Nabha Natesh | నభానటేష్ కెమిస్ట్రీ – తొమ్మిదేళ్ల తర్వాత మాతృభాషలోకి ఇస్మార్ట్ బ్యూటీ రీఎంట్రీ
ప్రస్తుతం నభానటేష్ తెలుగులో నిఖిల్ స్వయంభూలో హీరోయిన్‌గా నటిస్తోంది. హిస్టారికల్ యాక్షన్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఇందులో నభానటేష్‌తో పాటు మరో నాయికగా సంయుక్త మీనన్ కనిపించబోతుంది.
Entertainment | Published On Oct 6, 2026, 1.46 pm IST
Nabha Natesh | నభానటేష్ మాతృభాష కన్నడం అయిన తెలుగులోనే ఎక్కువగా సినిమాలు చేసింది. 2018లో రిలీజైన నన్నుదోచుకుందువటేతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇస్మార్ట్ శంకర్ సినిమాలో తెలంగాణ అమ్మాయిగా మాస్ రోల్‌లో కనిపించింది. రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాతో హీరోయిన్‌గా నభానటేష్ పెద్ద విజయాన్ని అందుకుంది. డిస్కోరాజా, అల్లుడు అదుర్స్, నాగబంధంతో పాటు తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ వస్తోంది.
తొమ్మిదేళ్ల తర్వాత...
దాదాపు తొమ్మిదేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత మాతృభాషలోకి నభానటేష్ రీఎంట్రీ ఇవ్వబోతుంది. ఓ కన్నడ మూవీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ సినిమాలో హీరోతో పాటు టైటిల్ మంగళవారం రివీలయ్యాయి. రొమాంటిక్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు కెమిస్ట్రీ అనే పేరును ఖరారు చేశారు. ఈ కన్నడ మూవీలో ధ్రువ్ సర్జా హీరోగా నటిస్తోన్నాడు.
రొమాంటిక్ డైలాగ్...
ఓ స్పెషల్ వీడియో ద్వారా కెమిస్ట్రీ సినిమాను అనౌన్స్‌చేశారు. ప్రతి రిలేషన్‌లో ప్రేమ, ద్వేషం, బ్రేకప్, యాక్షన్ అన్ని ఉంటాయి. అప్పుడే ఆ కెమిస్ట్రీ బాగుంటుంది అంటూ సాగే రొమాంటిక్ డైలాగ్‌తో హీరోహీరోయిన్లు ధ్రువ్ సర్జా, నభానటేష్ పాత్రలను పరిచయం చేస్తూ ఈ వీడియో ఆసక్తికరంగా సాగింది.
యాక్షన్ టూ రొమాంటిక్...
కెరీర్ ఆరంభం నుంచి ఎక్కువగా యాక్షన్ సినిమాలు చేస్తూ వస్తోన్న ధ్రువ్ సర్జా కెమిస్ట్రీతో తన పంథా మార్చాడు. ఫస్ట్ టైమ్ రొమాంటిక్ లవ్‌స్టోరీతో అతడు చేస్తోన్న సినిమా ఇది. చివరగా మాతృభాష కన్నడంలో లీ అనే సినిమా చేసింది నభానటేష్. 2017లో ఈ మూవీ రిలీజైంది. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత కెమిస్ట్రీతో సాండల్‌వుడ్ ప్రేక్షకులను పలకరించబోతుంది.
కెమిస్ట్రీ సినిమాకు విశాల్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. టాలీవుడ్ ప్రొడ్యూపర్ టీజీ విశ్వప్రసాద్ ఈ కన్నడ సినిమాను నిర్మిస్తున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Harmanpreet Kaur | కెప్టెన్సీకి గుడ్‌బై.. హర్మన్‌ప్రీత్ సంచలన నిర్ణయం
- ●Ponnam Prabhakar | జ్ఞానేశ్‌కుమార్! రాజీనామా చెయ్
- ●SIP | వేతనంలో ఎస్ఐపీ కోసం ఎంత శాతం కేటాయించాలి.. 50-30-20 నియమం ఏమిటి..?
- ●Chanagani Dayakar | ఎంపీపై మార్ఫింగ్ వీడియో.. కొణతం దిలీప్‌ను వెంటనే అరెస్టు చేయండి
- ●INDIA bloc | జ్ఞానేశ్ ఇక చాలు బ్రో.. రాజీనామా చెయ్
- ●Pneumonic Plague | సైబీరియాలో న్యుమోనిక్ ప్లేగ్ కలకలం.. ఏంటిది.. ఎలా వ్యాపిస్తుంది, లక్షణాలు ఎలా ఉంటాయి..?

Harmanpreet Kaur | కెప్టెన్సీకి గుడ్‌బై.. హర్మన్‌ప్రీత్ సంచలన నిర్ణయం

Ponnam Prabhakar | జ్ఞానేశ్‌కుమార్! రాజీనామా చెయ్

SIP | వేతనంలో ఎస్ఐపీ కోసం ఎంత శాతం కేటాయించాలి.. 50-30-20 నియమం ఏమిటి..?

Chanagani Dayakar | ఎంపీపై మార్ఫింగ్ వీడియో.. కొణతం దిలీప్‌ను వెంటనే అరెస్టు చేయండి






