త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mrunal Thakur | బ్లడీ రోమియో డబుల్ ధమాకా – ఇద్దరు హీరోయిన్లతో నాచుర‌ల్ స్టార్‌ రొమాన్స్!

నాని, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా న‌టించిన హాయ్ నాన్న మంచి ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెలుగు ఆడియెన్స్‌ను మెప్పించింది. ఈ బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత నాని, మృణాల్ ఠాకూర్ కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా రాబోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో నాని హీరోగా న‌టిస్తోన్న బ్ల‌డీ రోమియోలో పూజా హెగ్డేతో పాటు మృణాల్ ఠాకూర్ హీరోయిన్లుగా న‌టిస్తోన్న‌ట్లు స‌మాచారం.

N

Entertainment | Published On Sep 25, 2026, 3.51 pm IST

Mrunal Thakur | బ్లడీ రోమియో డబుల్ ధమాకా – ఇద్దరు హీరోయిన్లతో నాచుర‌ల్ స్టార్‌ రొమాన్స్!
Advertisement

Mrunal Thakur |  త‌న నెక్స్ట్ సినిమాలో నాచుర‌ల్ స్టార్ నాని ఇద్ద‌రు హీరోయిన్ల‌తో రొమాన్స్ చేయ‌బోతున్నాడు. ప్యార‌డైజ్ సినిమాతో కెరీర్‌లోనే పెద్ద విజ‌యాన్ని అందుకున్నాడు నాని. శ్రీకాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వంలో ఎమోష‌న‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీ మొద‌టి రోజే 80 కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను ద‌క్కించుకుంది. ప్యార‌డైజ్ త‌ర్వాత ఓజీ ఫేమ్ సుజీత్‌తో నాని ఓ రొమాంటిక్ యాక్ష‌న్ మూవీ చేయ‌బోతున్నాడు. బ్ల‌డీ రోమియో పేరుతో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాను నాని బ‌ర్త్‌డే సంద‌ర్భంగా అఫీషియ‌ల్‌గా అనౌన్స్‌చేశారు.

అక్టోబ‌ర్‌లో షూటింగ్ మొద‌లు....

అక్టోబ‌ర్ ఫ‌స్ట్ వీక్ నుంచి బ్ల‌డీ రోమియో షూటింగ్ అఫీషియ‌ల్‌గా ప్రారంభం కాబోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. యూర‌ప్‌లో ఫ‌స్ట్ షెడ్యూల్‌ను షూట్ చేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం. కాగా ఈ సినిమాలో నానికి జోడీగా ఇద్ద‌రూ హీరోయిన్లు క‌నిపించనున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి. ఓ హీరోయిన్‌గా పూజా హెగ్డే దాదాపు ఖాయ‌మైన‌ట్లు తెలిసింది. మ‌రో నాయిక‌గా మృణాల్ ఠాకూర్ పేరు వినిపిస్తోంది.

ట్రెడిష‌న‌ల్ రోల్‌లో...

పూజా హెగ్డే స్టైలిష్ రోల్‌లో క‌నిపించ‌బోతుండ‌గా...మృణాల్ రోల్ ట్రెడిష‌న‌ల్ లుక్‌తో ప‌ర్ఫార్మెన్స్ ప్ర‌ధానంగా సాగుతుంద‌ని అంటున్నారు. పూజా హెగ్డేతో నాని సినిమా చేయ‌బోతుండ‌టం ఇదే మొద‌టిసారి. మృణాల్ ఠాకూర్‌తో మాత్రం ఇదిసెకండ్ మూవీ. గ‌తంలో వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన హాయ్ నాన్న వంద కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌తో బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచింది. బ్ల‌డీ రోమియో మూవీని డీవీవీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై డీవీవీ దాన‌య్య నిర్మిస్తున్నారు.

మ‌ల‌యాళ న‌టుడు...

బ్ల‌డీ రోమియోలో మ‌ల‌యాళ న‌టుడు పృథ్వీరాజ్ సుకుమార‌న్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టించ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఫుడ్ మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో చెఫ్‌గా, గ్యాంగ్‌స్ట‌ర్‌గా రెండు డిఫ‌రెంట్ షేడ్స్‌తో కూడిన పాత్ర‌ల్లో నాని క‌నిపించ‌బోతున్నాడు.

బ్యాడ్‌టైమ్....

కాగా గ‌త కొద్ది రోజులుగా బాలీవుడ్‌తో పాటు తెలుగులో మృణాల్ ఠాకూర్ బ్యాడ్‌టైమ్ న‌డుస్తోంది. ఆమె న‌టించిన సినిమాలు వ‌రుస‌గా బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొడుతున్నాయి. ప్ర‌స్తుతం అల్లు అర్జున్ రాకాలో ఓ హీరోయిన్‌గా న‌టిస్తోంది మృణాల్ ఠాకూర్‌.

 

Advertisement
Advertisement