త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kiara Advani | కియారా అద్వానీ మ‌తం మారిందా? – బాలీవుడ్ బ్యూటీని చిక్కుల్లో ప‌డేసిన లాకెట్‌

బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ మ‌తం గురించి సోష‌ల్ మీడియాలో తెగ డిస్క‌ష‌న్ న‌డుస్తోంది. ఇటీవ‌ల జ‌రిగిన ఓ అవార్డ్ ఈవెంట్‌కు శిలువ ఆకారంతో కూడిన లాకెట్ ధ‌రించి కియారా అటెండ్ కావ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. కియారా మ‌తం మారిందంటూ నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు.

N

Entertainment | Published On Apr 25, 2026, 12.34 pm IST

Kiara Advani | కియారా అద్వానీ మ‌తం మారిందా?  – బాలీవుడ్ బ్యూటీని చిక్కుల్లో ప‌డేసిన లాకెట్‌
Advertisement

Kiara Advani | బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీని నెటిజ‌న్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. ఈ హీరోయిన్ మ‌తం గురించి సోష‌ల్ మీడియాలో తెగ డిస్క‌ష‌న్ న‌డుస్తోంది. ఓ ఫ్యాష‌న్ ఈవెంట్‌లో కియారా ధ‌రించిన ఓ చిన్న ముత్యాల హారం ఆమెను చిక్కుల్లో ప‌డేసింది. ఈ హారం కార‌ణంగానే విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొంటోంది.

అవార్డ్ ఈవెంట్‌...

బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా కొన‌సాగుతోంది కియారా అద్వానీ. ఫ్యాష‌న్స్ విష‌యంలో మిగిలిన హీరోయిన్ల కంటే ఓ అడుగు ముందే ఉంటుంది. లేటెస్ట్ ట్రెండ్స్‌ను ఫాలో అవుతుంటుంది. తాజాగా కియారా అద్వానీ ఇటీవ‌ల ముంబైలో జ‌రిగిన జీక్యూ మోస్ట్ ఇన్‌ఫ్లూయెన్షియ‌ల్ యంగ్ ఇండియ‌న్స్ అవార్డు వేడుక‌లో పాల్గొన్న‌ది. బ్లాక్ లెద‌ర్ డ్రెస్ ధ‌రించిన కియారా ఈ ఈవెంట్‌కు స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచింది. డ్రెస్‌కు త‌గ్గ‌ట్లుగా మెడ‌లో ముత్యాల హారంతో పాటు కొన్ని మ‌రో రెండు చైన్స్ ధ‌రించింది. అయితే ముత్యాల హారానికి శిలువ ఆకారంతో కూడిన‌ లాకెట్‌ ధ‌రించ‌డం విమ‌ర్శ‌ల‌కు కార‌ణ‌మైంది. క్రాస్ పెండెంట్ ఎక్కువ‌గా క్రిస్టియ‌న్స్ ధ‌రిస్తారు. హిందూ మ‌తానికి చెందిన కియారా మెడ‌లో శిలువ లాకెట్‌తో ఈవెంట్‌కు రావ‌డం చ‌ర్చ‌కు దారితీసింది.

మ‌తం మారిందా?

కియారా అద్వానీతో పాటు ఆమె త‌ల్లిదండ్రులు కూడా హిందూ మ‌తాన్నే అనుస‌రిస్తుంటార‌ని నెటిజ‌న్లు చెబుతున్నారు. కియారా, సిద్ధార్థ్ మ‌ల్హోత్రా పెళ్లి కూడా హిందూ సంప్ర‌దాయం ప్ర‌కార‌మే జ‌రిగింద‌ని అంటున్నారు. కియారా శిలువ లాకెట్ ఎందుకు ధ‌రించింది అన్న‌ది హాట్ టాపిక్‌గా మారింది. ఈ లాకెట్ మెడ‌లో వేసుకొని హిందూ సంప్ర‌దాయాల‌ను కియారా కించ‌ప‌రిచింద‌ని అంటున్నారు. మ‌రికొంద‌రు నెటిజ‌న్లు మాత్రం ఈ బాలీవుడ్ హీరోయిన్ మ‌తం మారి ఉండొచ్చ‌ని ట్వీట్స్ చేస్తున్నారు.

లింక్ చేయ‌ద్దు...

కియారా ఫ్యాన్స్ మాత్రం ఆమెను స‌పోర్ట్ చేస్తున్నారు. కొన్ని ఇంట‌ర్నేష‌న‌ల్ బ్రాండ్స్ స్టైలిష్ లుక్ కోసం ఇలాంటి లాకెట్స్ వాడుతుంటార‌ని, వాటిని మ‌తంతో లింక్ చేయ‌డం స‌రికాదంటూ కామెంట్లు పెడుతున్నారు.
ప్ర‌స్తుతం య‌శ్ టాక్సిక్‌లో కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తోంది. గ్యాంగ్‌స్ట‌ర్ యాక్ష‌న్ మూవీతోనే క‌న్న‌డంలోకి ఎంట్రీ ఇవ్వ‌బోతుంది. ఈ సినిమాలో కియారా అద్వానీతో పాటు న‌య‌న‌తార‌, రుక్మిణి వ‌సంత్‌, తారా సుతారియా, హ్యుమా ఖురేషి హీరోయిన్లుగా క‌నిపించ‌బోతున్నారు.

 

Advertisement
Advertisement