్ రామ్ 118తో పాటు వీ, బ్రోచేవారెవ‌రురా, శాఖిని డాకిని తో పాటు మ‌రికొన్ని సినిమాలు చేసింది. త‌మిళంలో ద‌ర్బార్ మూవీలో ర‌జ‌నీకాంత్ కూతురిగా క‌నిపించింది.

 

Advertisement

తాజావార్తలు

Advertisement