త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nani The Paradise movie | నాని ‘ది ప్యారడైజ్’ ప్రీమియర్ కోరిక.. సీఎం రేవంత్ రెడ్డి, డీజీపీ ఏమన్నారంటే?

ఆర్టీసీ క్రాస్ రోడ్స్ థియేటర్‌లో 'ది ప్యారడైజ్' ప్రీమియర్‌కు అనుమతి కోరిన హీరో నాని. సీఎం రేవంత్ రెడ్డి, డీజీపీ స్పందన ఇదే.

J

Movies | Published On Sep 23, 2026, 2.36 pm IST

Nani The Paradise movie | నాని ‘ది ప్యారడైజ్’ ప్రీమియర్ కోరిక.. సీఎం రేవంత్ రెడ్డి, డీజీపీ ఏమన్నారంటే?

సంక్షిప్త సారాంశం

ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో తన తాజా చిత్రం 'ది ప్యారడైజ్' ప్రీమియర్ షోను అభిమానులతో కలిసి చూడాలని హీరో నాని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. భద్రతా మార్గదర్శకాలను పాటిస్తూ స్థానిక పోలీస్ స్టేషన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. వినాయక నిమజ్జనం, రద్దీ కారణంగా భద్రతా పరమైన ఇబ్బందులు ఉంటాయని డీజీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు.

Advertisement

Nani The Paradise movie | టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా సినిమా 'ది ప్యారడైజ్' (The Paradise). శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. అయితే ఈ సినిమా ప్రీమియర్ షోను హైదరాబాద్‌లోని ప్రముఖ థియేటర్ అయిన ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో అభిమానులతో కలిసి చూడాలని నాని కోరుకుంటున్నారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ప్రత్యేకంగా అభ్యర్థించారు.

నాని ట్వీట్ వైరల్

సినిమాను ప్రజల మధ్య కూర్చుని చూస్తూ వారి స్పందనను గమనించడమే అసలైన సంతృప్తి అని నాని పేర్కొన్నారు. భద్రతా మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటిస్తామని, కనుక ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ప్రీమియర్ షోకు అనుమతి ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, తెలంగాణ పోలీసులను కోరుతూ నాని ఎక్స్ లో ట్వీట్ చేశారు.

స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి

నాని అభ్యర్థనకు సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. "యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై మీ నిబద్ధత, సేఫ్టీ గైడ్‌లైన్స్ పట్ల మీ గౌరవం అభినందనీయం" అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అయితే, క్రౌడ్ మేనేజ్‌మెంట్, ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని సంబంధిత స్థానిక పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా దరఖాస్తు చేసుకోవాలని, దానిని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని ఆయన సూచించారు.

డీజీపీ సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు

ఈ వ్యవహారంపై తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ కూడా స్పందిస్తూ కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుచేశారు. ప్రస్తుతం గణేష్ నిమజ్జనోత్సవాలు జోరుగా సాగుతున్నాయని, ముఖ్యంగా హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలతో పాటు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ప్రాంతం కూడా జనావాసంతో, వాహనాలతో రద్దీగా ఉంటుందని తెలిపారు.

రెండు సంవత్సరాల క్రితం జరిగిన తొక్కిసలాట ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోవడం, మరో చిన్నారి శాశ్వత అంగవైకల్యానికి గురికావడాన్ని డీజీపీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. భద్రతా సిబ్బందిని మోహరించడం, పరిస్థితులను మేనేజ్ చేయడం సాధ్యపడుతుందో లేదో హైదరాబాద్ సిటీ పోలీసులతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. మరి నాని కోరుకున్నట్లు ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ప్రీమియర్ షో జరుగుతుందా లేదా అనేది వేచి చూడాలి.

సినిమా ప్రీమియర్లు, పబ్లిక్ ఈవెంట్లకు సంబంధించి భద్రతా నిబంధనలు కఠినంగా ఉన్నందున.. పోలీసులు, ప్రభుత్వ అధికారుల తుది నిర్ణయంపైనే ఈవెంట్ అనుమతులు ఆధారపడి ఉంటాయి.

Advertisement
Advertisement