త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mysaa Teaser | ఆయుధం ఏ యుద్ధానికి భ‌య‌ప‌డ‌దు – ర‌ష్మిక మంద‌న్న మైసా టీజ‌ర్ రిలీజ్‌

ర‌ష్మిక మంద‌న్న మైసా టీజ‌ర్ ఆదివారం రిలీజైంది. ఈ టీజ‌ర్‌లో ర‌ష్మిక లుక్‌, ఆమెపై వ‌చ్చిన యాక్ష‌న్ సీక్వెన్స్‌లు ఆక‌ట్టుకుంటున్నాయి. ర‌వీంద్ర పుల్లే ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీ న‌వంబ‌ర్ 27న రిలీజ్ కాబోతుంది.

N

Entertainment | Published On Sep 20, 2026, 7.52 pm IST

Mysaa Teaser | ఆయుధం ఏ యుద్ధానికి భ‌య‌ప‌డ‌దు – ర‌ష్మిక మంద‌న్న మైసా టీజ‌ర్ రిలీజ్‌
Advertisement

Mysaa Teaser |  ది గ‌ర్ల్‌ఫ్రెండ్ త‌ర్వాత నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తున్న లేడీ ఓరియెంటెడ్ మూవీ మైసా. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు ర‌వీంద్ర పుల్లే ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. న‌వంబ‌ర్ 27న మైసా థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. ఈ సినిమా టీజ‌ర్‌ను ఆదివారం రిలీజ్ చేశారు. యాక్ష‌న్ అంశాల‌తో టీజ‌ర్ ఆస‌క్తిక‌రంగా సాగింది. ర‌ష్మిక లుక్‌, ఆమెపై వ‌చ్చిన యాక్ష‌న్ సీక్వెన్స్‌లు ఈ టీజ‌ర్‌కు హైలైట్‌గా నిలిచాయి. గ‌త సినిమాల‌కు పూర్తి భిన్నంగా ఈ టీజ‌ర్‌లో ర‌ష్మిక క‌నిపించింది. యుద్దానికి ఆయుధం అంటే భ‌యం కానీ...ఆయుధం ఏ యుద్ధానికి భ‌య‌ప‌డ‌దు అంటూ టీజ‌ర్‌లోని డైలాగ్స్ ఆక‌ట్టుకుంటున్నాయి. మైసా మూవీలో రావుర‌మేష్‌, గురు సోమ‌సుంద‌రం, తార‌క్ పొన్న‌ప్ప కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. మైసా మూవీలో ర‌ష్మిక గోండు జాతికి చెందిన యువ‌తిగా క‌నిపించ‌బోతుంది.

Advertisement
Advertisement