త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nithiin | అనౌన్స్ చేసిన మూడు నెల‌ల్లోనే థియేట‌ర్ల‌లోకి అలియాస్ రుక్మిణి – నాని … నితిన్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్‌

టాలీవుడ్ హీరోలు నితిన్‌, నాని కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న అలియాస్ రుక్మిణి మూవీ రిలీజ్ డేట్ ఫిక్స‌య్యింది. డిసెంబ‌ర్ 4న ఈ సినిమా థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. రొమాంటిక్ ఎంర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో నితిన్ హీరోగా న‌టిస్తుండ‌గా...నాని ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

N

Entertainment | Published On Oct 9, 2026, 2.45 pm IST

Nithiin | అనౌన్స్ చేసిన మూడు నెల‌ల్లోనే థియేట‌ర్ల‌లోకి అలియాస్ రుక్మిణి – నాని … నితిన్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్‌
Advertisement

Nithiin | నితిన్ క‌థానాయ‌కుడిగా హీరో నాని నిర్మాణంలో రూపొందుతోన్న అలియాస్ రుక్మిణి రిలీజ్ డేట్ క‌న్ఫామ్ అయ్యింది. రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాను డిసెంబ‌ర్ 4న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్న‌ట్లు నాని ప్ర‌క‌టించారు. ఓ కొత్త పోస్ట‌ర్‌ను అభిమానుల‌తో పంచుకున్నారు. ఇందులో భుజానికి బ్యాగ్ త‌గిలించుకొని జ‌నాల మ‌ధ్య‌లో నుంచి న‌డుచుకుంటూ వ‌స్తూ సింపుల్ లుక్‌లో నితిన్ క‌నిపిస్తున్నారు. ఈ పోస్ట‌ర్‌లో ఓ అమ్మాయి షాడో ఉండ‌టం ఆస‌క్తిని పంచుతోంది. ఆమె ఎవ‌ర‌న్న‌ది రివీల్ చేయ‌లేదు.

లిమిటెడ్ బ‌డ్జెట్‌లో...

అలియాస్ రుక్మిణి షూటింగ్ ఈ నెలాఖ‌రులోగా పూర్తికానున్న‌ట్లు స‌మాచారం. లిమిటెడ్ బ‌డ్జెట్ త‌క్కువ రోజుల్లోనే ఈ సినిమా చిత్రీక‌ర‌ణ‌ను పూర్తిచేయాల‌ని ప్లాన్ చేసిన‌ట్లు స‌మాచారం. బ్రేక్ లేకుండా నాన్ స్టాప్‌గా షూటింగ్ జ‌రుపుతోన్నారు. న‌వంబ‌ర్‌లో ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్తిచేసి డిసెంబ‌ర్ 4న థియేట‌ర్ల‌లోకి తీసుకురానున్నారు.

దండోరా ఫేమ్‌...

అలియాస్ రుక్మిణి సినిమాకు దండోరా ఫేమ్ ముర‌ళీకాంత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఓ ర‌చ‌యిత జీవితం ఆధారంగా ఈ మూవీ తెర‌కెక్కుతోంది. కృష్ణ అనే ర‌చ‌యిత రుక్మిణి పేరుతో ఎందుకు ర‌చ‌న‌లు చేశాడు? అస‌లు రుక్మిణి ఎవ‌రు? నిజంగానే అత‌డికి పెళ్ల‌య్యిందా? అనే అంశాల‌తో ఈ మూవీని డైరెక్ట‌ర్ దేవ‌కాంత్ తెర‌కెక్కిస్తోన్నారు.
రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌కు భిన్నంగా రియ‌లిస్టిక్ ఎమోష‌న్స్‌తో ఈ మూవీ సాగ‌నున్న‌ట్లు స‌మాచారం. అలియాస్ రుక్మిణి సినిమాకు విజ‌య్ బుల్గానిన్ మ్యూజిక్ అందిస్తున్నారు. సాయికుమార్ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. ఈ సినిమాలో నితిన్‌కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ ఆఫీయి స‌యీద్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

సితార బ్యాన‌ర్‌లో...

ప్ర‌స్తుతం అలియాస్ రుక్మిణితో పాటు తెలుగులో సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌లో నితిన్ ఓ సినిమా చేయ‌బోతున్నాడు. ఫ‌న్ ల‌వ్‌స్టోరీగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో వైష్ణ‌వి చైత‌న్య‌, రితికా నాయ‌క్ హీరోయిన్లుగా న‌టిస్తోన్నారు.

 

Advertisement
Advertisement