త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

spirit first look | యానిమ‌ల్, పుష్ప మిక్స్‌డ్‌లా ఉంది?…మ‌రో అర్జున్ రెడ్డి – ప్ర‌భాస్ స్పిరిట్‌ ఫ‌స్ట్ లుక్‌పై ట్రోల్స్‌

న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా ప్ర‌భాస్ స్పిరిట్ ఫ‌స్ట్ లుక్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. ఈ ఫ‌స్ట్ లుక్‌పై అభిమానుల ప్ర‌శంస‌ల‌తో పాటు ట్రోల్స్ కూడా బాగానే వ‌స్తున్నాయి. యానిమ‌ల్‌, పుష్ప సినిమాల నుంచి ఇన్‌స్పైర్ అయ్యి సందీప్ వంగా ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్న‌ట్లుగా ఉంద‌ని నెటిజ‌న్లు కొంద‌రు కామెంట్స్ పెడుతున్నారు.

N

Entertainment | Published On Jan 1, 2026, 2.31 pm IST

spirit first look | యానిమ‌ల్, పుష్ప మిక్స్‌డ్‌లా ఉంది?…మ‌రో అర్జున్ రెడ్డి – ప్ర‌భాస్ స్పిరిట్‌ ఫ‌స్ట్ లుక్‌పై ట్రోల్స్‌
Advertisement

spirit first look | ప్ర‌భాస్ స్పిరిట్ ఫ‌స్ట్ లుక్‌పై ప్ర‌శంస‌ల‌తో విమ‌ర్శ‌లు ఓ రేంజ్‌లో వ‌స్తున్నాయి. న్యూ ఇయ‌ర్ రోజు స్పిరిట్ ఫ‌స్ట్ లుక్‌ను రిలీజ్ చేసి ప్ర‌భాస్‌ అభిమానుల‌ను స‌ర్‌ప్రైజ్ చేశారు డైరెక్ట‌ర్ సందీప్ వంగా. ఈ పోస్ట‌ర్‌లో గ‌త సినిమాల‌కు భిన్నంగా డిఫ‌రెంట్ లుక్‌లో ప్ర‌భాస్ క‌నిపించారు. ఒళ్లంతా దెబ్బ‌ల‌తో క‌మిలిపోయి ఉండ‌గా...కొన్ని గాయాల‌కు బ్యాండేజ్‌లు చుట్టుకొని ప్ర‌భాస్ ఉన్నారు.  ఓ చేతిలో మందు గ్లాస్ ప‌ట్టుకొని లాంగ్ హెయిర్‌స్టైల్‌తో క‌ళ్లద్దాలు పెట్టుకొని ఇంటెన్స్ లుక్‌లో ప్ర‌భాస్‌ ఉండ‌టం ఆస‌క్తిని పంచుతోంది. ప్ర‌భాస్ నోటిలో ఉన్న సిగ‌రెట్‌ను లైట‌ర్‌తో వెలిగిస్తూ ఈ పోస్ట‌ర్‌లో హీరోయిన్‌ను త్రిప్తి డిమ్రి క‌నిపిస్తోంది.ఇండియ‌న్ సినిమా... ఇదిగో మీ ఆజానుబాహుడు... అంటూ ఈ ఫ‌స్ట్ లుక్‌కు క్యాప్ష‌న్ ఇచ్చారు సందీప్ వంగా.

యారోగెంట్ ఆటిట్యూడ్‌...

సందీప్ వంగా సినిమాల్లో హీరోలు రెబెల్ ఆటిట్యూడ్‌తో చాలా యారోగెంట్‌గా క‌నిపిస్తుంటారు. ఫ‌స్ట్ లుక్ చూస్తుంటే స్పిరిట్‌లో ప్ర‌భాస్ క్యారెక్ట‌ర్ అలాగే ఉండ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. స్పిరిట్ పోస్ట‌ర్ ప్ర‌స్తుతం ట్రెండింగ్‌లో ఉంది.స్పిరిట్ మూవీలో ప్ర‌భాస్ ప‌వ‌ర్‌ఫుల్‌ పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌బోతున్న‌ట్లు ఇటీవ‌ల రిలీజ్ చేసిన ఆడియో టీజ‌ర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు సందీప్ వంగా. ధిక్కార స్వ‌భావం క‌లిగిన ర‌గ్గ్‌డ్ పోలీస్‌గా ప్ర‌భాస్ క్యారెక్ట‌రైజేష‌న్ అభిమానుల ఊహ‌ల‌కు మించి ఉండ‌బోతున్న‌ట్లు టాక్‌. స్పిరిట్‌లో ప్ర‌భాస్ పాత్ర మూడు డిఫ‌రెంట్ షేడ్స్‌లో సాగుతుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ పాన్ ఇండియ‌న్ మూవీలో ప్ర‌కాష్ రాజ్‌, వివేక్ ఒబెరాయ్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు.స్పిరిట్ మూవీని ఎనిమిది భాష‌ల్లో రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు ఫ‌స్ట్ లుక్ ద్వారా మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ఇండియ‌న్ లాంగ్వేజెస్‌తో పాటు మాండ‌రిన్‌, కొరియ‌న్‌, జ‌ప‌నీస్ భాష‌ల్లో విడుద‌ల చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు.

ఫ‌స్ట్ లుక్‌పై విమ‌ర్శ‌లు...

స్పిరిట్ ఫ‌స్ట్ లుక్‌పై విమ‌ర్శ‌లు ఓ రేంజ్‌లో వ‌స్తున్నాయి. యానిమ‌ల్‌, పుష్ప సినిమాల నుంచి స్ఫూర్తి పొంది సందీప్ వంగా స్పిరిట్‌ను తీస్తున్న‌ట్లుగా క‌నిపిస్తోంద‌ని ఓ నెటిజ‌న్ కామెంట్ చేశాడు. చాలా మంది నెటిజ‌న్లు యానిమ‌ల్ ఫ‌స్ట్ లుక్‌తో కంపేర్ చేస్తున్నారు. అందులో ర‌ణ‌భీర్‌క‌పూర్ ఒళ్లంతా గాయాల‌తో క‌నిపిస్తారు. రెండు పోస్ట‌ర్‌లు ఒకేలా ఉన్నాయ‌ని అంటున్నారు. అర్జున్ రెడ్డి, యానిమ‌ల్ ఛాయ‌ల‌తోనే ఈ సినిమా ఉంటుంద‌ని ట్వీట్స్ చేస్తున్నారు. ఈ ట్వీట్స్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజావార్తలు

Advertisement