త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Aafia Sayed | నితిన్ అలియాస్ రుక్మిణికి హీరోయిన్ దొరికిందోచ్ – బాలీవుడ్ బ్యూటీ బ్యాక్‌గ్రౌండ్ మామూలుగా లేదుగా!

నితిన్ హీరోగా నటిస్తోన్న అలియాస్ రుక్మిణి మూవీ డిసెంబ‌ర్ 4న థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. హీరో నాని ప్ర‌జెంట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ ఆఫియా సయ్యద్ న‌టిస్తున్న‌ట్లు మేక‌ర్స్ వెల్ల‌డించారు. ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఆఫియా సయ్యద్ బాలీవుడ్‌లో గ‌ట్టి బ్యాక్‌గ్రౌండ్ ఉంది. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూస‌ర్ సాజిద్ న‌డియాడ్‌వాలా మేన‌కోడ‌లు అవుతుంది.

N

Entertainment | Published On Oct 13, 2026, 8.23 pm IST

Aafia Sayed | నితిన్ అలియాస్ రుక్మిణికి హీరోయిన్ దొరికిందోచ్ – బాలీవుడ్ బ్యూటీ  బ్యాక్‌గ్రౌండ్ మామూలుగా లేదుగా!
Advertisement

Aafia Sayed | నితిన్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న అలియాస్ రుక్మిణి సినిమాకు హీరో నాని ప్ర‌జెంట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్నారు. రొమాంటిక్ కామెడీగా తెర‌కెక్కుతోన్న ఈ మూవీని నాని సోద‌రి దీప్తి ఘంటా నిర్మిస్తోంది. దండోరా ఫేమ్ ముర‌ళీకాంత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న అలియాస్ రుక్మిణి డిసెంబ‌ర్ 4న థియేట‌ర్ల‌లోకి రాబోతుంది.

వీడియో గ్లింప్స్ రిలీజ్‌...

షూటింగ్ మొద‌లై రెండు నెల‌లు అవుతోన్న ఈ సినిమాలో హీరోయిన్ ఎవ‌ర‌న్న‌ది మేక‌ర్స్ ఇప్ప‌టివ‌ర‌కు రివీల్ చేయ‌లేదు. ఎట్ట‌కేల‌కు ఈ స‌స్పెన్స్ వీడింది. అలియాస్ రుక్మిణిలో నితిన్ స‌ర‌స‌న‌ బాలీవుడ్ బ్యూటీ ఆఫియా సయ్యద్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ అప్‌డేట్‌ను రివీల్ చేస్తూ మేక‌ర్స్ మంగ‌ళ‌వారం ఓ స్పెష‌ల్ వీడియో గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఈ రుక్మిణి అనే స్కూల్ టీచర్‌గా ఆఫియా సయ్యద్ కనిపిస్తుంది. ఆమెకు విద్యార్థులు ‘డెవిల్’, ‘హిట్లర్’, ‘హోంవర్క్ పోలీస్’ వంటి పేర్లు పెడుతూ బోర్డ్‌పై రాస్తారు. వాటిని చూసి కోపంగా అదే బోర్డుపై తన పేరు రుక్మిణి అని రాస్తూ, ఆ తర్వాత విద్యార్థుల వైపు ఇంటెన్స్ గా ఆఫియా సయ్యద్ చూడ‌టం ఈ గ్లింప్స్‌లో ఆక‌ట్టుకుంటోంది. ఈ గ్లింప్స్ చూస్తుంటే అందం, అహంకారం క‌ల‌గ‌లిసిన అమ్మాయిగా ఆఫియా సయ్యద్ ఈ సినిమాలో క‌నిపించ‌బోతున్న‌ట్లు క‌నిపిస్తోంది.

ప్రేమలు రీమేక్...

అలియాస్ రుక్మిణితోనే ఆఫియా సయ్యద్ హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. బాలీవుడ్‌లో ప్రేమ కీటాను పేరుతో ఓ సినిమా చేసింది. మ‌మితాబైజు సూప‌ర్ హిట్ మూవీ ప్రేమ‌లుకు రీమేక్‌గా తెర‌కెక్కిన ఈ సినిమా బాలీవుడ్‌లో డిజాస్ట‌ర్‌గా నిలిచింది.

స్టార్ ప్రొడ్యూస‌ర్‌...

ఆఫియా సయ్యద్ బాలీవుడ్‌లో గ‌ట్టి బ్యాక్‌గ్రౌండ్ ఉంది. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూస‌ర్ సాజిద్ న‌డియాడ్‌వాలా మేన‌కోడ‌లే ఆఫియా సయ్యద్ . ఆమె త‌ల్లి కూడా నిర్మాతే. ట్రిపుల్ ఏస్ అనే బ్యాన‌ర్‌పై ఆఫియా సయ్యద్ త‌ల్లి ఆఫీఫా న‌డియాడ్‌వాలా కొన్ని మ‌రాఠీతో పాటు బాలీవుడ్ సినిమాల‌ను ప్రొడ్యూస్ చేశారు. ఆఫియా సయ్యద్ తండ్రితో పాటు తాత కూడా నిర్మాత‌లుగా సినిమాలు చేశారు.

Advertisement
Advertisement