త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nani Paradise | తెలంగాణ‌లో నాని ప్యార‌డైజ్ టికెట్ ధ‌ర‌ల పెంపు – బెనిఫిట్ షోకు అనుమ‌తి

నాని ప్యార‌డైజ్ సినిమాకు తెలంగాణలో టికెట్ ధ‌ర‌లు పెంచుకునేందుకు ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది.బెనిఫిట్ షోకు ప‌ర్మిష‌న్ ఇస్తూ స్పెష‌ల్ జీవోను జారీ చేసింది. రిలీజ్ రోజు నుంచి మొత్తం ప‌ది రోజుల పాటు ధ‌ర‌ల పెంపు అమ‌లులో ఉంటుంద‌ని జీవోలో పేర్కొన్నారు.

N

Entertainment | Published On Sep 20, 2026, 7.40 pm IST

Nani Paradise | తెలంగాణ‌లో నాని ప్యార‌డైజ్ టికెట్ ధ‌ర‌ల పెంపు – బెనిఫిట్ షోకు అనుమ‌తి
Advertisement

Nani Paradise | నాని ప్యార‌డైజ్ సినిమాకు తెలంగాణ‌లో టికెట్ ధ‌ర‌ల పెంచుకునేందుకు ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది. బెనిఫిట్ షోకు ప‌ర్మిష‌న్ ఇచ్చింది. సెప్టెంబ‌ర్ 24 నుంచి 27వ తేదీ వ‌ర‌కు సింగిల్ స్క్రీన్స్‌లో జీఎస్‌స్టీతో క‌లుపుకొని 48 రూపాయ‌లు, మ‌ల్టీప్లెక్స్‌లో 94 రూపాయ‌లు పెంచుకునే వెసులుబాటు క‌ల్పించారు. సెప్టెంబ‌ర్ 28వ తేదీ నుంచి అక్టోబ‌ర్ 3 వ‌ర‌కు సింగిల్ స్క్రీన్స్‌లో 23 రూపాయ‌లు, మ‌ల్టీప్లెక్స్‌లో 45 రూపాయ‌లు పెంచుకునేందుకు ప‌ర్మిష‌న్ ఇచ్చారు . ఈ టికెట్ ధ‌ర‌ల పెంపు రిలీజ్ రోజు నుంచి మొత్తం ప‌ది రోజుల వ‌ర‌కు అమ‌లులో ఉంటుంద‌ని జీవోలో ప్ర‌భుత్వం పేర్కొన్న‌ది.

బెనిషిట్ షోకు అనుమ‌తి....

టికెట్ ధ‌ర‌ల పెంపుతో పాటు ప్యార‌డైజ్‌ స్పెష‌ల్ ప్రీమియ‌ర్‌కు తెలంగాణ ప్ర‌భుత్వం ప‌ర్మిష‌న్ ఇచ్చింది. సెప్టెంబ‌ర్ 23వ తేదీన సాయంత్రం 6.30 గంట‌ల‌కు ఈ స్పెష‌ల్ షోను స్క్రీనింగ్ చేసుకోవ‌చ్చ‌ని ప్ర‌క‌టించింది. ఈ బెనిషిట్ షో టికెట్ ధ‌ర‌ను ఐదు వంద‌లుగా నిర్ణ‌యించారు. ఈ ధ‌ర‌ల పెంపుకు అనుమ‌తి ఇచ్చినందుకు తెలంగాణ ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడ‌రేష‌న్‌కు ప్యార‌డైజ్ నిర్మాత‌లు కోటి విరాళంగా అంద‌జేశారు.

స్పెష‌ల్ సాంగ్‌...

ప్యార‌డైజ్ మూవీలో నాని, క‌యదు లోహ‌ర్ హీరోహీరోయిన్లుగా న‌టించారు. కీర్తి సురేష్ స్పెష‌ల్ సాంగ్‌లో క‌నిపించింది. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ భాష‌ల్లో ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.

 

Advertisement
Advertisement