Nani Paradise | ఆయా షేర్ – నాని ప్యారడైజ్ షూటింగ్‌పై అప్‌డేట్ – రిలీజ్ డేట్ ఛేంజ్?
నాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో రూపొందుతోన్న ది ప్యారడైజ్ షూటింగ్‌పై ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ను మేకర్స్ రివీల్ చేశారు. ప్రస్తుతం నాని ఇంట్రడక్షన్ సాంగ్‌ను షూట్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ పాటకు జననాయగన్ ఫేమ్ సుధన్ మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు.
Entertainment | Published On Feb 9, 2026, 3.11 pm IST
Nani Paradise | దసరా బ్లాక్‌బస్టర్ తర్వాత నాచురల్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో రూపొందుతోన్న మూవీ ప్యారడైజ్. పీరియాడికల్ యాక్షన్ కాన్సెప్ట్‌తో నాని కెరీర్‌లోనే భారీ బడ్జెట్ మూవీగా ప్యారడైజ్ తెరకెక్కుతోంది. అనౌన్స్‌మెంట్‌తోనే అభిమానుల్లో ఈ సినిమాపై భారీగా అంచనాలు మొదలయ్యాయి. అందుకు తగ్గట్లే పోస్టర్స్, టీజర్స్‌తో ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌ను మేకర్స్ రెట్టింపు చేస్తోన్నారు. ఇందులో జడల్ అనే పాత్రలో నాని కనిపించబోతున్నారు. ఈ క్యారెక్టర్ కోసం నాని మేకోవర్ అయిన తీరు, లుక్, క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉన్నాయి.2026లోనే మోస్ట్ అవైటింగ్ సినిమాల్లో ఒకటిగా రూపొందుతోన్న ప్యారడైజ్ మూవీకి సంబంధించి మేకర్స్ ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ను రివీల్ చేశారు.
ఆయా షేర్...
ప్రస్తుతం ప్యారడైజ్ షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా సాగుతోంది. శంషాబాద్‌లో వేసిన ఓ భారీ సెట్‌లో నాని ఇంట్రడక్షన్ సాంగ్‌ను షూట్ చేస్తున్నారు. ఆయా షేర్ అంటూ సాగే మాస్ సాంగ్ సినిమాకు హైలైట్‌గా ఉండబోతుందట. ఈ పాట కోసం మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కంపోజ్ చేసిన ట్యూన్స్ థియేటర్లలో ఆడియెన్స్‌ను పూనకాలు తెప్పించడం ఖాయమని అంటున్నారు. ఈ ఇంట్రడక్షన్ సాంగ్‌కు జననాయగన్ ఫేమ్ సుధన్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించబోతున్నారు. నాని ట్రేడ్ మార్క్ స్టెప్పులతో వందలాది మంది డ్యాన్సర్లపై గ్రాండ్‌గా ఆయా షేర్ పాటను షూట్ చేస్తున్నారు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. జెర్సీ, గ్యాంగ్‌లీడర్ తర్వాత నాని, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కలయికలో హ్యాట్రిక్ మూవీగా ప్యారడైజ్ రాబోతుంది.
విలన్‌గా మోహన్ బాబు...
ప్యారడైజ్ మూవీలో టాలీవుడ్ సీనియర్ హీరో మోహన్‌బాబు విలన్‌గా కనిపించబోతున్నాడు. షికాంజ మాలిక్ అనే పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో నటించబోతున్నారు. మోహన్‌బాబుతో పాటు సంపూర్ణేష్‌బాబు, రాఘవ్ జుయల్‌తో పాటు పలువురు టాలీవుడ్, బాలీవుడ్ యాక్టర్లు ప్యారడైజ్‌లో కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.ప్యారడైజ్ మూవీలో నానికి జోడీగా కయదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తోంది.
రిలీజ్ డేట్ మారిందా?
ప్యారడైజ్ మూవీని మార్చి 26న రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. అఫీషియల్‌గా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. కానీ షూటింగ్ డిలే కావడంతో రిలీజ్ డేట్ మారినట్లు ప్రచారం జరుగుతోంది. జూన్ లేదా జూలైకి ఈ సినిమా పోస్ట్‌పోన్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మార్చి 26న నాని ప్యారడైజ్ ప్లేస్‌లో పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్‌సింగ్ థియేటర్లలోకి రాబోతుంది.
సంబంధిత వార్తలు

Kaviya Maran | కోలీవుడ్ రాక్‌స్టార్‌తో ఏడడుగులు వేయబోతున్న కావ్య పాప – పెళ్లి ఎప్పుడు..ఎక్కడంటే?
మే 21, 2026

anirudh | అల్లు అర్జున్ సినిమాకు అనిరుధ్ షాకింగ్ రెమ్యూనరేషన్ – రెహమాన్‌ను దాటేశాడుగా!
మే 3, 2026

Ashika Ranganath | నాచురల్ స్టార్ సరసన నా సామిరంగ బ్యూటీ….బ్లడీ రోమియోకు హీరోయిన్ దొరికిందా?
ఏప్రిల్ 26, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



