త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Aishwarya Rajesh | నేను తెలుగు అమ్మాయినే – అయినా ఎవ‌రూ అవ‌కాశాలు ఇవ్వ‌లేదు – ఐశ్వ‌ర్య రాజేష్ కామెంట్స్‌

ఐశ్వ‌ర్య రాజేష్ హీరోయిన్‌గా న‌టించిన ఓ సుకుమారి మూవీ టీజ‌ర్ శుక్ర‌వారం రిలీజైంది. ఈ టీజ‌ర్ లాంఛ్ ఈవెంట్‌లో త‌న తెలుగు కెరీర్‌పై ఐశ్వ‌ర్య రాజేష్ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేసింది. తెలుగు అమ్మాయినే అయినా టాలీవుడ్‌లో త‌న‌కు పెద్ద‌గా అవ‌కాశాలు రాలేద‌ని అన్న‌ది.

N

Entertainment | Published On Jun 13, 2026, 5.19 pm IST

Aishwarya Rajesh | నేను తెలుగు అమ్మాయినే – అయినా ఎవ‌రూ అవ‌కాశాలు ఇవ్వ‌లేదు – ఐశ్వ‌ర్య రాజేష్ కామెంట్స్‌
Advertisement

Aishwarya Rajesh | "నేను అచ్చ తెలుగు అమ్మాయినే. కానీ చెన్నైలో పుట్టి పెరిగా. అమ్మ‌, నాన్న ఇద్ద‌రూ తెలుగువాళ్లే" అని ఐశ్వ‌ర్య రాజేష్ అన్న‌ది. ఈ కోలీవుడ్ బ్యూటీ హీరోయిన్‌గా న‌టించిన తెలుగు మూవీ ఓ సుకుమారి టీజ‌ర్ శ‌నివారం రిలీజైంది. తిరువీర్ హీరోగా న‌టిస్తోన్న ఈ మూవీకి భ‌ర‌త్ ద‌ర్శ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ టీజ‌ర్ లాంఛ్ ఈవెంట్‌లో త‌న కెరీర్‌పై ఐశ్వ‌ర్య రాజేష్ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేసింది.

హిట్టు లేద‌నే బాధ‌...

"తెలుగు అమ్మాయినే అయినా టాలీవుడ్‌లో ఓ మంచి హిట్టు లేద‌నే బాధ ఎప్పుడూ ఉండేది. మంచి ఆఫ‌ర్ల కోసం చాలా రోజులు ఎదురుచూశా. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని ప‌లు వేడుక‌ల్లో రిక్వెస్ట్ చేశా. చివ‌ర‌కు సంక్రాంతికి వ‌స్తున్నాంతో ఆ లోటు తీరింది. ఈ బ్లాక్‌బ‌స్ట‌ర్‌తో టాలీవుడ్‌లో బిజీ కావ‌డంత సంతోషంగా  అనిపిస్తోంది. ప్ర‌స్తుతం మూడు సినిమాలు రెండు వెబ్‌సిరీస్‌లు చేస్తున్నా. గ‌త రెండేళ్లు మొత్తం షూటింగ్‌ల‌తోనే గ‌డిచిపోయింది. నాగార్జున హీరోగా న‌టిస్తోన్న వందో మూవీలో ఓ హీరోయిన్‌గా క‌నిపించ‌బోతున్నా. ర‌మ్య‌కృష్ణ తో క‌లిసి చేసిన పాక‌శాల పంతం రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఓ సుకుమారితో పాటు మ‌రో ఓ రెండు వెబ్‌సిరీస్‌ల‌ను అంగీక‌రించా. ఇవ‌న్నీ ఈ ఏడాదే విడుద‌ల కానున్నాయి" అని ఐశ్వ‌ర్య రాజేష్ చెప్పింది.

రిజెక్ట్ చేశా....

ఓ సుకుమారి త‌న కెరీర్‌లో ఓ డిఫ‌రెంట్ మూవీగా నిలుస్తుంద‌ని ఐశ్వ‌ర్య రాజేష్అన్న‌ది. "నాకు తెలుగు రాద‌నుకొని డైరెక్ట‌ర్ త‌మిళంలో ఈ క‌థ చెప్పాడు. అత‌డికి త‌మిళ భాష స‌రిగ్గా రాక‌పోవ‌డంతో క‌థ విష‌యంలో క‌న్ఫ్యూజ్ అయ్యా. న‌చ్చ లేద‌ని, సినిమా చేయ‌న‌ని అన్నాను. ఆ త‌ర్వాత హైద‌రాబాద్‌లో ఓ షూటింగ్‌లో ఉండ‌గా నేరుగా క‌లిసి తెలుగులో క‌థ చెప్పాడు. అప్పుడు భ‌లేగా అనిపించింది. ఇంత మంచి క‌థ‌ను నేను ఎలా రిజెక్ట్ చేశానా అనిపించింద‌ని" ఐశ్వ‌ర్య రాజేష్  తెలిపింది. ముట్టుకుంటే క‌రెంట్ షాక్ వ‌చ్చే ఓ అమ్మాయి క‌థ‌తో ఓ సుకుమారి మూవీ తెర‌కెక్కుతున్న‌ట్లు ఐశ్వ‌ర్య రాజేష్ చెప్పింది.

Advertisement
Advertisement