TG Weather | బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం.. తెలంగాణకు రెడ్ అలెర్ట్..!
TG Weather | తెలంగాణలో రాగల నాలుగురోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర వాయుగుండం గడిచిన మూడుగంటల్లో గంటకు 20 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ.. ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉందని తెలిపింది.
TG Weather | తెలంగాణలో రాగల నాలుగురోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర వాయుగుండం గడిచిన మూడుగంటల్లో గంటకు 20 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ.. ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉందని తెలిపింది. చెన్నైకి తూర్పు-ఆగ్నేయంగా 630, విశాఖపట్నానికి 710 కిలోమీటర్ల దూరంలో ఉందని పేర్కొంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సగటున సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని తెలిపింది. రాబోయే ఆరుగంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ నైరుతి, దాన్ని ఆనుకొని ఉన్న పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో తుపానుగా.. సోమవారం తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని తెలిపింది. ఇది పశ్చిమ వాయువ్య దిశలో వెళ్తూ మంగళవారం ఉదయం నాటికి నెల్లూరు-నర్సాపూర్ మధ్య గంటకు 100-120 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తూ తీరం దాటే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ వివరించింది.
ఈ క్రమంలో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఆదివారం ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. సోమవారం ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది ఐఎండీ. అలాగే, జనగాం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. నల్గొండ, సూర్యాపేట, వనపర్తి, వరంగల్, హన్మకొండ, వికారాబాద్, జనగాం, సంగారెడ్డి, మెదక్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశాలున్నాయని వివరించింది.
మంగళవారం ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. ఈ క్రమంలో మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణశాఖ. ఇక భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అతిభారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని చెప్పింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, జనగాం, సిద్దిపేట, భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడుతాయని చెప్పింది. మరికొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ వానలు పడే అవకాశం ఉందని చెప్పింది. బుధవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Rc 17 Movie | గ్రాండ్‌గా రామ్‌చరణ్, సుకుమార్ మూవీ లాంఛ్ - స్పెషల్ అట్రాక్షన్‌గా మెగాస్టార్
- ●November Weather | నవంబర్‌లో భానుడి భగభగలే
- ●Gajakesari Raja Yoga | నవంబర్ 3న గజకేసరి రాజయోగం.. ఈ 3 రాశులకు ఆర్థికంగా అన్నీ లాభాలే..!
- ●Rakul Preet Singh | గ్యాప్ ఇవ్వలేదు...వచ్చింది - టాలీవుడ్‌కు దూరం కావడంపై రకుల్ కామెంట్స్
- ●Nitin Nabin | కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది
- ●INDIA Bloc Ramlila Maidan Rally | ఢిల్లీలో దద్దరిల్లిన రాంలీలా మైదాన్.. మోదీపై ఇండియా కూటమి వార్!

Rc 17 Movie | గ్రాండ్‌గా రామ్‌చరణ్, సుకుమార్ మూవీ లాంఛ్ - స్పెషల్ అట్రాక్షన్‌గా మెగాస్టార్

November Weather | నవంబర్‌లో భానుడి భగభగలే

Gajakesari Raja Yoga | నవంబర్ 3న గజకేసరి రాజయోగం.. ఈ 3 రాశులకు ఆర్థికంగా అన్నీ లాభాలే..!

Rakul Preet Singh | గ్యాప్ ఇవ్వలేదు...వచ్చింది - టాలీవుడ్‌కు దూరం కావడంపై రకుల్ కామెంట్స్



