త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vijay Rashmika | పెళ్లి త‌ర్వాత సినిమాల‌తో బిజీ – నెక్స్ట్ వీక్ నుంచి ర‌ణ‌బాలి షూటింగ్‌లో విజ‌య్‌, ర‌ష్మిక‌?

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న పెళ్లి వేడుక‌లు బుధ‌వారం జ‌రిగిన రిసెప్ష‌న్ వేడుక‌ల‌తో ముగిశాయి. నెక్స్ట్ వీక్ నుంచి తిరిగి విరోష్ జోడీ సినిమా షూటింగ్‌ల‌ను మొద‌లుపెట్ట‌బోతున్నార‌ట‌.

N

Entertainment | Published On Mar 5, 2026, 1.16 pm IST

Vijay Rashmika | పెళ్లి త‌ర్వాత సినిమాల‌తో బిజీ – నెక్స్ట్ వీక్ నుంచి ర‌ణ‌బాలి షూటింగ్‌లో విజ‌య్‌, ర‌ష్మిక‌?
Advertisement

Vijay Rashmika  ఇటీవ‌లే పెళ్లితో కొత్త జీవితాన్ని మొద‌లుపెట్టారు విజ‌య్ దేవ‌ర‌కొండ, ర‌ష్మిక మంద‌న్న‌. ఫిబ్ర‌వ‌రి 26న ఉద‌య్‌పూర్‌లో విజ‌య్‌, ర‌ష్మిక పెళ్లి గ్రాండ్‌గా జ‌రిగింది. పెళ్లి త‌ర్వాత స‌త్య‌నారాయ‌ణ స్వామి వ్ర‌తం, రిసెప్షెన్ వేడుక‌ల‌ను జ‌రుపుకున్నారు. బుధ‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగిన విరోష్ రిసెప్ష‌న్‌కు టాలీవుడ్‌, బాలీవుడ్ తారాలోకం మొత్తం త‌ర‌లివ‌చ్చింది.

ఫారిన్ వెకేష‌న్‌...

రిసెప్ష‌న్‌తో పెళ్లి సెల్ర‌బేష‌న్స్ ముగిశాయ‌ని, తాము అండ‌ర్‌గ్రౌండ్‌కు వెళ్ల‌బోతున్నామ‌ని విజ‌య్‌, ర‌ష్మిక ప్ర‌క‌టించారు. నాలుగైదు రోజులు ఈ జంట ఫారిన్‌కు వెకేష‌న్‌కు వెళ్ల‌నున్న‌ట్లు టాక్ వినిపిస్తోంది. నెక్స్ట్ వీక్ నుంచి తిరిగి సినిమా షూటింగ్‌ల‌తో విజ‌య్‌, ర‌ష్మిక బిజీ కానున్న‌ట్లు స‌మాచారం.

ర‌ణ‌బాలితో...

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న క‌లిసి ప్ర‌స్తుతం ర‌ణ‌బాలి మూవీ చేస్తున్నారు. హిస్టారిక‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ మూవీకి రాహుల్ సాంకృత్యాన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. పెళ్లి కార‌ణంగా కొద్ది రోజులు ఈ సినిమా షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చారు విరోష్ జోడి. ర‌ణ‌బాలి మూవీ షూటింగ్ మార్చి 9 నుంచి తిరిగి మొద‌లుకాబోతుంద‌ట‌. మార్చి 12 నుంచి విజ‌య్ దేవ‌ర‌కొండతో ర‌ష్మిక మంద‌న్న ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొన‌నున్న‌ట్లు చెబుతోన్నారు. క‌ర్నూల్‌లో జ‌రుగ‌నున్న ఈ లేటెస్ట్ షెడ్యూల్‌లో విజ‌య్‌, ర‌ష్మిక‌ కాంబినేష‌న్‌లో కొన్ని కీల‌క స‌న్నివేశాల‌ను ద‌ర్శ‌కుడు చిత్రీక‌రించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. మార్చి లాస్ట్ వీక్ నుంచి మైసా సెట్స్‌లోనూ ర‌ష్మిక అడుగుపెట్ట‌నున్న‌ట్లు చెబుతోన్నారు. మ‌రోవైపు విజ‌య్ కూడా ర‌ణ‌బాలితో పాటు రౌడీ జ‌నార్ధ‌న కోసం బ్యాక్ టూ బ్యాక్ డేట్స్ కేటాయించాడ‌ట‌. పెళ్లి త‌ర్వాత వీరిద్ద‌రు బిజీ కానున్న‌ట్లు టాలీవుడ్ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది.

క్రేజ్ డ‌బుల్‌...

పెళ్లితో విజ‌య్‌, ర‌ష్మిక క్రేజ్ రెట్టింపు అయ్యింది. గ‌త ప‌ది, ప‌దిహేను రోజులుగా విరోష్ పేరు ట్రెండింగ్‌లో ఉంది. ఈ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని విజ‌య్, ర‌ష్మిక కొన్ని బ్రాండ్ ఎండార్స్‌మెంట్ , యాడ్స్‌కు ఓకే చెప్పిన‌ట్లు స‌మాచారం. ఈ సినిమా షూటింగ్‌ల‌తో పాటు వీరిద్ద‌రు క‌లిసి కొన్ని యాడ్స్‌లోనూ న‌టించ‌బోతున్న‌ట్లు చెబుతున్నారు.

Advertisement
Advertisement