త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Suriya | మ‌ల‌యాళ హీరోయిన్‌తో సూర్య రొమాన్స్ – జ్యోతిక ప్రొడ్యూస‌ర్‌గా కొత్త మూవీ లాంఛ్‌

Suriya |కోలీవుడ్ (Kollywood) టాప్ స్టార్ సూర్య (Suriya) హీరోగా న‌టిస్తున్న కొత్త మూవీ ఆదివారం లాంఛ్ అయ్యింది. జీతూ మాధ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీలో న‌జ్రియా న‌జీమ్(Nazriya Nazim) హీరోయిన్‌గా క‌నిపించ‌బోతుంది.

N

Entertainment | Published On Dec 7, 2025, 8.49 pm IST

Suriya | మ‌ల‌యాళ హీరోయిన్‌తో సూర్య రొమాన్స్ – జ్యోతిక ప్రొడ్యూస‌ర్‌గా కొత్త మూవీ లాంఛ్‌

సూర్య, నజ్రియా నజీమ్ మూవీ లాంఛ్

Advertisement

Suriya: ఏడాది, రెండేళ్ల‌కు ఓ సినిమా  చేయాల‌నే రూల్‌ను ఫాలో అవుతున్నారు ద‌క్షిణాది స్టార్ హీరోలు(South Heroes). మ‌రికొంద‌రు క‌థానాయ‌కులైతే నాలుగైదేళ్ల‌కు ఓ సినిమా చేస్తున్నారు. పాన్ ఇండియ‌న్ సినిమా పేర్ల‌తో ఏళ్ల‌కు ఏళ్లు షూటింగ్‌ల‌కే టైమ్ తీసుకోవ‌డంపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. కోలీవుడ్ అగ్ర హీరో సూర్య (Suriya)కూడా ఇన్నాళ్లుగా ఏడాదికి ఓ సినిమా చేస్తూ వ‌చ్చాడు. తాజాగా త‌న పంథా మార్చేసిన సూర్య స్పీడును పెంచేశాడు. ప్ర‌స్తుతం రెండు సినిమాలు సెట్స్‌పై ఉండ‌గానే తాజాగా మ‌రో కొత్త మూవీ మొద‌లుపెట్టాడు.
సూర్య హీరోగా జీతూ మాధ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న లేటేస్ట్ సినిమా ఆదివారం లాంఛ్ అయ్యింది. పోలీస్ క‌థాంశంతో యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కుతోన్న ఈ మూవీలో సూర్య‌కు జోడీగా మ‌ల‌యాళ హీరోయిన్ న‌జ్రియా న‌జీమ్(Nazriya Nazim) హీరోయిన్‌గా క‌నిపించ‌బోతున్న‌ది. ప్రేమ‌లు ఫేమ్ న‌స్లీన్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు.
ఆదివారం లాంఛింగ్ ఈవెంట్‌లో సూర్య, న‌జ్రియా న‌జీమ్‌తో పాటు న‌స్లీన్ కూడా పాల్గొన్నాడు. లాంఛింగ్‌ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.
సూర్య హీరోగా న‌టిస్తున్న 47వ మూవీ ఇది. ఈ సినిమాకు సూర్య‌, ఆయ‌న భార్య జ్యోతిక‌తో పాటు కార్తీ ప్రొడ్యూస‌ర్లుగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌టం గ‌మ‌నార్హం. ఇంద‌లో సూర్య పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌బోతున్న‌ట్లు టాక్ వినిపిస్తుంది. త‌మిళంతో పాటు తెలుగు, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో రిలీజ్ కాబోతుంది.
సూర్య మూవీతో దాదాపు 11 ఏళ్ల గ్యాప్ త‌ర్వాత న‌జ్రియా న‌జీమ్ కోలీవుడ్‌లోకి(Kollywood) రీఎంట్రీ ఇవ్వ‌బోతుంది. చివ‌ర‌గా 2014లో తిరుమాన‌మ్ ఎనుమ్ నిఖా అనే సినిమా చేసింది న‌జ్రియా.
కాగా ప్ర‌స్తుతం సూర్య హీరోగా న‌టించిన క‌రుప్పు మూవీ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఆర్‌జే బాలాజీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీలో త్రిష హీరోయిన్‌గా న‌టించింది. జ‌న‌వ‌రి నెలాఖ‌రున క‌రుప్పు ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ట్లు స‌మాచారం.
టాలీవుడ్ డైరెక్ట‌ర్ వెంకీ అట్లూరితో సూర్య ఓ బైలింగ్వ‌ల్ మూవీ చేస్తున్నాడు. ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ ద‌శ‌లో ఉంది. మ‌మితా బైజు హీరోయిన్‌గా న‌టించిన ఈ సినిమాలో ర‌వీనా టాండ‌న్‌, రాధిక శ‌ర‌త్‌కుమార్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది.

Advertisement

తాజావార్తలు

Advertisement